
అడిగి మరీ పాట పెట్టించుకున్న అక్కినేని
మన సినిమాల్లో శృంగార, ప్రేమ పాటలకు పెట్టిన పేరు నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. 86 యేళ్ళ ఈ లేటు వయసులో ఆయనకు నటనమీద ఉన్న శ్రద్ధ ఎలాంటిదో తెలిపే సంఘటన ఇది. ఆయన్ని తమ "శ్రీ రామరాజ్యం"చిత్రంలో వాల్మీకి వేషం వేయమని అడిగినప్పుడు అక్కినేని వారు "నేనా పాత్రలో నటించటం సమంజసంగా ఉంటుందా...?" అని ముళ్ళపూడి వెంకట రమణ గారిని ప్రశ్నించారట. దానికాయన "మీరే ఆ పాత్రలో నటించాలి.ఇంకెవరు నటించినా ఆ పాత్రకు న్యాయం జరగదు" అని అన్నారట. ఆ తర్వాత ఆ పాత్రకు ఒక పాట కూడా ఉంటే బాగుంటుందనీ, అందుకని ఒక పాటను పెట్టవలసిందిగా ఆయన దర్శకులు బాపుగారిని కోరారట. అప్పుడు పుట్టిందే "ఎవడున్నాడీ లోకంలో" అనే పాట. "శ్రీరామరాజ్యం" అనే ఈ రోజుల్లో పౌరాణికి చిత్రం తీయటం సాహసం. అదీ నాటికీ నేటికీ ఏనాటికీ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ , పౌరాణికి కళాఖండం "లవకుశ" వంటి చిత్రాన్ని రీమేక్ చేయాలనుకోవటం నిజంగా దుస్సాహసమనే చెప్పాలి. కానీ ఆ చిత్రాన్ని ప్రేక్షకజనరంజకంగా తీసినందుకు బాపు గారిని, ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత యలమంచిలి సాయిబాబు గారినీ తెలుగువన్ ప్రత్యేకంగా అభినందిస్తోంది.
Nov 28, 2011
తప్పు చేసిన గానగంధర్వుడు బాలు
గానగంధర్వుడు, పద్మశ్రీ, డాక్టర్ శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం మీద గతంలో ఒక మచ్చ ఉండేది. ఆయన సినీ నేపథ్య గాయకుడిగా తన జీవితం ప్రారంభించిన తొలి రోజుల్లో ప్రముఖ హిందీ సినీ నేపథ్య గాయకుడు కిశోర్ కుమార్ గారిని బాగా అనుకరించేవారని. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం గారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నూటికి నూరు శాతం యదార్థం. ఆయన ఆయన సినీ పరిశ్రమకొచ్చిన కొత్తలో కిశోర్ కుమార్ పాటల్లోని అరుపులనూ, కొన్ని కూతలనూ మక్కీకి మక్కీ కొన్ని తెలుగు పాటల్లో అనుకరించారు. అలాగే ఆయన తను పాడే పాటల్లో యన్.టి.రామారావుగారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్ని, అక్కినేని వారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్నీ, రాజబాబు గారికి ఆయన గాత్రాన్నీ, అల్లు రామలింగయ్యగారికి పాడినప్పుడు ఆయన గాత్రాన్ని...ఇలా ఏ నటుడికి పాడితే ఆయన గాత్రాన్ని అనుకరించే ప్రయత్నం చేసినట్టు ప్రత్యక్షంగా దాఖలాలున్నాయి...కానీ ప్రస్తుతం ఆయన "పాడుతా తీయగా" అనే కార్యక్రమంలో "దయచేసి ఎవరినీ అనుకరించకండి... మీ సొంత గొంతుతోటే పాడండి" అని పిల్లలకు పాఠాలు చెపుతున్నారు. అంటే నేను చేసిన తప్పుని మీరు చెయ్యకండర్రా అని చెపుతున్నట్టుంది కదూ...!
Nov 28, 2011
జ్యోతిలక్ష్మి ఎలా సినీరంగ ప్రవేశం చేసింది...?
రౌడీలకు రౌడీలు చిత్రంలోని "తీస్కో కొకకోలా ఏస్కో రమ్ముసారా" అనే పాట, ప్రేమనగర్ చిత్రంలోని "లే...లే...లేలేలే నారాజా" అనే పాట మీకు గుర్తుంటే శృంగార నాట్యతార జ్యోతిలక్ష్మి గుర్తుండే ఉంటుంది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు.యమ్.ఎ. ఇంగ్లీష్ చదివాక ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ సినిమాల మీద ఆసక్తితో సినీ పరిశ్రమకు వద్దామనుకుంటే, ఒక దర్శకుడు "నీ తొడలు సన్నగా ఉన్నాయి నువ్వు కనీసం వ్యాంప్ గా కూడా పనికి రావు" పొమ్మన్నాడట. దాంతో పంతం పట్టి బస్కీలు ( గుంజీలు) తీసి మరీ తన తొడల సౌందర్యాన్ని పెంచి మళ్ళీ మూణ్ణెల్లకి అదే దర్శకుడి సినిమాలో ఒక శృంగార గీతంలో నర్తించారు జ్యోతిలక్ష్మి. ఆ దర్శకుడే జానపద బ్రహ్మ విఠలాచార్య. జ్యోతిలక్ష్మి తన 60 యేళ్ళ వయసులో కూడా రజనీ కాంత్ హీరోగా నటించిన "ముత్తు" చిత్రంలో ఒక పాటలో నర్తించి శభాష్ అనిపించుకున్నారు జ్యోతిలక్ష్మి. దటీజ్ జ్యోతిలక్ష్మి.
