Home

»

tmdbexclusive

తొక్కిపెట్టి నార తీస్తా.. బాలయ్య పవర్‌ఫుల్ మాస్ ఎంట్రీకి పూనకాలే!

May 04, 2026

నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్.. ఆ మాస్‌కు కేరాఫ్ అడ్రస్ ఆయన డైలాగ్ డెలివరీ. దశాబ్దాలు గడిచినా బాలయ్య పాత సినిమాల్లోని ఎంట్రీ సీన్లు చూస్తుంటే అభిమానులకు ఇప్పటికీ పూనకాలు రావాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'సీమసింహం' మూవీలోని బాలయ్య ఎంట్రీ సీన్ మరోసారి ట్రెండ్ అవుతోంది. పేదలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోని ఒక సామాన్యుడిగా బాలయ్య చెప్పే డైలాగులు థియేటర్లను షేక్ చేశాయి.

ఈ సీన్ విషయానికి వస్తే.. ఒక ముసలావిడ ఇంటిని పోలీసులు పదేళ్లుగా అద్దె కట్టకుండా, ఖాళీ చేయకుండా వేధిస్తుంటారు. పైగా ఆ ముసలావిడ కూతుళ్లపై అసభ్యంగా ప్రవర్తిస్తూ పోలీసులనే అహంకారంతో రెచ్చిపోతారు. సరిగ్గా అదే సమయంలో బాలయ్య ఎంట్రీ ఇస్తారు. "ఐదు నిమిషాల్లో సామాన్లతో సహా పోలీస్ స్టేషన్ ఖాళీ చేయకపోతే.. తొక్కిపెట్టి నార తీస్తా" అంటూ ఆయన పంపిన వార్నింగ్ లెటర్ సినిమాలోనే హైలైట్ అని చెప్పాలి.

బాలయ్య స్టేషన్‌లోకి అడుగుపెట్టే విధానం, ఆ గంభీరమైన వాయిస్ అభిమానులను కట్టిపడేస్తాయి. ఎస్ఐ అడిగే ప్రశ్నలకు సమాధానంగా "ఆల్ ఏరియాస్ మనవే.. రాయలసీమకెళ్తే రాళ్లు చెబుతాయి, కోస్తాకెళ్తే గోదావరి నీళ్లు చెబుతాయి, తెలంగాణకెళ్తే ఎర్రటి బీళ్లు చెబుతాయి" అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ బాక్సాఫీస్ వద్ద విజిల్స్ వేయించింది. కేవలం డైలాగులే కాకుండా, అన్యాయం చేసే పోలీసులను ఉతికి ఆరేసే యాక్షన్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడుతుంది.

ముఖ్యంగా ఈ సీన్‌లో బాలయ్య తన పాత సూపర్ హిట్ పాత్రలను గుర్తుచేస్తూ.. "అన్యాయం జరిగితే లెగ్గు పెడతా.. నల్ల దొరలను తరిమికొట్టేటప్పుడు సర్దార్ పాపారాయుడు, శత్రువులను హతమార్చేటప్పుడు బొబ్బిలి పులి, పేదలకు అండగా నిలిచేటప్పుడు జస్టిస్ చౌదరి" అంటూ చెప్పే డైలాగ్స్ ఎవర్ గ్రీన్. ఎన్టీఆర్ సినిమాల పేర్లను ప్రస్తావిస్తూ ఆయన చేసిన ఈ పెర్ఫార్మెన్స్ నందమూరి ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తుంది.

చివరలో ఆ ముసలావిడ "భగవద్గీతలో పాపం పెరిగినప్పుడు పుడతానని కృష్ణుడు చెప్పాడు, ఆయన నిన్ను పంపించాడు" అని అనగానే, "నేను దేవుడిని కాదమ్మా.. మీలో ఒకడిని" అని బాలయ్య చెప్పే డైలాగ్ మనసుని హత్తుకుంటుంది. ఈ పవర్‌ఫుల్ ఎంట్రీ సీన్ ఇప్పటికీ యూట్యూబ్‌లో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. బాలయ్య మార్క్ యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ సీన్ ఆయన కెరీర్‌లోని బెస్ట్ ఎంట్రీలలో ఒకటిగా నిలిచిపోతుంది. ఇలాంటి ప‌వ‌ర్‌ఫుల్ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com