
ఓ శకం ముగిసింది
Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} బాల్ థాక్రే.. మడమ తిప్పడం ఎరగని మరాఠా యోధుడు.. తనని తాను అభినవ శివాజీగా ప్రకటించుకున్న సాహసం ఈ ముంబై వాసికి మాత్రమే సొంతం. ముంబైని గడగడలాడించిన అరాచక శక్తుల్ని “ఉ” పోయించిన వీరాధివీరుడు. హిట్లర్ ని ఆదర్శంగా తీసుకుని బతికినంతకాలం ముంబై మహానగరాన్ని శాసిస్తూ పులిలా బతికిన రాజకీయ యోధుడు బాలా సాహెబ్ థాక్రే. బాల్ థాక్రే మాటంటే మరాఠీలకు వేదం. బాలా సాహెబ్ నివాసం మాతోశ్రీ మరాఠీలకు ఓ దేవాలయం. ఆయన ఆజ్ఞని తు.చ తప్పకుండా పాటించే మరాఠాలు బాలా సాహెబ్ ఇక లేరన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తిగా తాము అనాధలైపోయామన్న భావనకు లోనౌతున్నారు. దేశంలో బాల్ థాక్రే అంత చరిష్మా ఉన్న రాజకీయ నేత మరొకరు లేరన్న విషయాన్ని మరాఠీలు చాలా గర్వంగా చెప్పుకుంటారు. మరాఠీ ఏతరులు ముంబైని విడిచివెళ్లిపోవాలంటూ తొలిరోజుల్లో బాల్ థాక్రే చేపట్టిన చిన్న చిన్న ఉద్యమాల ప్రభావం ఇప్పటికీ మరాఠీలందరిమీదా చాలా బలంగా పనిచేస్తోంది. తొలినాళ్లలో కార్టూనిస్ట్ గా పనిచేస్తూ తన జాతి వీరత్వాన్ని ప్రదర్శిస్తూ చిన్న చిన్న పోరాటాలతో ముందుకు సాగిన బాల్ థాక్రే తర్వాత్తర్వాత ఒక్క ముంబైని మాత్రమే కాక, మొత్తం మహారాష్ట్రనే శాసించ గలిగే స్థాయికి చేరుకున్నారు. ఇండియా లాంటి దేశాన్ని పాలించాలంటే హిట్లర్ లాంటి లీడర్ కావాలంటూ థాక్రే చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించడం బాల్ థాక్రే స్టైల్. థాక్రే ఓ శక్తిగా ఎదగటడానికి ముందు ముంబైలో సామాన్యుల మనుగడ ప్రశ్నార్ధకంగా ఉండేది. అరాచకశక్తుల పదఘట్టనలకింద నలిగిపోతున్న హిందువులను పైకి లేపి మాఫియాని కాలికింద తొక్కిపట్టిన ఘనతని థాక్రే దక్కించుకున్నారు. ముంబైని ఏలుతున్న స్మగ్లర్లను తొక్కిపట్టడానికి అదే మార్గంలో వెళ్లి తన వాళ్లని ఆ మార్గంలో పాతుకుపోయలా చేసి ముంబై స్మగ్లింగ్ సామ్రాజ్యాన్నికూడా శాసించారన్న ఆరోపణలు వెల్లువెత్తినా నమ్మిన దానికోసం, నమ్ముకున్నవాళ్లకోసం వెనకడుగు వేయని మరాఠా పోరాట యోధుడు బాల్ థాక్రే. 1966లో థాక్రే స్థాపించిన శివసేన ముంబై మహానగరంలో హిందువులకు అండగా నిలించింది. థాక్రే పిలుపునందుకుని ఆ పార్టీలో చేరిన వేలాదిమంది శివసైనికులు హిందూవర్గాలకు రక్షణగా నిలబడ్డారు. తర్వాతికాలంలో మహారాష్ట్ర గడ్డమీద ఆ పార్టీ అప్రతిహతమైన మహా శక్తిగా ఎదిగింది. ప్రభుత్వాల్ని సైతం శాసించే స్థాయికి చేరింది. మహారాష్ట్రలో 1995నుంచి బిజెపితో చేతులు కలిపి శివసేన ఏర్పాటు చేసిన ప్రభుత్వం పూర్తిగా బాల్ థాక్రే కనుసన్నల్లోనే నడిచింది. ప్రభుత్వాల్ని సైతం శాసించగలిగే స్థాయిలో ఉన్నా బాలా సాహెబ్ ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాను కింగ్ మేకర్ నని గర్వంగా చెప్పుకున్న థాక్రే పులిలా దర్పాన్ని ప్రదర్శించేవారు. శివసేన వాణిగా పేరుపడ్డ సామ్నా పత్రికలో బాల్ థాక్రే రాసే సంపాదకీయాలు మరాఠీల రక్తాన్ని మరిగించే రీతిలో ఉండేవి. 