శోభన్‌బాబు, కృష్ణంరాజు.. వెండితెరపై ఈ ఇద్దరు దిగ్గజ నటులు కనిపిస్తే ఆ గంభీరత, ఆ డైలాగ్ పవర్, ఆ ఎమోషన్ మాటల్లో చెప్పలేం. పాత తరం తెలుగు సినిమా వైభవాన్ని గుర్తుచేస్తూ, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇద్దరూ ఇద్దరే’ చిత్రంలోని ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ సీన్ ఇప్పుడు నెటిజన్లను, టాలీవుడ్ క్లాసిక్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఈ వైరల్ వీడియోలో కృష్ణంరాజు, శోభన్‌బాబు మధ్య సాగే సంభాషణలు ప్రేక్షకుల గుండెలను పిండేస్తున్నాయి. చెల్లెలి లాంటి సీత జీవితాన్ని కాపాడటం కోసం అన్నగా కృష్ణంరాజు పడే ఆరాటం, తన తండ్రిని చంపి కుటుంబాన్ని నాశనం చేసిన శత్రువుపై పగ తీర్చుకునే వరకు పెళ్లి చేసుకోనని శోభన్‌బాబు చెప్పే భీషణ ప్రతిజ్ఞ ఈ సన్నివేశానికి ప్రధాన బలం.
తన చెల్లెలి మనసు విరిచావంటూ ఆవేశంతో శోభన్‌బాబును కృష్ణంరాజు కాలర్ పట్టుకుని నిలదీసే సీన్, దానికి ప్రతిగా శోభన్‌బాబు "నా బ్రతుకు ఒక పగబట్టిన పాము" అంటూ తన కడుపుకోతను వివరించే తీరు అద్భుతం. పగ తీరిన తర్వాత చట్టం నన్ను శిక్షిస్తే కట్టుకున్నదాని బతుకు ఏమవవాలని శోభన్‌బాబుప్రశ్నించే డైలాగులు అప్పట్లో థియేటర్లలో చప్పట్లు కురిపించాయి.
తల్లిలాంటి పాత్రలో ఉన్న పార్వతమ్మ వేదనను చూసి, తన పగకు కారణమైన హంతకుడు 'నాగరాజు' అని కృష్ణంరాజు బయటపెట్టడం కథను మలుపు తిప్పుతుంది. అయితే, ట్విస్ట్ ఏమిటంటే ఆ నాగరాజు ఎవరో కాదు.. స్వయంగా శోభన్‌బాబే! చెల్లెలి సుఖం కోసం తన ప్రాణాలనైనా ఇస్తానని, ఆమె పెళ్లి జరిపించడం కోసం తానే బలి కావడానికి సిద్ధపడే అన్నగా కృష్ణంరాజు చూపిన నటన కంటితడి పెట్టిస్తుంది.
ఈ సన్నివేశంలో మంజుల, చంద్రకళ తమ నటనతో ప్రాణం పోశారు. డ్రామాను రక్తికట్టించడంలో దర్శకుడి ప్రతిభ, నటీనటుల హావభావాలు, గంభీరమైన కంఠస్వరం ఈ సీన్‌ను తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎమోషనల్ డ్రామాగా నిలబెట్టాయి.
నేటి తరం యాక్షన్ సినిమాలకు భిన్నంగా, కేవలం డైలాగ్ డెలివరీ మరియు కళ్లల్లోని ఎమోషన్‌తోనే ఇంతటి తీవ్రతను తీసుకురావడం ఆనాటి లెజెండరీ నటులకే సాధ్యమైంది. ఈ అపురూప దృశ్యం పాత తరం జ్ఞాపకాలను గుర్తు చేస్తూ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.




