Home

»

Exclusive Movie News

తిండిబోతు కోడలితో అత్త కష్టాలు.. కాపురం ఎప్పుడు చేస్తారో? నేను నానమ్మ ఎప్పుడవుతానో?

Aug 3, 2026 12:19PM

టాలీవుడ్ కి హాస్యాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన దర్శకుడు, హాస్య బ్రహ్మ జంధ్యాల శైలి ఎప్పుడూ ప్రత్యేకం. సాధారణ కుటుంబ సన్నివేశాల్లోంచే అద్భుతమైన హాస్యాన్ని పిండుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'చూపులు కలిసిన శుభవేళ' సినిమాలోని బ్రహ్మానందం-శ్రీలక్ష్మి కామెడీ ట్రాక్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు. తిండిబోతు భార్యాభర్తలుగా ఇద్దరూ నవ్వుల వర్షం కురిపించారు.

ఇందులో సుబ్రహ్మణ్యం అనే తిండిబోతు పాత్రలో బ్రహ్మానందం కనిపించాడు. ఫుడ్ చూస్తే కంట్రోల్ చేసుకోలేడు. అది పొట్టలోకి చేరే వరకు కుక్క చూపు చూస్తూనే ఉంటాడు. దాంతో పెళ్లి చూపులు ఫెయిల్ అవుతుంటాయి. అయితే ఈసారి అలా కాకూడదని ముందు జాగ్రత్తగా.. పలహారాలు తన కంట పడకుండా దూరంగా ఉంచమని కోరతాడు.

సరిగ్గా అదే సమయంలో వధువు మండోదరి(శ్రీలక్ష్మి) ప్రవేశిస్తుంది. సుబ్రహ్మణ్యం ఆమెను సాధారణంగా అభిరుచులు ఏంటని ప్రశ్నించగా, మండోదరి ఇచ్చే సమాధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండుకుని లాగించడం నా అభిరుచి అంటూ తన తిండి యావను బయటపెడుతుంది. అయితే సుబ్రహ్మణ్యం కూడా తిండిబోతు కావడంతో తనతో శృతి కలుపుతాడు. ఇద్దరూ కలిసి వంటకాల గురించి తెగ మాట్లాడుకుంటారు.

ఈ సమయంలో వరుడు తల్లి, వధువు తండ్రి మధ్య సంభాషణ కూడా నవ్వులు పూయిస్తుంది. "మండోదరి అంటే కప్ప పొట్ట గలదని అర్థం కదా" అని వరుడు తల్లి అడగగా.. "మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను" అని వధువు తండ్రి అంటాడు. "కక్కు చూపుకి, కప్పు పొట్టకి బాగా సరిపోయింది.. ముహూర్తం పెట్టించేద్దాం" అని ఇద్దరూ అనుకుంటారు.

పెళ్లి తర్వాత కూడా కాపురం చేయడం మానేసి.. సుబ్రహ్మణ్యం, మండోదరి ఎప్పుడూ తిండి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. వంకాయ కూరను అల్లం పెట్టి వండితే అద్భుతంగా ఉంటుందని ఒకరంటే, లేదు వంకాయ వేపుడు చేస్తే స్వర్గానికి అంగుళమే దూరమని ఇంకొకరు అంటారు. గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి, దాన్ని వేసి శివంగి పులుసు తయారుచేస్తే ఆ రుచే వేరని ఒకరంటే, పనసకాయ కూర పక్కన వెన్నముద్ద పెట్టుకుని తింటే ఉండే అనుభూతిని వర్ణిస్తూ వంటకాలపై పెద్ద చర్చకే తెరలేపుతారు. 

వీళ్ళ తిండి గోలను కళ్లారా చూసిన సుబ్రహ్మణ్యం తల్లి.. వీళ్ళు పచ్చళ్లు, కూరల గురించే చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎలా చేస్తారో, తాను నాయనమ్మను ఎప్పుడు అవుతానో అని ఆమె పడే తాపత్రయం, ఆవేదన ఈ సన్నివేశంలో పీక్ హాస్యాన్ని అందిస్తాయి. జంధ్యాల రాసిన సంభాషణలు, నటీనటుల టైమింగ్ ఈ క్లాసిక్ కామెడీ సీన్‌ను ఎవర్ గ్రీన్ గా నిలిపాయి.

 

 

Choopulu Kalasina Subhavela, Jandhyala Comedy, Brahmanandam, Sri Lakshmi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com