2002లో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులంతా కలిసికట్టుగా ఉండి, మత రక్షణకోసం ఓ ఆత్మహత్యా దళాన్ని ఏర్పాటుచేసుకోవాలంటూ ఇచ్చిన పిలుపు సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని అప్పట్లో ప్రభుత్వం ఆయనమీద మతకలహాలకు బీజం వేస్తున్నారంటూ కేసుకూడా పెట్టింది. బాల్ థాక్రే వార్ధక్యం ఛాయలు శివసేన పార్టీని బలహీనం చేశాయి. ఆఖరి నిముషంవరకూ పులిలా గర్జిస్తూ మరాఠీలకు ధైర్యాన్ని నూరిపోసిన బాల్ థాక్రే తర్వాతి తరం అంత బలంగా జనంలోకి వెళ్లలేకపోయింది. భార్య గుండెపోటుతో చనిపోయాక థాక్రే దూకుడు తగ్గింది. అదే సంవత్సరం పెద్ద కొడుకుకూడా యాక్సిడెంట్లో చనిపోవడంతో బాబా కుంగిపోయారు. తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే అంత సమర్ధుడైన నాయకుడిగా పేరు తెచ్చుకోలేకపోయారు. కాస్తో కూస్తో దూకుడుగా వెళ్లగలిగిన మేనల్లుడు రాజ్ థాక్రే, ఉద్ధవ్ తో విభేదాల కారణంగా వేరుకుంపటి పెట్టుకున్నా అంతగా రాణించలేకపోయాడు. బాబా ఆరోగ్యం దెబ్బతిన్న దగ్గర్నుంచీ ఆయనకు దగ్గరగానే ఉన్నా భవిష్యత్తులో పరిస్థితి ఏంటన్నది మాత్రం చెప్పలేని విషయమే. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధింత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న బాబా సాహెబ్ ఆరోగ్యం ఈ మధ్య కాలంలో బాగా క్షీణించింది. లీలావతీ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సని అందించినప్పటికీ ఆయన పెద్దగా కోలుకోలేకపోయారు. ఆఖరు ఘటడియల్లో తనకి బాగా ఇష్టమైన తన నివాసంలోనే వైద్యులు ఆయనకు సపర్యలు చేస్తూ వైద్యమందించారు. కొద్దికొద్దిగా స్పందిస్తూ అంతలోనే దిగజారుతూ వచ్చిన ఆరోగ్యం నిలకడగా నిలబడలేకపోయింది. అంతకంతకూ దిగజారుతున్న పరిస్థితిని గమనించిన మృత్యువు.. జీవితమంతా పులిలా బతికుతూ అలుపెరగని పోరాటం చేసిన యోధుడికి వీరమరణమనే శరణ్యమని భావించింది. బాలా సాహెబ్ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బాలా సాహెబ్ థాక్రే శకం ముగిసిపోయింది. ముంబై నగరం మూగబోయింది. మహారాష్ట్రం చిన్నబోయింది. బాబా సాహెబ్ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న కోట్లాదిమంది మరాఠీలు అనాధలైపోయారు. మాతోశ్రీ దగ్గరికి లక్షలాదిగా అభిమానులు తరలివస్తున్నారు. తమ అభిమాన నేత ఇక లేరన్న విషయాన్ని తెలుసుకుని గుండెలవిశేలా విలపిస్తున్నారు. ఓ సుదీర్ఘ శకం ముగిసిపోయింది. మహోజ్వలంగా వెలిగి ముంబై నగరవాసులకు అరాచక శక్తులను ఎదుర్కునే మనోధైర్యమనే కాంతిని అందించిన దివ్యనక్షత్రం నేలరాలింది. మొత్తం మరాఠా దేశమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.
