
వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ లైనప్‌లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ చేరినట్లు ఫిలిం నగర్ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్, 'ఇరుముడి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా దాదా సినిమా షూటింగ్ గ్యాప్‌లో మైసూర్‌లో బాలకృష్ణను కలిసిన శివ నిర్వాణ, ఆయనకు ఒక అద్భుతమైన స్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. ఈ లైన్ నచ్చడంతో బాలయ్య ఫుల్ ఎగ్జైట్ అయిపోయి, పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి డీటెయిల్డ్‌గా వినిపించాల్సిందిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుత ట్రెండ్‌లో కేవలం మాస్ ఇమేజ్, కమర్షియల్ ఫార్ములా సినిమాలే కాకుండా, కంటెంట్ ఓరియెంటెడ్ రూటెడ్ సబ్జెక్ట్‌లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపించాయి. స్టార్ హీరోల ఇమేజ్, మార్కెట్ మానరిజమ్స్ పక్కన పెట్టి, కేవలం కథను నమ్ముకుని నిజాయితీగా సినిమాలు తీస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇదే ఫార్ములాను బ్రేక్ చేస్తూ శివ నిర్వాణ చెప్పిన రూటెడ్ కంటెంట్ సబ్జెక్ట్‌కు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాలీవుడ్‌లో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య చేసిన ప్రయోగం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది.
ఇప్పుడు శివ నిర్వాణతో చేయబోయే సినిమా మరింత పకడ్బందీగా, ఎలాంటి రాజీ లేకుండా ప్యూర్ కంటెంట్ ఆధారంగా తెరకెక్కనుందని తెలుస్తోంది. బాలకృష్ణ మార్క్ ఎనర్జీకి, శివ నిర్వాణ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో దాదా సినిమాతో పాటు, కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సిన ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. అలాగే వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీలోనూ బాలయ్య ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ల మధ్య శివ నిర్వాణతో చేయబోయే ఈ కొత్త చిత్రం ఏ విధంగా ఉండబోతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: బాలీవుడ్‌లో చేస్తే గ్లామర్.. టాలీవుడ్‌లో చేస్తే వివాదమా?
[Balakrishna Shiva Nirvana Movie, Balakrishna New Movie, Dada Movie, NBK112 Movie, NBK113 Movie, Nandamuri Balakrishna, Shiva Nirvana, Irumudi Movie, Telugu Film News]





