Home

»

Exclusive Movie News

పొట్టచెక్కలయ్యే కామెడీ.. రాజేంద్ర ప్రసాద్ ఎవ‌ర్ గ్రీన్ వీడియో మ‌ళ్లీ వైర‌ల్ అవుతోంది!

May 09, 2026

తెలుగు సినీ ప్రేక్షకులకు రాజేంద్ర ప్రసాద్ పేరు వింటేనే ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది. ఆయన కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా సోషల్ మీడియాలో 'ఏప్రిల్ 1 విడుదల' సినిమాలోని ఒక కామెడీ క్లిప్ తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజేంద్ర ప్రసాద్ తన మార్క్ నటనతో ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నారు.

ఈ సీన్‌లో ప్రధానంగా రాజేంద్ర ప్రసాద్ అబద్ధాలు చెప్తూ అందరినీ ఎలా బురిడీ కొట్టిస్తారనేది ఎంతో సరదాగా చూపించారు. ముఖ్యంగా 'దుబాయ్ టీవీ' చుట్టూ తిరిగే కామెడీ సీన్ హైలైట్‌గా నిలిచింది. షిప్‌లో ఇప్పుడే దిగిందని, దీని ఖరీదు వేలల్లో ఉంటుందని ఆయన బిల్డప్ ఇచ్చే తీరు అద్భుతం. ఆ టీవీని పట్టుకుని ఆయన పడే పాట్లు, ఆ తర్వాత జరిగే గందరగోళం ఇప్పటికీ మనల్ని కడుపుబ్బ నవ్విస్తాయి. 

దివాకరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ ఒదిగిపోయిన తీరు ఈ సినిమాకే ప్రాణం. అబద్ధం చెప్పడమే వృత్తిగా పెట్టుకున్న వ్యక్తి, ఒక చిన్న టీవీ కోసం ఎంతటి హైడ్రామా క్రియేట్ చేస్తాడో ఈ క్లిప్‌లో చూడవచ్చు. "దుబాయ్ నుంచి అబ్దుల్ సులేమాన్ ఖాన్ పంపించాడు" అంటూ ఆయన చెప్పే డైలాగులు ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.

దర్శకుడు వంశీ మార్క్ మేకింగ్, రాజేంద్ర ప్రసాద్ కామెడీ సెన్స్ తోడైతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సీన్ నిరూపిస్తుంది. శోభనతో ఆయన కెమిస్ట్రీ, ఆ పల్లెటూరి వాతావరణం ప్రేక్షకులకు ఒక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తుచేస్తాయి. నేటి జనరేషన్ వాళ్లు కూడా ఈ పాత కామెడీ సీన్స్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారంటే అది ఆ సినిమా గొప్పతనం.

మొత్తానికి, ఎంత కాలం గడిచినా రాజేంద్ర ప్రసాద్ మార్క్ కామెడీకి తిరుగులేదని ఈ వీడియో మరోసారి స్పష్టం చేస్తోంది. మీరూ ఆ నవ్వుల విందును ఆస్వాదించాలనుకుంటే ఈ వీడియోపై ఓ కన్నేయండి. ఇలాంటి అద్భుత‌మైన కామెడీ స‌న్నివేశాల కోసం మాTeluguone youtube channelను Subscribe చేసుకోండి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com