Nov 17, 2012
ఒబామా ఘన విజయం
Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Arial","sans-serif"; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-font-kerning:20.0pt;} అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రోమ్నీపై ఘన విజయం సాధించారు. మొదట్లో రోమ్నీనుంచి గట్టి పోటీని ఎదుర్కొన్న ఒబామా ప్రచారం చివరి అంకానికి చేరేకొద్దీ అమెరికన్ల అభిమానాన్ని సంపాదించుకోగలిగారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, వేలాది ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని ఒబామా చేసిన వాగ్దానాలు అమెరికన్లని కదిలించాయి. ఆఖరి విడత క్యాంపెయిన్ లో ప్రజల్ని ఉద్దేశించి ప్రసగించేటప్పుడు ఒబామా కాస్తంత ఎమోషనల్ గా ఫీలయ్యారు. జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఒబామా కంటివెంట ధారాపాతంగా నీళ్లు కారడాన్ని చూసిన జనం సెంటిమెంట్ గా ఫీలయ్యారు. మరో అవకాశం ఇచ్చి చూద్దామని గట్టిగా డిసైడయ్యారు. బుష్ హయాంలో యుద్ధాలకారణంగా నేలకంటిన అమెరికా ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఒబామా చేసిన ప్రయత్నాలుకూడా దేశవాసులకు బాగా నచ్చాయ్. రోమ్నీతో పోలిస్తే ఒబామాకే ఆర్థికపరమైన అవగాహన చాలా ఎక్కువగా ఉందని భావించిన అమెరికన్లు సిట్టింగ్ అధ్యక్షుడికే మరో ఛాన్స్ ఇచ్చేశారు. అమెరికా యువత ఖాళీగా కూర్చుంటే విదేశీయులు ఉద్యోగాలు తన్నుకుపోతున్నారంటూ గతంలో ఒబామా చేసిన వ్యాఖ్యలు జనాన్ని బాగా కదిలించాయ్. అప్పట్లో ఆ వ్యాఖ్యలు సంచలనం కలిగించినా రానురానూ వాటి ప్రభావం అంతగా కనిపించకపోవడంతో కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని వర్గాలనుంచీ ఒబామాకి మద్దతు లభించింది.
Nov 06, 2012
కిరణ్ కుమార్ బోల్తా పడ్డారా?
Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Arial","sans-serif"; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-font-kerning:20.0pt;} కనీసం రోజుకి రెండుసార్లు పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో ముఖ్యమంత్రి పదవినుంచి కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణకు ముందు ఇలాంటి ప్రచారం తారా స్థాయిలో జరిగినా సీటు ఖాళీ కాకపోవడంతో కిరణ్ ఊపిరి పీల్చుకున్నారు. అధిష్ఠానం దగ్గర కిరణ్ కి మంచి మార్కులే ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ.. మంత్రుల్ని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ అధినేత్రి ఏపీ ముఖ్యమంత్రికి ఇసుమంతైనా ప్రాథాన్యం ఇచ్చినట్టు ఎక్కడా కనిపించలేదు. మామూలుగా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలనుకునే వాళ్ల జాబితాను తయారు చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రికి పెద్దపీట వేయడం, సీఎం ని సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకోకపోవడం చాలాకాలంనుంచి ఆనవాయితీ. ఈ సారి మాత్రం ఆ ఆనవాయితీ తప్పింది. పనిలోపనిగా తెలంగాణ అంశానిక్కూడా చెక్ పెట్టాలని భావిస్తున్న కేంద్రం మర్రి శశిధర్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని పార్టీ వర్గాలందిస్తున్న సమాచారం. కుర్చీ కాపాడుకునే ప్రయత్నంలో ఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ చేసేందుకు కిరణ్ కుమార్ తనకి అత్యంత సన్నిహితులైన వాళ్లని ఎంపికచేసుకుని హస్తినకు పంపించాడని జోరుగా ప్రచారం జరిగింది. కిరణ్ కి మద్దతుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కె.ఎల్.రెడ్డి, కృష్ణారెడ్డి, భిక్షమయ్య గౌడ్ ఢిల్లీకెళ్లొచ్చారు. కానీ.. వీళ్ల వల్ల కిరణ్ కి ఒరిగింది మాత్రం ఏం లేదు. ఢిల్లీలో పరిస్థితిని చూసి ఏమీ మాట్లాడకుండానే రామ్ రామ్ చెప్పొచ్చేశారని గట్టిగా ప్రచారం కూడా జరిగింది. ఇదేగనక నిజమైతే కిరణ్ కుమార్ రెడ్డి వాళ్లని నమ్మకుని నిజంగా బోల్తాపడ్డట్టేనన్నది చాలామంది భావించారుకూడా. కానీ.. ఆఖరు నిమిషంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొత్తం చిత్రం తిరగబడింది. కిరణ్ కుమార్ ని మార్చేది లేదంటూ వాయలార్ రవి చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఇందులో నిజమెంత అన్న విషయాన్ని పక్కన పెడితే వాయలార్ కిరణ్ ని వెనకేసుకొచ్చిన తీరుని చూసినవాళ్లకి మాత్రం ఇప్పట్లో కిరణ్ కుమార్ పదవికొచ్చిన ముప్పేమీ లేదని చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి తరఫున వకాల్తా పుచ్చుకుని ఢిల్లీకెళ్లిన ఎమ్మెల్యేల్ని టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ తనయుడు కెటిఆర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశారు. ఎంగిలమెతుకులకోసం ఆశపడ్డ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పదవిని కాపాడేందుకు ఢిల్లీకెళ్లారంటూ పరుషపదజాలాన్ని ఉపయోగించారు. అలాంటి వాళ్లకోసం మాట్లాడ్డం కూడా తెలంగాణ వాదులకు అవమానం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Nov 06, 2012
సీఎం తమ్ముడి చేతికి ఐ న్యూస్ టీవీ ఛానెల్!
రాష్ట్రంలో మారుతున్న రాజకీయసమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రచారం కోసం ఓ ఛానెల్ ఉంటే బాగుంటుందనుకున్నారు. ఆల్రెడీ లైవ్ లో ఉన్న ఛానెల్ అయితే మరీ మంచిదని డిసైడయ్యారు. బొత్స జీటీవీని కొనేసిన దగ్గర్నుంచీ తానుకూడా త్వరగా ఓ ఛానెల్ ని తీసుకోవాలన్న తహతహ కిరణ్ కుమార్ రెడ్డికి పెరిగిపోయిందని సన్నిహితుల కథనం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవాఅన్నట్టుగా సీఎం కుర్చీలో కూర్చున్న పొలిటీషియన్ వెతికితే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న ఛానెళ్లే దొరకవా.. సీఎం సోదరుడు రంగంలోకి దిగారు. ఎన్టీవీ చేతిలో ఉన్న ఐన్యూస్ తో బేరం కుదిరింది..ఆ శాటిలైట్ ఛానెల్ సీఎం తమ్ముడి పరమయ్యింది. తెలుగువన్ డాట్ కామ్ విశ్వసనీయ వర్గాల సమాచారంతో ఈ న్యూస్ ని అందరికంటే ముందుగా తెలుగుప్రేక్షకులకు అందిస్తోంది. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం కుర్చీనుంచి దించేందుకు హస్తినలో గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్టు సమాచారం.తెలంగాణ వాదుల్ని బుజ్జగించాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే సరిపోతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని సీనియర్ నేతలు గట్టిగా చెప్పుకుంటున్నారు.
