
Karthika deepam2 : కార్తీక దీపం 2 లేటెస్ట్ ట్విస్ట్: దీపను చంపాలనుకున్న జ్యోత్స్న.. షాకిచ్చిన కార్తీక్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -636 లో..... కేక్ కటింగ్ దగ్గరికి అందరు వస్తారు. ప్రతీ ఇంట్లో దీప లాంటి అమ్మాయి ఉంటే.. ఆ ఇల్లు బాగుంటుందని పారిజాతం అంటుంది. సుమిత్ర కేక్ కట్ చేస్తుంది. కేక్ లో జ్యోత్స్న విషం కలుపుతుంది. ఎక్కడ తనకి తినిపిస్తుందోనని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ముందు దీపకి తినిపించమని దశరథ్ అంటాడు. సుమిత్రని కాపాడింది ఒకరకంగా దీప కూడా కారణం.. ఇద్దరు నా కూతుళ్ళే దీప నా పెద్ద కూతురు అని దశరథ్ అనగానే నేను డాడీ మాటకి సరే అంటున్నా దీపకే తినిపించు మమ్మీ అని జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ కంగారుపడతాడు దీపకి సుమిత్ర కేక్ తినిపిస్తుంది. కార్తీక్ కూడా తింటాడు. అదేంటీ ఇంకా దీప చావలేదని జ్యోత్స్న అనుకుటుంది. జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వెళ్లి షాక్ అయ్యావా మరదలా.. నువ్వు విషం కల్పడం నేను చూసాను.. నేను ఎందుకు టెన్షన్ పడ్డాననుకుంటున్నావా నాకు తెలిసిపోయిందని నీకు తెలిస్తే ప్లాన్ చేంజ్ చేస్తావ్ కదా అందుకే యాక్టింగ్ చేసానని కార్తీక్ అనగానే జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత జ్యోత్స్న, కార్తీక్ ఇద్దరు పక్కకి వెళ్తారు. ఇక జ్యోత్స్న ఓపెన్ గానే కార్తీక్ తో మాట్లాడుతుంది. ఏంటి మరదలా డిఎన్ఏ టెస్ట్ చేయించినట్లున్నావ్.. నిజం తెలిసి పోయిందా అని కార్తీక్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను ఎక్కడ ఏది దాచిన కూడా వట్టిగనే తెలిసిపోతుంది బావ అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే దాస్ వస్తాడు. నా గురించి బావకి నువ్వే చెప్పావ్ కదా నాన్న అని దాస్ ని జ్యోత్స్న అడుగుతుంది. మావయ్యకి నీ గురించి నిజం తెలియలేదు తెలిస్తే ఇలా ఎందుకు ఉంటాడని కార్తీక్ అంటాడు. ఇంకా నన్ను మభ్యపెట్టాలని చూడకు బావ అని జ్యోత్స్న అంటుంది. అల్లుడు చెప్పేది నిజమే అని దాస్ అనగానే నువ్వు మాట్లాడకు నాన్న నా మీద ఒట్టేసినా కూడా అందరికి నిజం చెప్పావని దాస్ పై జ్యోత్స్న ఫైర్ అవుతుంది. నువ్వు నన్ను చంపాలని ట్రై చేసావని దాస్ అంటాడు. అప్పుడు నువ్వు నిజం చెప్పకుండా ఆపాలని అలా చేశాను కానీ చాలా సార్లు గిల్టీగా ఫిల్ అయ్యానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 05, 2026.webp)
బ్రహ్మముడి: ఇందు కిడ్నాప్‌కు మాస్టర్ ప్లాన్.. రాజుకు సాహో సీరియస్ వార్నింగ్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -998 లో..... రాజు లక్కీ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి సాహోతో రాజు పేరెంట్స్ సరదాగా కబుర్లు చెప్తుంటారు. నీ ఫ్రెండ్ సాహో మంచిగా చాపలు తీసుకొని వచ్చాడ్రా అని లక్ష్మి చెప్తుంది. అప్పుడే దెబ్బలతో వెంకీ ఎంట్రీ ఇస్తాడు. ఏమైంది రా అని రాజు అడుగుతాడు. రాజుకి దగ్గరగా సాహో వచ్చి అదంతా నా పనే.. నేను చెప్పింది నువ్వు చెయ్యకపోతే విషయం ఇంకా సీరియస్ అవుతుందని రాజుకి సాహో వార్నింగ్ ఇస్తాడు. దాంతో రాజులో టెన్షన్ మొదలవుతుంది. రేయ్ లక్కీ వెంటనే ఐశ్వర్యకి ఫోన్ చేసి నేను తన డిలీంగ్ కి ఒకే అన్నానని చెప్పమని రాజు అంటాడు. దాంతో ఐశ్వర్యతో కలవాలని చెప్తాడు లక్కీ. కాసేపటికి ఐశ్వర్యని రాజు, లక్కీ వాళ్ళు కలుస్తారు. మేం కిడ్నాప్ చేసేవాళ్ళలాగా కన్పిస్తున్నామా అని అన్నారు.. ఇప్పుడు మీ అంతటా మీరే వచ్చారు ఏంటని ఐశ్వర్య అడుగుతుంది. నీకు అదంతా అనవసరం.. ముందు ఎవరిని కిడ్నాప్ చెయ్యాలో చెప్పమని రాజు అడుగుతాడు. ఇందుని అని ఐశ్వర్య చెప్పగానే తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీలాగా ఉంది.. తనని కిడ్నాప్ చేస్తే ఏమోస్తుందని రాజు అంటాడు. రేపు తన బర్త్ డే తను ఒక సంతకం పెడితే కోట్ల ఆస్తులు వస్తాయని మా ఆంటీ చెప్పింది.. ఇప్పుడు తనని కిడ్నాప్ చేసి మా ఆంటీని డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేద్దామని ఐశ్వర్య అంటుంది. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. మరొకవైపు ఇందు కిచెన్ లో వంట చేస్తుంటే భ్రమరాంబ లేని ప్రేమ నటిస్తుంది. అప్పుడే ఐశ్వర్య వచ్చి ఇదంతా రేపటి కోసమే కదా అని వెటకారంగా మాట్లాడుతుంది.. ఆ తర్వాత రేపు ఇందు బర్త్ డే చాలా గ్రాంఢ్ గా ఫామ్ హౌస్ లో చేస్తున్నామని ఇంట్లో వాళ్ళతో రేఖ అనగానే ఆ మాటలు ఐశ్వర్య విని రాజు, లక్కీకి చెప్తుంది. దాంతో రేపు ఆ ఇందు సంతకం పెట్టేలోపు తనని అక్కడ నుండి కిడ్నాప్ చేస్తానని లక్కీతో రాజు అంటాడు. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని రాజు అనగానే.. అక్కడుంది ఇందు.. నీ శత్రువు తనతో జాగ్రత్త అని లక్కీ అంటాడు. మరొకవైపు సంతకం చెయ్యకని సుభాష్, అపర్ణ ఇద్దరు ఇందుతో చెప్తారు. నాకు ఆ దేవుడే ఏదో ఒకదారి చూపిస్తాడని ఇందు అంటుంది. తరువాయి భాగంలో ఇందుని రేఖ నిద్రలేపి విషెస్ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 05, 2026.webp)
ఇల్లు ఇల్లాలు పిల్లలు: కాళ్ళు పట్టుకుని వేడుకున్న శ్రీవల్లి.. నర్మద, ప్రేమ కనికరిస్తారా?
