Home

»

Exclusive Movie News

నందినీ రెడ్డి ఓపెన్ టాక్.. సౌందర్య గారు నిజంగానే బంగారం.. సమంతను అలా ఎందుకు పిలుస్తానంటే?

Jun 27, 2026 11:22AM

టాలీవుడ్‌లో తనదైన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రత్యేక ముద్ర వేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ బి.వి. నందినీ రెడ్డి (Nandini Reddy) తాజాగా తెలుగువన్‌(TeluguOne)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) ప్రమోషన్స్ లో భాగంగా సినిమా విశేషాలతో పాటు ఇండస్ట్రీలో తన ప్రయాణం, ఎదురైన సవాళ్లపై ఓపెన్ అయ్యారు. 

15 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయన్న ఆమె, ఇప్పటికీ తనను 'లేడీ డైరెక్టర్' అని సంబోధించడంపై విలక్షణంగా స్పందించారు. ఇండస్ట్రీలో మహిళా దర్శకులు చాలా తక్కువగా ఉండటం వల్లే తనను ఏదో ఒక 'వింత ప్రాణి'లా చూస్తారేమో అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

తన గురువు కృష్ణవంశీ వద్ద పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, ఒకే ఫ్రేమ్‌లో 50 మందిని పెట్టి ఎలా హ్యాండిల్ చేయాలో ఆయన నుంచే నేర్చుకున్నానని చెప్పారు. అలాగే అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సౌందర్యగారు నిజంగానే ఒక బంగారం అని, తనకు పానీపూరి అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. బెంగళూరులో కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు తనను చూడటానికి రమ్మని పిలిచారని, ఆవిడ రాసిన హ్యాండ్ రిటన్ నోట్స్ ఇప్పటికీ తన వద్ద పదిలంగా ఉన్నాయని తెలిపారు. నటి రమ్యకృష్ణ కళ్లు ఎంతో పవర్‌ఫుల్ అని, ఆమె నటనలోని పూర్తి పొటెన్షియల్ ఇంకా టాలీవుడ్ పూర్తిగా వాడుకోలేదని అభిప్రాయపడ్డారు.

ఇక స్టార్ హీరోయిన్ సమంత గురించి మాట్లాడుతూ, తన ఫోన్‌లో సమంత పేరును 'సామ్ క్రూజ్' అని సేవ్ చేసుకున్నట్లు వెల్లడించారు. సమంత ఎదుర్కొన్న హెల్త్ ఇష్యూస్ (మయోసైటిస్) గురించి చెబుతూ, ఆమెలోని ఎక్స్‌ట్రీమ్ డిసిప్లిన్ వల్లే ఆ సమస్యల నుంచి ఓవర్‌కమ్ చేయగలిగిందని కొనియాడారు. టేస్ట్ లేకపోయినా కేవలం ఆరోగ్యం కోసం మూడు పూటలా ఒకే రకమైన ఫుడ్ తినడం సమంతకు మాత్రమే సాధ్యమని, ఆమె ఒక బీస్ట్‌లా కష్టపడుతుందని ప్రశంసించారు.

ఈ రోజుల్లో సినిమాల్లో బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్న తరుణంలో, కథలో దమ్ముంటే సినిమా ఎక్కడికైనా వెళ్తుందని నందినీ రెడ్డి నమ్మకంగా చెప్పారు. 100 కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో కాకుండా, మనసుకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తే 100 కోట్లు కాదు 1000 కోట్లు అయినా వస్తాయని తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఓటీటీ వల్ల థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించడం ఛాలెంజింగ్‌గా మారిందని, కంటెంట్ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్లకు వస్తారని నేటి తరం మేకర్స్‌కు విలువైన సూచనలు చేశారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com