Nov 05, 2012.jpg)
ఎర్రన్న లేని లోటుని ఎవరు తీరుస్తారు?
Normal 0 false false false EN-US X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Arial","sans-serif"; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-font-kerning:20.0pt;} కారు ప్రమాదంలో ఎర్రన్నాయుడి మరణం.. చంద్రబాబుని కదిలించింది.. ఎప్పుడూ కంటతడి పెట్టని బాబు గట్టిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. కుడి భుజంగా మెలిగిన ఎర్రన్న ఇక లేడన్న నిజాన్ని బాబు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవడం ఇప్పట్లో చంద్రబాబుకి సాధ్యమయ్యే పని కాదన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టి చంద్రబాబు అంతగా చలించిపోయారు. దశాబ్దం కంటే ఎక్కువకాలం ఎర్రన్న తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాక చంద్రబాబుకి కూడా కుడి భుజంగా మెలిగారు. తీవ్ర సంక్షోభంలో పార్టీ చిక్కుకుపోయినప్పుడు బాబుకి వెన్నుదన్నుగా నిలిచిన ధీశాలి ఎర్రన్న. పార్టీలో నెంబర్ టూగా చెలమణీ అవుతూ, కీలక నిర్ణయాలు తీసుకుంటూ, చంద్రబాబు అభిమానాన్ని అంతకంతకూ పెంచుకోగలిగిన ఏకైక టిడిపి నాయకుడు ఎర్రన్న.. మామూలుగా చంద్రబాబు ఎవరినీ ఓ పట్టాన నమ్మరన్న ప్రచారం పార్టీ వర్గాల్లో గట్టిగానే ఉంది. కానీ.. ఎర్రన్నని మాత్రం బాబు సంపూర్ణంగా విశ్వసించారు. మొత్తం వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకోవాల్సొచ్చిన రోజునకూడా ఆ అభిమానాన్ని ఎర్రన్నాయుడు నిలబెట్టుకోగలిగారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పటిష్టమైన ప్రణాళికలు రచించి చంద్రబాబుకి అండగా నిలబడ్డారు. దిగ్గజాల్లాంటి నేతలెందరో ఉన్నా సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యవహారాల్ని చక్కదిద్దగల నేర్పు టిడిపిలో ఒక్క ఎర్రన్నాయుడికే సొంతమన్న మంచి పేరుని తెచ్చుకోగలిగారాయన. ఎన్నికల్లో ఓడిన రోజునకూడా నియోజకవర్గానికెళ్లినప్పుడు ఎంపీ ఎర్రన్న అని పిలిపించుకోగలిగిన సత్తానిచూసి అప్పట్లో చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు. డిసిప్లిన్ విషయంలోకూడా ఎర్రన్నాయుడికి చాలామంచి మార్కులే ఉన్నాయ్. సిద్ధాంతపరమైన విభేదాల విషయంలోనూ పార్టీ అధ్యక్షుడితో పోరాడిన సందర్భాలేవీ లేవు. పైగా తను చెప్పదలచుకున్న విషయాన్ని నాలుగ్గోడలమధ్య బైటపెట్టడం తప్ప బయటి ప్రపంచంముందు పార్టీకి గానీ, అధ్యక్షుడికి గానీ ఎర్రన్న పల్లెత్తు మాట మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. హుందాగా, గుంభనంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించే పదునైన నాయకుడు ఎర్రన్నాయుడు. తను లేని లోటు ఇప్పుడు పార్టీని విపరీతంగా కలవరపెడుతోంది. ఎవరితో ఎర్రన్న స్థానాన్ని భర్తీ చేసుకోవాలో తెలీని పరిస్థితిలో చంద్రబాబు పడిపోయారు. సమర్ధుడైన నాయకుడు లేనిలోటు ఎంతగా పార్టీని వేధిస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు.