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -437 లో.....రామరాజు ఇంట్లో ప్రేమ, ధీరజ్ కలిసి శ్రీరామనవని సందర్బంగా చేస్తున్న పూజలో కూర్చుంటారు. ఆ తర్వాత అందరు ప్రసాదం తింటూ సరదాగా మాట్లాడుకుంటారు. అల్లుడు గారు మాతో పాటు ఒక వారం రోజులు వేదవతి పంపండి అని రామరాజుని వేదవతి వాళ్ళ అమ్మ అడుగుతుంది. లేదు అమ్మ ఇల్లు పిల్లల్ని వదిలేసి రాలేనని వేదవతి అంటుంది. నువ్వు అలా అంటావనే అల్లుడు గారిని అడుగుతున్నానని వేదవతి వాళ్ళ అమ్మ అంటుంది. పోండి అత్తయ్య మంచిగా ఎంజాయ్ చేసి రండి అని ప్రేమ, నర్మద అంటారు. ఇక అందరు వెళ్ళమంటారు.. రామరాజు కూడా సరే అనడంతో వేదవతి సరే అంటుంది. ఆ తర్వాత ప్రేమ, నర్మదలతో మాట్లాడాలని శ్రీవల్లి పిలుస్తుంది. జరిగిందేదో జరిగింది.. వదిలెయ్యండి చెల్లెళ్లు అని వాళ్ళిద్దరిని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. చూసావా ఈ వల్లి తప్పు అని ఒప్పుకోవడం లేదని ప్రేమ అంటుంది. ప్లీజ్ ఇద్దరు కలిసి నా కాపురం ఇలా చేశారు.. మీరే నన్ను ఆ ఇంటికి తీసుకొని వెళ్ళండి అని వాళ్ళని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. నిన్ను నమ్మితే మా పని అంతే అని నర్మద అంటుంది. ప్లీజ్ చెలెళ్లు అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది. అది చూసి భాగ్యం వచ్చి ఏంటే నువ్వు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావని కోప్పడుతుంది. నీకేం తెలియదు అమ్మ సైలెంట్ గా ఉండమని శ్రీవల్లి అంటుంది. నువ్వు అసలు తల్లివేనా తనకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అని నర్మద అంటుంది. పది రోజుల్లో నా కూతురు ఆ ఇంట్లో ఉండేలా చేస్తాను. నువ్వు వాళ్ళని బ్రతిమిలాడడం ఏంటే అని శ్రీవల్లిని భాగ్యం లాక్కొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 05, 2026
గంగ గతం వెనుక విషాదం.. ఆశయం కోసం బిడ్డను కాదనుకున్న తండ్రి కథ!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -235 లో.....గంగ పేరెంట్స్ ఇంటికి రావడంతో శకుంతల వాళ్లని అవమానించి పంపిస్తుంది. గంగ వాళ్ళ పేరేంట్స్ బయటకు వెళ్తుంటే ఎదురుగా కార్ వస్తుంది. అందులో నుండి దిగి రుద్ర, రంగా వస్తారు. ఏం అయిందని అడుగగా జరిగింది చెప్తారు. దాంతో గంగ వాళ్ళ పేరేంంట్స్ కి రుద్ర సారీ చెప్తాడు. ఇక వాళ్ళకి గంగ ఎలా దొరికిందో చెప్పాలని గంగ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు అనుకుంటారు. ఇక గంగ వాళ్ళ అమ్మ లక్ష్మీ అసలు గతంలో ఏం జరిగిందో రుద్రతో చెప్తుంది. బాబు గంగని మేమేం తీసుకొని రాలేదు.. తన తండ్రి వద్దనుకొని వదిలేసి వెళ్ళాడని రుద్రకి లక్ష్మీ జరిగింది మొత్తం చెప్తుంది. గతంలో గంగ వాళ్ళ నాన్న గంగని తన ఆశయానికి ఉపయోగపడే బిడ్డ కాదని వదిలించుకుంటాడు. అటుగా వెళ్తున్న లక్ష్మీ తనని తీసుకొని వచ్చింది సాదుకుంటుంది. ఆశయం కోసం బిడ్డని వదులుకునే తండ్రి కూడా ఉన్నాడా అని జరిగింది విని రుద్ర షాక్ అవుతాడు. మరొకవైపు గంగ అసలైన తండ్రి విశ్వనాథ్ బాక్సింగ్ కోచ్.. అతను ఒక అతనికీ ట్రైనింగ్ ఇస్తాడు. అతడి పేరు ధీరజ్. ధీరజ్ ని పోటీకీ సిద్ధం చేస్తాడు విశ్వనాథ్. ఇన్నిరోజులకి నా ఆశయాన్ని నిలబెట్టే రోజు వచ్చింది.. నువ్వు త్వరలో వైజాగ్ లో జరగబోయే పోటీలో పార్టీసిపేట్ చేస్తున్నావని విశ్వనాథ్ తన శిష్యుడు ధీరజ్ కి చెప్తాడు. మరొకవైపు రుద్ర వచ్చేసరికి గంగ కోపంగా ఉంటుంది. గంగ త్వరలో వైజాగ్ లో బాక్సింగ్ పోటీ ఉంది.. అది విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది.. ఆయనా ఇక్కడికి వచ్చి మన అకాడమీలో సెషన్స్ తీసుకుంటాడని గొప్పగా చెప్తాడు. అయినా గంగ డల్ గా ఉంటుంది. ఎవరో వస్తే ఏంటి.. ఆయనేమైనా వచ్చేది మా నాన్ననా..