
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'లేడీ సూపర్‌స్టార్' అనే బిరుదుకు నిలువెత్తు నిదర్శనం విజయశాంతి. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, హీరోలతో సమానంగా యాక్షన్, ఎమోషనల్, సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హిస్టరీ ఆమెది. ఆ కాలంలో విజయశాంతి నటిస్తున్నారు అంటేనే థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడేవి. ముఖ్యంగా ఆమె పలికించే రౌద్రం, ఎమోషన్స్ థియేటర్లలో చప్పట్లు, ఈలలు కురిపించేవి.
తాజాగా టాలీవుడ్ వింటేజ్ క్లాసిక్ 'ఆశయం' (Aasayam) సినిమాలోని ఒక పవర్‌ఫుల్ హై వోల్టేజ్ ఎమోషనల్ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో విజయశాంతి, ప్రముఖ విలక్షణ నటుడు చరణ్ రాజ్ మధ్య జరిగే డైలాగ్ వార్ ప్రేక్షకుల చేత ఇప్పటికీ హ్యాట్సాఫ్ చెప్పిస్తోంది. కేవలం ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ సీన్ చూస్తేనే గుండె బరువెక్కడం ఖాయం.
ఈ సన్నివేశంలో ఒక మహిళ వృద్ధురాలైన అత్త(వడివుక్కరసి)ని ఇంట్లో నుండి గెంటివేస్తూ, "నీ కూతురు వల్లే నా మొగుడి ఉద్యోగం పోయింది, ఆ ఉద్యోగం ఇప్పించాకే ఈ గుమ్మంలో అడుగుపెట్టు" అంటూ క్రూరంగా ప్రవర్తిస్తుంది. సరిగ్గా అదే సమయానికి పరుచూరి అక్కడకు ఎంట్రీ ఇచ్చి, ఆ మహిళకు ఇచ్చే కౌంటర్ డైలాగ్స్ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు.
"నీ ఆడంబరాల కోసం భర్తను అవినీతిపరుడిగా మార్చావు.. నీ సుఖాల కోసం లంచగొండిని చేశావు" అంటూ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో కడిగిపారేసే తీరు అద్భుతం. తన భర్తను తల్లిదండ్రులకు దూరం చేసిన పాపం శాపమై తగులుతుందని, కేవలం డబ్బు కోసం పొలిటికల్ బ్రోకర్‌గా మారి ఎంతకైనా దిగజారే మనస్తత్వం అతనిదని నిలదీసే విధానం అప్పటి సమాజంలో ఉన్న కొన్ని చేదు నిజాలను కళ్లకు కడుతుంది.
ఇక ఈ సీన్‌లో మరో మేజర్ అట్రాక్షన్ విజయశాంతి ఎంట్రీ. తన సోదరుడు పాత్రధారి చరణ్ రాజ్ ను ఉద్దేశించి విజయశాంతి చెప్పే డైలాగ్స్ ఈ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. తల్లి పడుతున్న కష్టాన్ని, ఆ కన్నీళ్లను చూస్తూ.. "అమ్మ తలుచుకుంటే ఏసీ కార్లలో తిరగగలదు, ఏడంతస్తుల మేడల్లో ఉండగలదు. సాంప్రదాయం కోసం ఈ జీవితాన్ని కోరుకుంది. నీ ఒంటి మీద కాకీ బట్టలు ఉండి ఉంటే.. ఆవిడను అమ్మ అని కాదు, అమ్మగారు అని సెల్యూట్ కొట్టేవాడివిరా స్కౌండ్రల్" అంటూ విజయశాంతి రౌద్రంగా పలికే డైలాగ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి.
నువ్వు ప్రయాణిస్తున్నది డెడ్ ఎండ్ రోడ్డు అని, ఇప్పటికైనా తెలుసుకోకపోతే పాతాళంలో పడిపోతావ్ అంటూ చరణ్ రాజ్ ను పరుచూరి హెచ్చరించే డైలాగ్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో విజయశాంతి, చరణ్ రాజ్ ఇద్దరూ పోటీపడి మరీ నటించారు. వారిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, నటన ఈ నాటి తరం నటీనటులకు ఒక అద్భుతమైన లెసన్ లాంటిదని చెప్పక తప్పదు.
ఈ వింటేజ్ క్లాసిక్ సీన్ చూసిన నెటిజన్లు ఆ రోజుల్లో తెలుగు సినిమా కంటెంట్, నటీనటుల ప్రతిభ ఎంత గొప్పగా ఉండేదో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటి సినిమాల్లో ఇలాంటి పవర్‌ఫుల్ కంటెంట్, గుండెను తాకే డైలాగ్స్ కరువయ్యాయని పాత తరం సినిమా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
Vijayashanti, Aasayam Movie, Heart Touching Scene, TeluguOne