Nov 05, 2012
తెలుగువాడిగా పుట్టడమే నేరమా?
వివిఎస్ లక్ష్మన్.. వెరీవెరీ స్పెషల్ లక్ష్మన్.. అవసరమైనప్పుడల్లా భారత జట్టుకి అండగా నిలబడ్డ క్రికెట్ వీరుడు. ప్రత్యర్థి జట్ల గుండెల్లో రెళ్లు పరిగెత్తించిన సెంచరీల యోధుడు. ఎప్పుడూ స్వలాభంకోసం చూసుకోలేదు. దేశం కోసం, ప్రపంచవ్యాప్తంగా భారత క్రికెట్ జట్టు ఖ్యాతి మారుమోగడంకోసం మాత్రమే కృషిచేసిన నిస్వార్ధపరుడికి చివర్లో దక్కిన గౌరవం అర్థంతరంగా అస్త్రసన్యాసం చేయాల్సిన దుస్థితి. నిజంగా లక్ష్మన్ కి ఇంకా ఆడే దమ్ములేదా?మెరుపువేగంతో బ్యాట్ ని ఝుళిపిస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే పౌరుషం తగ్గిపోయిందా..? లేక రాజకీయాలకు తట్టుకోలేక, లెక్కలేనితనంతో విర్రవీగుతున్న పిచ్చికుంకలముందు తలదించుకుని నిలబడలేక రిటైర్మెంట్ ప్రకటించాడా..? అని ప్రశ్నించుకుంటే నిప్పులాంటి నిజం తప్పక పైకి తేలుతుంది. లక్ష్మన్ ఇప్పటికీ పటిష్టమైన ఆటతీరుని కనపరుస్తున్నాడు. సాటిలేని మేటి టెక్నిక్ కి పదునుపెట్టుకుంటూ నమ్మకంగా రాణిస్తున్నాడు. కానీ.. కొత్తగా జట్టులోకి వస్తున్న కమిట్ మెంట్ లేని ఆటగాళ్లను చూస్తే రోజురోజుకీ రోతపుడుతోంది. అడ్డదారిలో జాతీయ జట్టులోకి వచ్చేస్తున్న ఆటగాళ్లతీరుని చూస్తే లక్ష్మన్ కే కాదు, మామూలు క్రికెట్ అభిమానులకుకూడా అసహ్యం వేస్తుంది. బెంగళూరు క్యాంప్ లో తనకు ఎదురైన అనుభవం లక్ష్మన్ ని రిటైర్మెంట్ దిశగా నడిపించిందన్నది ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బెంగళూర్ క్యాంప్ కి కెప్టెన్ ధోనీ హాజరుకాలేదు. బాధ్యతగల సీనియర్ గా లక్ష్మన్ తను చేయాల్సింది చేశాడు. వెర్రిమొర్రివేషాలు వేస్తున్న కుర్ర క్రికెటర్లకు నచ్చేలేదు. వాళ్ల ప్రవర్తన లక్ష్మన్ కి కూడా నచ్చలేదు. కౌన్సిలింగ్ పెట్టించాడు. నీ పని నువ్వుచూసుకో అంటూ లక్ష్మన్ ని కుర్రకుంకలు రెట్టించారు. కుర్ర క్రికెటర్లు వేస్తున్న వెర్రివేషాల గురించి కెప్టెన్ తో చర్చించేందుకు ధోనీకి ఫోన్ చేశాడు. ధోనీ నుంచి స్పందన కరవైంది. తనకు జరిగిన అవమానం గురించి లక్ష్మన్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పాడు. అసలే నా సీటు ఉంటుందో ఊడుతుందో చెప్పలేని పరిస్థితుల్లో నానా తిప్పలు పడుతున్నా. ఈ పరిస్థితుల్లో నేనేమీ చేయలేను అన్న సమాధానం ఎదురైంది. లక్ష్మన్ కి కడుపుమండిపోయింది. ఇంత దయనీయమైన పరిస్థితిలో జాతీయ జట్టుకు ఆడడం అనవసరమనిపించింది. వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదీ.. లక్ష్మన్ రిటైర్మెంట్ వెనకున్న తెరవెనక కథ. మనది చాలా పెద్ద రాష్ట్రం. చాలామంది పెద్దమనుషులున్న రాష్ట్రం. 