మా కోచ్ ఆ.. అని గంగ అంటుంది. అది కాదు ఆయన క్లాస్ లు వింటే బాగుంటుందని గంగతో రుద్ర చెప్తాడు. ఆ తర్వాత ప్రమీల డల్ గా సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. తనని నవ్వించడానికి మక్కామ్, కార్తీక్ ప్లాన్ చేస్తారు. ఇద్దరు కలిసి ఏదో ఒకటి చేసి ప్రమీలని నవ్విస్తారు. ఆ తర్వాత పెద్దసారు హాల్లోకి వచ్చి మాట్లాడతాడు. అప్పుడే రాఘవ, సూర్య వచ్చి గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చిందని అందరికి చెప్తాడు. తరువాయి భాగంలో పెద్దసారు చెల్లి గురించి మాట్లాడుతుంటే తన గురించి టాపిక్ తియ్యకండి అని శకుంతల కోప్పడుతుంది. ఆ విషయం గంగ విని రుద్రకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 05, 2026.webp)
నేను మంచోళ్ళకు మంచోడిని...చెడ్డోళ్లకు చెడ్డోడిని
బిగ్ బాస్ సీజన్ 9తో బాగా పాపులరైన వాళ్ళల్లో డెమోన్ పవన్ కూడా ఒక వ్యక్తి. రీసెంట్గా అతను తండ్రిని కోల్పోయాడు. అలాంటి డెమోన్ కూకు విత్ జాతి రత్నాలు షోకి వచ్చాడు. ఇక రీతూ చౌదరితో మంచి ఫ్రెండ్ షిప్ కూడా ఉంది. రీసెంట్గా డెమోన్ తన స్టేటస్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. " నా ప్రియమైన వారందరికీ మీ ప్రేమకు మీ సపోర్ట్‌కి చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంది నన్ను తప్పుగా అర్థం చేసుకుంటు న్నారు. నేను తప్పు చేయకపోయినా, వ్యతిరేకతను, ద్వేషాన్ని భరించాల్సి వస్తోంది. ఐనా కానీ మౌనంగా ఉంటున్నాను. కానీ అది నా వాళ్లను ఇబ్బంది పెట్టె పరిస్థితికి వస్తోంది. ఒక వేళ అలా జరిగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు అప్పుడు వాడిని తట్టుకోవడం చాలా కష్టం .చాలా మంది తెలియకుండానే తప్పులు చేస్తారు. తర్వాత తెలుసుకుని మారతారని నేనేప్పుడూ అనుకుంటాను. అందుకే నేను అలాంటి వాళ్ళను క్షమించి, ప్రశాంతంగా ఉంటున్నాను. నేను మంచోళ్ళకు మంచోడిని, చెడ్డోళ్లకు చెడ్డోడిని . మీరందరూ ఇక మీదట ఇవన్నీ ఆపేస్తారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను ఎప్పటికీ ఇలాగే ఉంటాను" అంటూ తనను ట్రోల్ చేసేవారికి, కామెంట్స్ చేసేవారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు డెమోన్ పవన్. అలాగే స్టేటస్‌లో పెట్టిన మరో పోస్ట్ చూస్తే వాళ్ళ నాన్నగారు లేకపోవడంతో వాళ్ళ అమ్మ తనతో పాటు ఉండటానికి తన ఇంటికి హైదరాబాద్ వచ్చేసిందని చెప్పాడు.
Apr 05, 2026
నా ఫ్యామిలీకి లేని ప్రాబ్లమ్ మీకెందుకు...నాతో పెట్టుకోవద్దు ఖబడ్దార్
నైనికా ఆనసురు బుల్లితెర మీద ఫుల్ ఫేమస్. ఢీ షో తర్వాత బిగ్ బాస్‌లో ఇక ఇప్పుడు బిబి జోడిలో అమరదీప్తో కలిసి పెర్ఫార్మ్ చేసింది. అలాంటి నైనికా రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఒక పోస్ట్ పెట్టింది. "నేనేం చేస్తున్నాను, ఏమి తాగుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో వెళ్తున్నాను, ఎలాంటి బట్టలు వేసుకున్నాను అనే విషయాలపై చాలామంది ఎంతలా ఆసక్తి చూపిస్తున్నారో నేను గమనిస్తున్నాను. నేను ఒక పబ్లిక్ ఫిగర్‌ని కాబట్టి అందరూ నేను చేసే పనుల మీద దృష్టి పెడతారని నాకు తెలుసు. కానీ కొంతమంది చేస్తున్న కామెంట్స్, పెడుతున్న వీడియోస్ నాకు అస్సలు నచ్చడం లేదు. మీరు నమ్మరు కానీ నాకున్న పవర్‌తో నేను మిమ్మల్ని నాశనం చేయగలను. నేనే గనక ఆ విషయాలను కోర్ట్ వరకు తీసుకెళ్తే మీరే పెద్ద చిక్కుల్లో పడతారు. నేనేంటో నా ఫ్యామిలీకి తెలుసు. వాళ్లకు ఏం ప్రాబ్లమ్ లేనప్పుడు మీరు మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే బెటర్. నా జోలికి రాకండి. అందరికీ ధన్యవాదాలు హ్యాపీగా మీరు మీ జీవితాలను చూసుకోండి. నా ప్రియమైన వారందరికీ అసలు ఏమైందని నన్ను అడగొద్దు. ఏమీ జరగలేదు. కానీ అప్పుడప్పుడు నాకు బాధ కలిగినప్పుడల్లా నాకు నేను కూడా నిలబడాలిగా " అంటూ చాలా ఘాటైన స్టేటస్ పెట్టుకుంది.
