తెలుగు సినిమా చరిత్రలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు, హాస్య రస ప్రధాన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో వంశీ ఒకరు. ఆయన చేసిన అద్భుతమైన సినిమాల్లో ‘ఏప్రిల్ 1 విడుదల’ ఒకటి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా, శోభన హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, బుల్లితెరపై ఇప్పటికీ ఎప్పుడు టెలికాస్ట్ అయినా ఆడియన్స్‌ను టీవీలకు కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే కొన్ని కామెడీ బ్లాక్స్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.
ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ పోషించిన 'దివాకరం' పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ కాలం వెళ్లదీసే దివాకరం, తన ప్రేమను గెలుచుకోవడానికి కేవలం నిజాలే చెప్పాలనే ఛాలెంజ్ ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో ఆయన చెప్పే నిజాలు ఎదుటివారి ఇళ్లల్లో ఎలాంటి కలకలం రేపాయనేది దర్శకుడు వంశీ ఎంతో కామెడీగా మలిచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ కామెడీ సీన్ సోషల్ మీడియా వేదికగా మళ్లీ వైరల్ అవుతూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. భాగ్యం (జయలలిత), భీమరాజుల కొడుకు పోలికల గురించి ఇంట్లో పెద్ద చర్చ నడుస్తుంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన దివాకరంను పిలిచి, బాబు ఎవరి పోలికో చెప్పమని బలవంతం చేస్తారు. ఆ ఇరుకాటంలో పడ్డ దివాకరం నిజం దాచలేక, బాబు పక్కింటి రాజన్ పోలిక అంటూ బాంబు పేలుస్తాడు. ఆ తర్వాత దివాకరం తన నోటి దురదతో దంపతుల మధ్య, భాగ్యం మధ్య లేనిపోనివన్నీ చెప్పి పెద్ద గొడవకు కారణమౌతాడు.
ఇక ఈ గొడవ కాస్తా ముదిరి అది మల్లికార్జునరావు వరకు వెళుతుంది. దీంతో అతనికి గట్టి పూజ జరుగుతుంది. ఒళ్లంతా దెబ్బలతో, కట్టుకట్టుకుని ఉన్న అతను తనను ఎవరూ కొట్టలేదని, సినిమాలో లాగా ఫైటింగ్ చేయడం వల్లే ఈ దెబ్బలు తగిలాయని కవర్ చేసే ప్రయత్నం చేయడం అల్టిమేట్ కామెడీ. ఒకవైపు దెబ్బలతో నడవలేకపోతున్నా, పరువు కోసం పడే తపనను మల్లికార్జునరావు తన అద్భుతమైన టైమింగ్‌తో పండించారు.
ఈ సీన్ లో లేటు నటుడు మల్లికార్జునరావు నటన అమోఘం. వంశీ మార్క్ డైలాగులను ఆయన పలికించిన తీరు, భయపడుతూనే నిజాలు ఒప్పుకునే క్యారెక్టరైజేషన్ ఈ రోల్ ను ఎవర్ గ్రీన్ గా నిలబెట్టాయి. కేవలం మాటల చాతుర్యంతోనే సీన్ ను ఇంతలా పండించడం ఒక్క వంశీకే సాధ్యమని ఈ క్లిప్ చూస్తే మరోసారి అర్థమవుతుంది.
ఈ క్లాసిక్ కామెడీ సీన్ పై నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఈ తరం సినిమాల్లో ఇలాంటి సహజమైన, బూతులు లేని క్లీన్ కామెడీ మిస్ అవుతున్నాం" అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాజేంద్రప్రసాద్, మల్లికార్జునరావుల కాంబినేషన్ టాలీవుడ్ బెస్ట్ కామెడీ కాంబోలలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు కూడా ఈ వీకెండ్ లో కాసేపు హాయిగా నవ్వుకోవాలనుకుంటే, ఈ వింటేజ్ నవ్వుల జాతరను అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి ఫన్నీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.