42మంది ఎంపీలు రాష్ట్రంనుంచి చట్టసభలకు ఎంపికయ్యారు. కానీ.. ఒక్కరికికూడా దేశానికి కీర్తిప్రతిష్టల్ని ఆర్జించిపెట్టిన నిష్కల్మషమైన క్రీడాకారుణ్ణి వెనకేసుకొచ్చే తీరిక లేదు. ఎవరి పైరవీలు వాళ్లవి. ఎవరి బిజినెస్ లు వాళ్లవి. పక్కవాళ్ల బాధను పట్టించుకునే తీరిక మన ఎంపీలకు లేనేలేదు.వాళ్లు చాలా బిజీ.. అదే సచిన్ టెండూల్కర్ ని పక్కనపెడితే, లేదా టెండూల్కర్ కి ఇలాంటి పరాభవం జరిగితే మహారాష్ట్రీయులు ఊరుకుంటారా..? దేశంమొత్తం మండిపోదూ.. టెండూల్కర్ ఎన్ని మ్యాచ్ లు ఆడి ఎన్ని సెంచరీలు కొట్టాడు? లక్ష్మన్ ఎన్ని మ్యాచ్ లు ఆడి ఎన్ని సెంచరీలు చేశాడు? అనడిగితే క్రికెట్ గురించి తెలిసిన ఏ చిన్నపిల్లాడైనా టక్కున సమాధానం చెబుతాడు.ఎందుకంటే.. జాతీయ క్రికెట్ జట్టుకి వివిఎస్ లక్ష్మన్ అందించిన సేవలగురించి చిన్నపిల్లలక్కూడా బాగా తెలుసు. పాపం మరి బిసిసిఐ పెద్దలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో? ఏపీలాంటి పెద్ద రాష్ట్రంలో పుట్టిసాటిలేని మేటి ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారుడికి దక్కుతున్న గౌరవం ఎంత? జార్ఖండ్ లాంటి చిన్నరాష్ట్రంలో పుట్టి అన్నిరకాలుగానూ అండదండలతో అందలమెక్కిన ధోనీకి దక్కిన గౌరవమెంత? ధోనీని తక్కువ చేసి మాట్లాడడం మన ఉద్దేశం ఎంతమాత్రమూ కాదు. లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించాడన్న వార్త తెలుసుకున్నాక హెచ్ సీఏ పెద్దలకు చీమకుట్టినట్టైనా అనిపించలేదు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగుతేజాల ఖ్యాతిని చాటిన మేటి క్రీడాకారుడికి కనీసం చిన్న సన్మానం చేయాలన్న జ్ఞానంకూడా లేదు. అడ్డదారుల్లో ఎలా సంపాదించుకోవాలి,దొడ్డిదారిన ఎంత డబ్బుపోగేసుకోవాలి, ఏమార్గంలో మేడలు కట్టుకోవాలి అన్న శ్రద్ధతప్ప.. మన ఆటగాడికి అన్యాయం జరిగినప్పుడు తిరగబడదామన్న ధ్యాసేలేదు. మొదట్నుంచీ రాష్ట్రానికి చెందిన క్రికెటర్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రంలో సాటిలేని మేటి ఆటగాళ్లుగా రాణించిన ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అవకాశాలు దక్కనే లేదు. ప్రస్తుతం హెచ్ సి ఎ అధ్యక్షుడిగా ఉన్న ముందటితరం ఆటగాడు ఎం.