Apr 05, 2026నిజం పెళ్లా ప్రమోషన్ పెళ్లా...మొన్న ప్రియాంక సింగ్, ఇప్పుడు శోభా శెట్టి పెళ్లిళ్లు
బుల్లితెర మీద కనిపించే వాళ్ళ పెళ్లిళ్లు త్వరత్వరగా ఐపోతున్నాయి. అది కూడా ఇంత హాట్ సమ్మర్లో. ఎవరినీ పిలవకుండా ముందస్తుగా సోషల్ మీడియాలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఫ్యాన్స్‌కి చెప్పకుండా చకచకా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్గా ప్రియాంక సింగ్ పెళ్లి జరిగిపోయింది. నెటిజన్స్ ఐతే హ్యాపీ మారీడ్ లైఫ్ అబ్బాయి బాగున్నాడు. పెళ్లి కూతురు లుక్‌లో చాలా అందంగా ఉన్నావు అక్కా అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఇప్పుడు కార్తీక దీపం లేడీ విలన్‌గా పేరు తెచ్చుకున్న శోభా శెట్టి యశ్వంత్తొ కలిసి పెళ్లి పీటలెక్కింది. ఇక నెటిజన్స్ కూడా నైస్ కపుల్స్, ఏంటి యశ్వంత్ ఎవరినీ పిలవకుండా పెళ్లి చేసుకున్నావ్ ...యశ్వంత్ నువ్వు లక్కీ అంటూ కామెంట్స్ పెడుతూనే మరో వైపు "రియల్ పెళ్లి ఎప్పుడు, ఏది యాడ్ పెళ్ళో ఏది నిజం పెళ్ళో తెలీడం లేదు. నిజంగానే పెళ్లి నా ప్రమోషన్ వీడియో నా అర్ధం కాలేదు..అక్క బావ సూపర్" అంటూ కామెంట్స్ చేశారు. కానీ శోబాశెట్టి పెళ్లి కోసం ఆమె ఫాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ 7 కి వెళ్లి టాస్కులన్నీ బాగా ఆడింది శోభా. అలాగే కన్నడ బిగ్ బాస్‌కి కూడా వెళ్ళింది. ఇక యశ్వంత్ తో 2024 ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ ఇంకా పెళ్లిని పెండింగ్‌లో పెట్టింది. ఇప్పుడు ఏ పెళ్ళైనా కానీ ఇలా పెళ్లి బట్టల్లో కనిపిస్తూ ఫాన్స్‌ని ఆనదాపరించింది.
Apr 05, 2026కన్నీళ్లు పెట్టుకున్న రాధ... కార్తీక కోసం వాళ్ళ నాన్న ఎంతలా ఏడ్చాడో
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లేటెస్ట్ ఎపిసోడ్ లో శ్రీముఖి కపుల్స్‌కి కొన్ని ఇంటరెస్టింగ్ టాస్కులు ఇచ్చింది. అందులో ముందుగా నటరాజ్ మాష్టర్ - నీతూకి వాళ్ళ అమ్మాయి షోకి వచ్చింది అనే కాన్సెప్ట్ ఇచ్చి కొంచెం ఎమోషనల్ టచ్ ఇవ్వాలని చెప్పింది. ఇక నటరాజ్ ఐతే తన పాప షోకి వచ్చిందని ఒక పిచ్చి పట్టిన ఫాదర్ లా ప్రవర్తించడం చేసేసరికి జడ్జి రాధ ఆ యాక్ట్ కి కన్నీళ్లు పెట్టేసుకుంది. నటరాజ్ మాష్టర్ కూతురు లక్ష్య ఎక్కడికి వెళ్లినా పక్కనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ షోకి దూరంగా ఉంది అంటూ శ్రీముఖి చెప్పింది. తర్వాత రాధా మాట్లాడింది. "మాష్టర్ జి చిన్న పాపే కాదు పిల్లల్ని పెద్ద చేసి మ్యారేజ్ చేసి పంపించినా కూడా ఆ ఫీలింగ్ పోదు. నా జీవితంలో కార్తీక నా లక్. ఆమెకు పెళ్లి అయ్యాక ఫస్ట్ టైం మా ఆయన ఏడవడం చూసాను. పెళ్లి అయ్యి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏడుస్తారు కానీ పెళ్లి తర్వాత రోజు మరవీడు అంటారు పెళ్లికూతురు తండ్రి స్వీట్స్ అవన్నీ ఇచ్చాక మండిలో కూర్చుంది కార్తీక వచ్చి. వాళ్ళ నాన్నను గట్టిగా పట్టుకుంది. అప్పుడు నేను చూసాను ఒక మగాడు అంతలా ఏడవడం. ఆ ప్రేమ ఉంది చూడండి అది చాలు మనకు" అని చెప్పింది. ఇక అనిల్ రావిపూడి ఐతే "ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఒక శక్తీ పీఠం ఉన్నట్టే. భూగ్రహంలో ఎక్కడ ఉన్నా ఆమ్మ నాన్న గురించి ఆలోచించేది ఒక్క ఆడపిల్లే." అని చెప్పాడు.
Apr 05, 2026.webp)
జతిన్ - శర్వరిని కలిపేందుకు ట్రై చేస్తున్న ఆది
ఢీ 20 లేటెస్ట్ ప్రోమోలో ఆది చేసిన కామెడీ బాగా నవ్వు తెప్పించింది. ఇక కంటెస్టెంట్స్ కి రీమిక్స్ రౌండ్ కాన్సెప్ట్ ఇచ్చారు. "ప్రీ స్టైల్ చేయడానికి నిఖిల్ బ్రదర్ , విజయ్ బిన్నీ మాష్టర్ కావాలి. క్లాసికల్ కేమో నభా నటేష్ రెజీనా ఇద్దరు కావాలి" అని ఆది చెప్పాడు. "ఇంకా ఇంకేమైనా కావాలా భయ్యా" అంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. "సెంథిల్ గారు మీరు కెమెరా రెడీ చేసుకోండి మీకు నాటు నాటు అయినా దొరుకుతాయి కానీ నా స్టెప్పులు దొరకవు" అంటూ చెన్నై చంద్రమా సాంగ్ కి ఎలా ఒంగిపోయి డాన్స్ చేయాలో చూపించాడు. తర్వాత ఒక సాంగ్ వేసుకున్నాడు " పెద్ద పెద్ద కప్పు ఉంది ఆయాసే ప్రతి ఒక్కడికీ అప్పు ఉంది ఆయాసే తేజురో రాజురో పూజరో పండురో ఉంటరో పోతరో పోతరో జతిన్ రో నీకుంటదిరో. శర్వరికి దొరుకు బిడ్డ శవాలు లేస్తాయి బిడ్డ దిశ నిన్ను ఒకేసారి ఏస్తది బిడ్డ ఏస్తది బిడ్డ" అంటూ ఊపొచ్చే పాట పాడాడు. " ఇక స్టేజి మీదకు ముగ్గురిని పిలిచారు. ఆ ముగ్గురు అబ్బాయిలకు చీరలు కట్టి దిష్టి చుక్క పెట్టాలంటూ హోస్ట్ నందు చెప్పాడు. "ద మోస్ట్ యాంటిసిపేటెడ్ పెయిర్ ఆఫ్ ఢీ 20 " అంటూ నందు అనౌన్స్ చేసాడు. తర్వాత శర్వరి - జతిన్ కలిసి రాంప్ వాక్ చేశారు.
