Home

»

Exclusive Movie News

CM కి తమ పవర్ ఏంటో చూపించిన SPG కమాండోస్

Jun 1, 2026 4:20PM

 

తెలుగు సినిమా చరిత్రలో పొలిటికల్ డ్రామాలకి  ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ కోవలోనే ఒక జర్నలిస్ట్ ఒకే ఒక్క రోజు ముఖ్యమంత్రిగా మారితే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విలక్షణమైన కథాంశంతో తెరకెక్కిన మూవీ 'ఒకే ఒక్కడు'.(Oke okkadu)యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన 'ఈ  చిత్రం తమిళ, తెలుగు భాషల్లో  సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు నాట ఎన్నో థియేటర్స్ లో వంద రోజులు జరుపుకున్న ఈ మూవీ ఎప్పటికీ మర్చిపోలేని పొలిటికల్ థ్రిల్లర్. మూవీలోని ప్రతి   సీన్  దేనికవే వైవిధ్యంతో ఉంటాయి. గూస్‌బంప్స్ రావడం కూడా పక్కా. అలాంటి  గూస్‌బంప్స్ వచ్చే సన్నివేశం ఈ వీడియోలో ఉంది

ఒక్క రోజు సిఏం గా ఉన్న జర్నలిస్ట్ పురుషోత్తం( అర్జున్)  తన ప్రేయసి(మనీషా కొయిరాలా) ని కలుసుకోవాలని అనుకుంటాడు. కానీ సెక్యూరిటీ చీఫ్ ఒప్పుకోడు. దీంతో మారు వేషంలో తన ప్రేయసి గ్రామానికి వెళ్తాడు. మార్గ మధ్యంలో ప్రేయసికి పూలు కొంటాడు. కానీ డబ్బులు ఉండవు. దీంతో పూలు అమ్మే ఆవిడకి తనెవరో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో వచ్చే డైలాగ్స్, సీన్స్ సూపర్ గా ఉంటాయి. ఆ తర్వాత పురుషోత్తం తన ప్రేయసిని కలవడం, ఇద్దరి మధ్య లవ్ సీన్స్ బాగుంటాయి. కానీ అశాంఘిక శక్తులు పురుషోత్తంని కనిపెట్టి దాడి చేస్తారు. ఈ సందర్భంగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఆ తర్వాత మరో దాడిలో పురుషోత్తం తన తల్లి తండ్రులని కోల్పోతాడు. 


ఇన్నేళ్లయినా సదరు సన్నివేశాలని చూసినప్పుడు ప్రేక్షకులకి  అదే స్థాయి ఉద్వేగం, గూస్‌బంప్స్ రావడం విశేషం.యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఈ చిత్రంలో ఆయన నటన అద్వితీయం. ముఖ్యంగా టీవీ జర్నలిస్ట్‌గా  ముఖ్యమంత్రి రఘువరన్‌ని  ఇంటర్వ్యూ చేసే సీన్ సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తుంది. అవినీతి, రాజకీయ నాయకుల బాధ్యతారాహిత్యంపై అర్జున్ సంధించే ప్రశ్నలు, దానికి ముఖ్యమంత్రి ఇచ్చే సమాధానాలు థియేటర్లలో చప్పట్ల వర్షం కురిపించాయి.సరిగ్గా ఆ ఇంటర్వ్యూలోనే ఒకరోజు ముఖ్యమంత్రిగా సవాల్ స్వీకరించే ఘట్టం ప్రేక్షకుడిని కథలోకి పూర్తిగా లాగేసుకుంటుంది. ఆ ఒక్క రోజులో అర్జున్ తీసుకునే సంచలన నిర్ణయాలు, అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడం వంటి సన్నివేశాలను శంకర్ ఎంతో గ్రిప్పింగ్‌గా మలిచారు.ఈ చిత్రంలో మనీషా కోయిరాల కథానాయికగా నటించగా, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కేవలం పొలిటికల్ డ్రామాగానే కాకుండా, మధ్యలో వచ్చే లవ్ స్టోరీ, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో కుదిరిన క్లాసిక్ ఇది.  ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి  కూడా ఈ మూవీలోని  సంభాషణలు, ఐడియాలజీ ఎంతో రెలవెంట్‌గా అనిపిస్తాయి. అందుకే యూట్యూబ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన అల్టిమేట్ సీన్స్ ఎప్పుడు అప్‌లోడ్ చేసినా మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతూనే ఉంటాయి.ఇలాంటి కాలాతీత చిత్రాలు మళ్లీ మళ్లీ రావాలని, నేటి తరం దర్శకులకి  కూడా ఈ సినిమా ఒక పాఠ్యపుస్తకం లాంటిదని నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com