వి శ్రీధర్, అవకాశం కోసం పోరాడిపోరాడి విసిగిపోయి పరాయిరాష్ట్రానికి తరలిపోయిన యువతరం ఆటగాడు అంబటిరాయుడు.. అవకాశాలు దక్కని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఉదాహరణ. మొదట్నుంచీ క్రికెట్ ప్రపంచంలో మహారాష్ట్రీయుల హవానే నడుస్తోంది. కాస్తో కూస్తో కర్నాటక రాష్ట్రం కొందరు ఆటగాళ్లని పట్టించుకుని గట్టిగా పట్టుబడితే వాళ్లకు అవకాశాలు దక్కాయితప్ప మొదట్నుంచీ దక్షిణభారతందేశం ఆటగాళ్లపై జాతీయస్థాయి క్రికెట్ లో అంతులేని వివక్ష కొనసాగుతూనే ఉంది. యువరాజ్ సింగ్ కేన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుని బాగుపడ్డాక మళ్లీ జట్టులోకి తీసుకున్నారు.గతంలో అందించిన సేవలకు ప్రతిగా ప్రతిభావంతుడైన ఆటగాడికి ఇప్పుడు మళ్లీ అవకాశం కల్పించడం హర్షణీయం. విపరీతంగా అలసిపోతున్నా యువీ అంచనాల్ని నిలబెట్టాడు. ఇలాంటి ధోరణి చక్కటి ఫామ్ లో ఉన్న వివిఎస్ లక్ష్మన్ లాంటి ఆటగాళ్లపట్ల ఎందుకు కనపరచడంలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆటగాడు అన్న ఒకే ఒక కారణం లక్ష్మన్ ని చిన్నచూపు చూడడానికి కారణమా..? అందుకే లక్ష్మణ్ కి విసుగొచ్చి రిటైర్మెంట్ ప్రకటించాడు. లక్షణ్ గొప్పదనాన్ని మనవాళ్లు గుర్తించకపోయినా ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం గుర్తించింది. ఉప్పల్ స్టేడియంలో వి.వి.ఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్ ల కాంస్య విగ్రహాల్ని ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. కోల్ కతా టెస్ట్ లో క్రికెట్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన తర్వాత లక్ష్మణ్ ప్రేక్షకులకు బ్యాట్ చూపించిన సన్నివేశం క్రికెట్ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. అదే తీరులో కాంస్య విగ్రహాన్ని తయారుచేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి క్రికెట్ లో జరుగుతున్న అంతులేని అరాచకాల్ని, అక్రమాల్ని ఎండగట్టడానికి లక్ష్మన్ లాంటి సంస్కారవంతులైన ఆటగాళ్లు సాహసించలేకపోవచ్చు. కానీ.. నిరంతరం ఆ రొచ్చుగుంటలో గడపాలంటే మాత్రం లక్ష్మణ్ కిమాత్రమే కాదు.. నిజాయతీ, నిబద్ధత ఉన్న ఏ ఆటగాడికైనా రోతపుడుతుంది. వెరీవెరీ స్పెషల్ లక్ష్మణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. అన్నేళ్లపాటు జాతీయ జట్టుకి సేవలందించినా మ్యాచ్ ఫీజులు తప్ప ఎర్రటి ఏగానీకూడా అడ్డదారిలో సంపాదించకుండా తన నిజాయతీని, నిబద్ధతను చాటుకున్నాడు. చివరికి గౌరవప్రదంగానే రిటైర్మెంట్ ని ప్రకటించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. హేట్సాఫ్ టు వివిఎస్ లక్ష్మణ్.
Nov 03, 2012
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