Apr 04, 2026
Jayam serial : రుద్ర హెచ్చరికతో వీరు షాక్.. పెద్దసారు ఎమోషనల్!
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -234 లో... పెద్దసారుతో రుద్ర మాట్లాడతాడు. ప్రమాదం ఉందని నువ్వు ముందే ఊహించావ్ కదా.. నిన్ను నేను గమనించాను.. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని పెద్దసారు అనగానే ఇదంతా బిజినెస్ పరంగా చేస్తున్నారని రుద్ర అంటాడు. నాకు తెలుసు రుద్ర నువ్వు ఈ కుటుంబానికి ఏం కాకుండా కాపాడుతావు కానీ నీకు ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేని అని పెద్దసారు ఎమోషనల్ అవుతాడు. అదంతా వీరు వింటాడు. రుద్ర వచ్చి ఏంటి వీరు ఇక్కడున్నావని అడుగుతాడు. మావయ్యతో మాట్లాడుదామని అనుకున్నాను.. మీరు మాట్లాడుతున్నారు కదా అందుకే ఇక్కడే ఉన్నా అని వీరు అంటాడు. నువ్వు కూడా ఈ కుటుంబం కదా పర్సనల్ ఏముంటుందని రుద్ర అంటాడు. వీరు నువ్వు కూడా జాగ్రత్త ఎవరైనా దెబ్బలు బయటకు కన్పించకుండా కొడతారు. ఆ దెబ్బలు నువ్వు మళ్ళీ మాకు ఎవరికి చెప్పలేక బాధపాడుతావ్.. ఎందుకు ఈ కుటుంబంలో వ్యక్తివే కదా.. అందుకే నీపై కూడా ఎటాక్ జరగొచ్చని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఉదయం ఇక ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్ళదని వీరు అనుకుంటాడు. అప్పుడే ప్రమీల రెడీ అయి హడావిడిగా కిందకి వచ్చి గంగ బాక్స్ రెడీ చేసావా అని అడుగుతుంది. నువ్వు వెళ్ళావని అనుకున్న అక్క అని గంగ అనగానే అత్తయ్య ఏదో అన్నారని ఇంట్లో కూర్చుంటే ఎలా అని ప్రమీల అంటుంది. గుడ్ ప్రమీల ఇలానే ఉండాలని రుద్ర తనకి సపోర్ట్ చేస్తాడు. ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్తుంటే శకుంతల కోపంగా చూస్తుంది. వీరు డిస్సపాయింట్ అయ్యావా అని రుద్ర అంటాడు. ఆ తర్వాత పెద్దసారుని చూడడానికి లక్ష్మి, పైడిరాజు వస్తారు. చూసారా అత్తయ్య మీరు ఈ ఇంటికి రావద్దన్నా కూడావచ్చారని శకుంతలతో ఇషిక అంటుంది దాంతో వాళ్ళని శకుంతల అవమానించి పంపిస్తుంది. గంగ బాధపడుతుంది. తరువాయి భాగంలో గంగ పేరెంట్స్ ని మీరే కనుక్కోవాలి బాబు అని ఏం జరిగిందో అంత రుద్ర, రంగాకి లక్ష్మీ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026.webp)
Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ట్విస్ట్.. శ్రీవల్లిని బయటకు గెంటేసిన చందు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -436 లో..... శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్న చందు తనని బ్యాగ్ తో సహా పుట్టింటి దగ్గర దింపేస్తాడు. అప్పుడే భాగ్యం, ఆనందరావు రెడీ అయి వస్తుంటే.. బ్యాగ్ తో వస్తున్న శ్రీవల్లి ని చూస్తారు. ఏంటి అమ్మడు మేమే వస్తున్నాం కదా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావ్.. దగ్గరుండి తీసుకొని వెళదామని వచ్చావా అని ఆనందరావు, భాగ్యం అంటుంటే శ్రీవల్లి జరిగింది చెప్తుంది. నా కాపురాన్ని కూల్చేశారని బోరున ఏడుస్తుంది. ఆ నర్మద ప్రేమ, నిన్ను భయపెట్టడానికి బ్లాక్ మెయిల్ చేశారనుకున్న గానీ ఇలా చేస్తారనుకోలేదని భాగ్యం అంటుంది. వాళ్ళేం చేశారు మనమే తప్పు మీద తప్పు చేసామని శ్రీవల్లి ఏడుస్తుంది. ఆ తర్వాత పూజలో కూర్చోవడానికి పెద్దోడు శ్రీవల్లిని తీసుకొని రమ్మని ప్రేమ, నర్మదలని వేదవతి పంపిస్తుంది. తీరా అక్కడికి వెళ్లేసరికి అక్కడ వాళ్లుండరు. అప్పుడే చందు వస్తాడు. శ్రీవల్లిని వాళ్ళ పుట్టింట్లో దింపేసి వచ్చాను వాళ్ళ అమ్మ కాలు జారి కిందపడిందని చందు చెప్తాడు.. చందు వెళ్లిపోతుంటే తన వెనకాలే ప్రేమ, నర్మద వెళ్లి ఏంటి బావ.. ఇది తన తప్పు చెప్పి మారుస్తారనుకున్నాం ఇలా చేశారని అంటారు. ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకండి అని చెప్పేసి చందు వెళ్ళిపోతాడు. మరి పూజ మీద నర్మద,సాగర్ కూర్చోండి అని వేదవతి అంటుంది వాడు కూర్చుంటే నేను పూజలో కూర్చోనని రామరాజు అంటాడు. దాంతో సాగర్ కి కోపం వచ్చి పూజ దగ్గర నుండి లేస్తాడు. మరి ప్రేమ, ధీరజ్ మీరు కూర్చోండి అని వేదవతి అంటుంది. నేను దంతో కలిసి కూర్చోనని ధీరజ్ అంటాడు. అమూల్య విషయంలో ప్రేమ మోసం చేసింది.. నేను తన పక్కన కూర్చొని పూజ చెయ్యలేనని ధీరజ్ అంటాడు. దాంతో ధీరజ్ ని వేదవతి పక్కకి తీసుకొని వెళ్లి.. అసలు విషయాలు నీకు తెలియవు.. ఇప్పుడు చెప్పే పరిస్థితిలో నేను లేనని సర్ది చెప్పి పూజలో కూర్చునేలా వేదవతి చేస్తుంది. ఇద్దరు పూజ చేస్తారు. మరొకవైపు శ్రీవల్లి చేసిన మోసాన్ని చందు గుర్తుచేసుకొని బాధపడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026.webp)
Podharillu Serial: మాధవ పెళ్లి విషయంలో రచ్చ.. నారాయణ ఫ్యామిలీలో కొత్త గొడవలు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -85 లో......మాధవకి గాయత్రి నిజం చెప్పి పెళ్లి చెయ్యమని అడగడానికి తాంబులం పట్టుకొని మహా కేశవ, చక్రి, కన్నా వెళ్తారు. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. మహాని తాయారు తిడుతుంది. దాంతో తనపై కర్ర ఎత్తుతాడు కేశవ. మా వదిన జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళందరూ తాయారు ఇంటికి వెళ్లిన విషయం మాధవకి తెలిసి పరుగున ఇంటికి బయల్దేరతాడు. ఆ తర్వాత మహా, కన్నా, కేశవ, చక్రి అందరు తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చాక నారాయణ వాళ్ళతో మాట్లాడతాడు. ఏమైంది తిట్టాలిసినవన్నీ తిట్టారా అని మహా, చక్రి, కేశవ,కన్నా వాళ్ళని నారాయణ అడుగుతాడు. నీ కంటే వాళ్ళ గురించి తెలియదు వీళ్ళకి అయినా తెలుసు కదా.. వాళ్ళకి వచ్చిన ఆస్తులు అమ్ముకొని నా వాటా కావాలని కోర్ట్ లో కేసు వేశారు.. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి పిల్లని ఇవ్వమని అడుగుతారా.. ఇంతకన్నా మూర్కులు ఎవరైనా ఉంటారా అని నారాయణ కోప్పడతాడు. అప్పుడే మాధవ వస్తాడు. అక్కడికి ఎందుకు వెళ్లారని అందరిపై కోప్పడతాడు మాధవ. నేను మీకు చెప్పానా నాకు ఇది కావాలని.. అసలు ఎవరు మీరంతా అని మాదవ కోప్పడతాడు. మేం ఎవరిని మమ్మల్ని చూస్తున్నావ్ అన్నయ్య అని చక్రి ఎమోషనల్ అవుతాడు. ఒరేయ్ నువ్వు చదువుకునేవాడివి ఎందుకురా నీకు ఇవన్నీ అని కన్నాపై మాధవ అరుస్తాడు. నావల్లే ఇదంతా బయట నుండి వచ్చిన దాన్ని బయటకి వెళ్ళేదాన్ని సైలెంట్ గా ఉండకుండా నేను తప్పు చేసానని మాధవకి మహా సారీ చెప్పి దిగాలుగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాధవ దగ్గరికి మహా వచ్చి మాట్లాడుతుంది. కోపం తగ్గిందా అని అడుగుతుంది. ఎవరి మీద నాకు కోపం లేదు.. వాళ్ళు మంచి మనుషులు కాదు.. అనవసరంగా వాళ్ళతో మీకెందుకు గొడవ అని మాధవ అంటాడు. ఆ తర్వాత ఉదయం నారాయణకి తగిలిన దెబ్బకి కట్టు చేంజ్ చెయ్యాలని మహా వస్తుంది. వద్దని నారాయణ అంటాడు. దాంతో తన కొడుకులతో కట్టు చేంజ్ చేయించుకుంటాడు నారాయణ. అందరు నారాయణకి చెక్కిలిగింతలు చేస్తూ నవ్విస్తారు. ఆ తర్వాత కేశవ దగ్గరికి శైలు వచ్చి.. నా ఫోన్ ఇస్తే ఒక్క రీల్ చేసుకుంటాను ప్లీజ్.. ఫాలోవర్స్ హ్యాపీ నెస్ అని శైలు రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో కేశవ ఒప్పుకుంటాడు కానీ శైలు చేతికి కేశవ గొలుసు కడతాడు. ఇప్పుడు చెయ్ నీ రీల్స్ అంటూ ఫోన్ ఇస్తాడు కేశవ.. శైలు రీల్స్ చేస్తుంది. తరువాయి భాగంలో మాధవకి పెళ్లి సంబంధం చూడడానికి మాట్రిమోనీలో మాధవ డీటేల్స్ పెడుతుంది మహా. ఆ విషయం మాధవకి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026
Karthika deepam2 : దీపను చంపాలని చూసిన జ్యోత్స్న.. చివరి నిమిషంలో కార్తీక్ ఎంట్రీతో సీన్ సితార్!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2''(karthika deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -635 లో...... జ్యోత్స్నకి దీపే అసలైన వారసురాలు అన్న నిజం తెలిసిందని కార్తీక్ కి తెలుస్తుంది. దాంతో హడావిడిగా దాస్ దగ్గరికి వస్తాడు కార్తీక్. జ్యోత్స్న డిఎన్ఏ టెస్ట్ చేసింది.. దీప సాంపిల్స్ టెస్ట్ చేయించింది.. దీపనే అసలైన వారసురాలనే నిజం జ్యోత్స్నకి తెలిసిపోయింది.. ఇందాక పారు చేతిలో ఆ రిపోర్ట్స్ చూసానని కార్తీక్ అంటాడు. పారుకి ఇంగ్లీష్ రాదు కాబట్టి తనకి ఆ రిపోర్ట్స్ లో ఏముందో తెలియదు.. ఏంటని అడిగితే కవర్ చేసానని కార్తీక్ చెప్పగానే దాస్ టెన్షన్ పడతాడు. ఇప్పుడు జ్యోత్స్న ఏం చేయబోతుంది. ఖచ్చితంగా దీపని చంపాలని ట్రై చేస్తుందని కార్తీక్ అంటాడు. ఇప్పుడు దీపని కాపాడాలని కార్తీక్ అంటాడు. దీప కోసం కార్తీక్ వెతుకుతాడు. దీప డాబా పైన చెట్లకి నీళ్లు పోస్తుంది. అక్కడికి జ్యోత్స్న వెళ్లి వెనకాల నుండి నెట్టెయ్యాలని ట్రై చేస్తుంది. అప్పుడే కార్తీక్ వచ్చి దీప అని గట్టిగా అరుస్తాడు. దీప వెనకాలున్న జ్యోత్స్నని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలా హైట్ లో ఉంటే కళ్ళు తిరుగుతాయంట కదా పడిపోతే పట్టుకుందామని చూస్తున్నానని జ్యోత్స్న అంటుంది. ఏంటి బావ నేను ఏమైనా దీపని తోసేస్తాననుకున్నవా అని జ్యోత్స్న అంటుంది. దీప నువ్వు వెళ్ళు అని కార్తీక్ తనని కిందకి పంపిస్తడు. ఏంటి బావ ఏం చేస్తానని కంగారుపడుతున్నావా.. పదా అందరం విందు భోజనం చేద్దామని జ్యోత్స్న అంటుంటే అందులో ఏదో విషం కలిపి ఉంటుందని కార్తీక్ కి డౌట్ వస్తుంది. అందరు హాల్లో ఉంటారు. అందరం భోజనం చేద్దాం పదండి అన్ని వంటలు దగ్గరుండి సెలెక్ట్ చేసానని జ్యోత్స్న అంటుంది. తను అలా అంటుంటే కార్తీక్ అనుమానం ఇంకా బలపడుతుంది. అందరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక్కడ ముఖ్యమైన గెస్ట్ దీప కాబట్టి ముందు భోజనం దీప చెయ్యాలి. మొదటి ముద్ద నేను దీపకి తినిపిస్తానని జ్యోత్స్న అంటుంది. డౌట్ లేదు అందులో విషం కలిపిందని కార్తీక్ అనుకుంటాడు. అది స్పెషల్ కాదు మరదలా దీప చేత్తో నువ్వు తినడం స్పెషల్.. దీప నువ్వు జ్యోత్స్నకి భోజనం తినిపించమని కార్తీక్ అనగానే జ్యోత్స్న టెన్షన్ పడ్డట్టు యాక్టింగ్ చేస్తుంది. కానీ దీప చేత జ్యోత్స్న భోజనం తిని కార్తీక్, దాస్ కి షాక్ ఇస్తుంది. నా కూతురు అందులో ఏం కలపలేదు అల్లుడు.. మనల్ని ఫూల్స్ చేసింది. తన ప్లాన్ వేరే ఉందని కార్తీక్ తో దాస్ అంటాడు. ముందు అందరు తినండి.. ఆ తర్వాత ఇంకా వినోదకార్యక్రమాలు ఉన్నాయని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కేక్ కటింగ్ కి రెడీగా ఉంటుంది. సుమిత్ర గురించి గొప్పగా చెప్తుంది. నువ్వు పెళ్లి చేసుకోవడం కావాలని సుమిత్ర అనగానే సరే అమ్మ పెళ్లికొడుకు ఇక్కడే ఉన్నాడని కార్తీక్ వంక చూపిస్తుంది. అందరు షాక్ అవుతారు. అందేంటని దీప అనగానే పూర్తిగా వినండి మా బావలాగా ఉండాలని అంటున్నానని జ్యోత్స్న అంటుంది. ఆ విషయం మీ నాన్నకి చెప్పమని కాంచన అంటుంది. అందరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026
Brahmamudi : దుగ్గిరాల వారసురాలిపై ఐశ్వర్య కన్ను.. ఆస్తి కోసం కొత్త కుట్ర!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -997 లో......రెండు రోజుల్లో ఇందు పుట్టినరోజు తను పెట్టె సంతకంతో దుగ్గిరాల ఆస్తులు మొత్తం రేఖకి వెళ్ళిపోతాయ్.. సంతకం పెట్టకని సుభాష్, అపర్ణ అంటుంటే సంతకం పెట్టకపోతే ఏం చేస్తుందోనని ఇందు టెన్షన్ పడుతుంది. కాసేపటికి ఇందు, స్వాతి మాట్లాడుకుంటారు. పక్కనే ఉన్న ఐశ్వర్య చూసి ఇప్పుడు దీన్ని రేఖ ఆంటీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. దీన్ని కిడ్నాప్ చేసి డబ్బు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తే నా ఫ్రెండ్ అప్పు మొత్తం కట్టేయొచ్చని ఐశ్వర్య ప్లాన్ చేస్తుంది. అప్పుడే ఐశ్వర్యకి లక్కీ నుండి హాయ్ అని మెసేజ్ వస్తుంది. అది చూసి నా పని వీళ్లతోనే పూర్తి అవుతుందని అనుకుంటుంది. నిన్ను వెంటనే కలవాలి లాభం వచ్చే పని ఉందని ఐశ్చర్య చెప్తుంది. దానికి లక్కీ సరే అంటాడు. మరొకవైపు నందు బొకే షాప్ దగ్గరికి వెంకీ వస్తాడు. నా లవ్ విషయంలో హెల్ప్ చేస్తానని చెప్పారు కానీ చివరికి హ్యాండ్ ఇచ్చారని వెంకీ అంటాడు. నేను హెల్ప్ చెయ్యనని నందు అనగానే వెంకీ కోపంగా చేయకులే అని వెళ్తుంటాడు. తనని ఒక వెహికల్ డాష్ ఇచ్చి వెళ్తుంది. దాంతో అతను కిందపడిపోతాడు. వెంటనే నందు వచ్చి కట్టుకడుతుంది. నాకు హెల్ప్ చెయ్యనన్నావని వెంకీ అనగానే చేస్తానులే అని నందు చెప్తుంది. మరొకవైపు ఐశ్వర్య దగ్గరికి లక్కీ, రాజు వస్తారు. నిన్ను ఒక్కడినే రమ్మన్నాను కదా అని ఐశ్వర్య అనగానే.. ఏం చేసినా ఇద్దరం చేస్తామని లక్కీ చెప్తాడు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చెయ్యాలని ఐశ్వర్య అనగానే నీకు మేమ్ ఎలా కన్పిస్తున్నాం.. చిన్న చిన్న మోసాలు చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా చెయ్యమని తనపై రాజు సీరియస్ అవుతాడు. ఆ తర్వాత అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. దాంతో ఐశ్వర్య డిస్సపాయింట్ అవుతుంది. మరొకవైపు రాజు వాళ్ళ ఇంటికి స్మగ్లర్ సాహో వస్తాడు. అంతకుముందే అతనికి సంబంధించిన మత్తుపదార్థాలు రాజు పాడు చేసిన విషయం తెలిసిందే.. దాంతో రాజుని పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు సాహో. ఇప్పుడు ఏకంగా రాజు ఫ్రెండ్ ని అంటూ రాజు ఇంటికి వచ్చి తన పేరెంట్స్ తో మాట్లాడుతాడు. ఆ తర్వాత రాజు ఇంటికి వస్తాడు. అతన్ని అక్కడ చూసి షాక్ అవుతాడు. అప్పుడే వెంకీ దెబ్బలతో ఇంటికి వస్తాడు. అది మన పనే అని రాజుతో సాహో అంటాడు. రాజులో టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Apr 04, 2026
నిహారిక నువ్వు నాకు నచ్చావ్ అంటున్న సుధీర్
ఆట లేటెస్ట్ ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎపిసోడ్ ఎంట్రీలోనే సుధీర్ నిహారికకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఒక కవిత రాసుకుని వచ్చాడు. "అంతుందేంటీ మ్యాటరు" అని నిహారిక అడిగేసరికి "నా గుండెల్లోంచి వచ్చిన పదాలన్నీ కలిపి రాసాను " అన్నాడు. "నిహారిక ఓ నిహారిక అడక్కుండానే ఆట ఇచ్చావ్, అడుగుదామనేలోపే బేటా ఇచ్చావ్. టాలెంట్ కి అద్భుతమైన వేదికనిచ్చావ్, దానికి జడ్జ్ గా రాధికనిచ్చావ్, షూట్ చేయడానికి కెమేరానిచ్చావ్, వెయిట్ చేయడానికి కారవనిచ్చావ్ , చెమట పడితే టచ్ఛప్ ఇచ్చావ్, చీకటి పడితే ప్యాకపిచ్చావ్" అని సుధీర్ చెప్పేసరికి "నాకెందుకు దేవుడా ఇదంతా వినడానికి చెవులిచ్చావ్ " అంటూ నిహారికా కౌంటర్ ఇచ్చింది. "నిహారికా దారి లేని వాళ్లకు కొత్త మార్నింగ్ ని ఇచ్చావ్, దారి తప్పుతున్న నాకు వార్నింగ్ ని ఇచ్చావ్ , అందుకే నువ్వు నాకు నచ్చావ్ నచ్చావ్ నచ్చావ్ " అంటూ సుధీర్ చాలా మంచి కవిత చెప్పాడు. "ఇది కవిత్వం కాదు కపిత్వం " అని చెప్పింది. ఇక తర్వాత ప్లేయర్స్ ఒక్కొక్కళ్ళు వచ్చి ఫన్నీ గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ నవ్వించారు. జడ్జ్ రాధ ఇరేజర్ , రఘు మాష్టర్ గరిటె , కావ్య బూజు దులుపుకుని కర్రలు, సమీరా భరద్వాజ్ జెండా కర్రలు, విష్ణు ప్రియా ఖాళి వైట్ పేపర్ తెచ్చి ఇచ్చింది.
Apr 03, 2026
రీతు చౌదరి ట్రోల్స్ రచ్చకు డెమోన్ పవన్ ఫుల్ స్టాప్
బుల్లితెర మీద సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన 9 కంటెస్టెంట్ రీతూ - డెమోన్ పవన్ బాగా ట్రోల్ అయ్యారు. వీళ్ళిద్దరూ ఏ షో కైనా ఎక్కడికైనా ఒకరు లేకుండా ఒకరు వెళ్లారు. అలాంటిది ఇప్పుడు డెమోన్ పవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఒక సుదీర్ఘ పోస్ట్ ని రీతూ గురించి పెట్టాడు. "రీతూ గురించి వెనక మాట్లాడే వాళ్ళ కోసమే ఇదంతా చెప్తున్నా...జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నాన్నను కోల్పోవడం చాలా పెద్ద విషయం. పాస్ట్ లో బ్రేకప్ అవ్వడం బాధాకరమైన విషయం. ఇన్ని జరిగిన ఆమె తన ఫామిలీ కోసం మళ్ళీ లేచి నిలబడింది. ఆమె ఎవరి మీద డిపెండ్ కాలేదు. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ ఒకవేళ ఆమె మీకు నచ్చకపోతే వదిలేయండి కానీ ఆమె గురించిన నెగటివిటీని మాత్రం స్ప్రెడ్ చేయకండి. చాలామంది ఆమె మీద రూమర్స్, నెగటివిటీ, బాడ్ కామెంట్స్ సిల్లీగా పాస్ చేసేస్తున్నారు. ఆమె ఏదైనా బెస్ట్ గా చేయాలనుకుంటుంది ఆమె ఎవరికీ చెడు చేయలేదు. ఆమె ఎన్ని కష్టాలు పడినా తన స్ట్రాంగ్ మైండ్ సెట్ తో అన్నింటికీ దూరంగా వచ్చి తన పని తానూ చేసుకుంటోంది. దేవుడి మీద భక్తితో తన మీద తానె గొప్ప నమ్మకంతో ఆమె చాల కష్టపడుతుంది తన ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడింది. ఆమె చాల స్ట్రాంగ్, మెచ్యూర్ గా ఉంటుంది, జెన్యూన్ గా కేరింగ్ గ చూసుకుంటుంది. మనసులో మాత్రం చిన్నపిల్లలా ఉంటుంది. నేను ఆమె దగ్గర నుంచి చాల విషయాలు నేర్చుకున్నా నేర్చుకుంటూనే ఉంటాను. నాకు ఆమె ఒక బిగ్ ఇన్స్పిరేషన్ " అంటూ చాలా ఘాటుగా ట్రోలర్స్ కోసం పెట్టాడు డెమోన్ పవన్.
Apr 03, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