Nov 28, 2011
పాపం అభిమానులు
మన సినీ హీరోలను అభిమానించే వారికి కొదువలేదు...కొందరైతే తమ అభిమాన హీరో కోసం బుర్రలు పగల కొట్టారు...అలాగే తమ బుర్రలు పగల కొట్టించుకున్నారు కూడా. ఇంతా చేస్తే వారి అభిమాన హీరో వీరికి ఏం చేస్తాడని బేరీజు వేస్తే కనిపించేది శూన్యమే. అభిమానుల వెర్రి అభిమానం గురించి "నేనింతే" సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన పాత్ర ద్వారా సవివరంగా చర్చించాడు. తమ అభిమాన హీరోల సినిమా రికార్డుల గురించి పడేపాట్లు, తమ వాదనే సరి అయ్యిందని బలంగా, అంతే అమాయకత్వంతో కట్టుబడే అభిమానులకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొత్తొక వింత పాతొక రోత అన్నారు పెద్దలు. అలాగే కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోతుంది...అది కాలధర్మం. ఈ రోజున ఈ అభిమానులు "పోకిరి" రికార్డులు సృష్టించిందనీ, దాన్ని "మగధీర" క్రాస్ చేసిందనీ, మళ్ళీ దాన్ని "దూకుడు" అధిగమించిందనీ గొడవలు పడుతూంటే వీళ్ళ అమాయకత్వానికి జాలేస్తుంది. నిజానికి "లవకుశ" చిత్రం విడుదలయినప్పుడు నేల 5 పైసలు, బెంచీ 10 పైసలు, కుర్చీ 15 పైసలు, బాల్కనీ 25 పైసలు. టిక్కెట్ల రేట్లు అలా ఉన్నప్పుడే ఆ రోజుల్లో ఆ చిత్రం కోటి రూపాయలు వసూలు చేసింది...! ప్రస్తుతం టిక్కెట్టు రేట్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే...! మా సినిమా రికార్డులు క్రియేట్ చేసిందంటే మా సినిమా రికార్డులు క్రియేట్ చేసిందని చెప్పుకునే వాళ్ళకి ఏం చెప్పాలి. వారి అమాయకత్వానికి జాలిపడటం తప్ప ఏం చేయగలం చెప్పండి...?
Nov 28, 2011
ఆత్రేయకు ఇష్టమైన పాట ఏది...?
ఆచార్య ఆత్రేయ అసలు పేరు కిళాంబి నరసింహాచార్యులు. ఆచార్య ఆత్రేయ అనేది ఆయన కలం పేరు. తెలుగు సినీ పరిశ్రమలో మనసు మీద ఆచార్య ఆత్రేయ వ్రాసినన్ని పాటలు మరే సినీ కవీ వ్రాయలేదంటే అతిశయోక్తి కాదు. అసలు ఆయన్ని "మనసు కవి", "మన సుకవి" అని అందరూ పిలుస్తుండేవారు. అలాంటి ఆత్రేయ గారికి ఆయన వ్రాసిన పాటల్లో బాగా ఇష్టమైన పాట ఏమిటని విలేఖరులడగ్గా...! దానికాయన "నాకు "మురళీకృష్ణ" సినిమాలోని "ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా...నీ సుఖమే నే కోరుతున్నా నినువీడి అందుకే వెళుతున్నా" అనే పాట చాలా ఇష్టం. ఎందుకంటే నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది...ఈ పాటలో నాలోని ప్రేమికుడి మనసు మీకు వినపడుతుంది" అని సమాధానం చెప్పారు. ఈ "మురళీకృష్ణ" సినిమాలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సీనియర్ నటీమణి జమున జంటగా నటించారు...!
Nov 28, 2011
ఘంటసాలకు ఇష్టమైన పాట ఏది...?
తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని సుమధుర గాత్రం ఘంటసాల వేంకటేశ్వరరావు గారు. ఆయన తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపారం...అనితరసాధ్యం...! ఆయన గాయకుడే కాకుండా సంగీత దర్శకుడు కూడా...! ఆయన సంగీత దర్శకత్వం వహించిన "లవకుశ" చిత్రం తెలుగు వారికి దక్కిన అపురూమైన కానుక. ఆయన తెలుగు సినిమాల్లో కొని వేల పాటలు పాడారు...అలాంటి ఘంటసాల మాస్టారికి ఇష్టమైన పాట ఏది అని అడిగితే "నాకు బాగా ఇష్టమైన పాట "నిర్దోషి" చిత్రంలోని "మల్లియలార మాలికలార మౌనముగా ఉన్నారా...! మాకథనే విన్నారా...!" అని సమాధానం చెప్పారట...! నిజానికి ఆ పాట వింటూంటే ఆ పాటలో ఘంటసాల గారి గాత్రం ఆ పాటలో ఏదో తెలియని మాధుర్యాన్ని నింపుకుని ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది...!
Nov 28, 2011
ఆ చిత్రం నుండి ఘంటసాల పాట తీసేశారు
ఇది తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఊహించరు...! అది నిజమని నమ్మలేరు...! ఒకవేళ నిజమైతే తట్టుకోలేరు...! సుమధుర అమర గాయకులు ఘంటసాల వేంకటేశ్వరరావు గారు పాడిన పాటను సినిమాలోంచి తీసేయటమా...? కానీ ఇది నిజం ...నిజంగా నిజం...! "సంతానం" సినిమాలో "నిదురపోరా తమ్ముడా...!" అనే పాటను ప్రముఖ హిందీ సినీ నేపథ్య గాయని భారతరత్నలతామంగేష్కర్ పాడిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ అదే పాటను ఘంటసాల మాస్టారు కూడా పాడారు...కానీ ఆయన పాట రికార్డ్స్ లో ఉంటుందే కానీ సినిమాలో వినిపించదు...! మీకు కనుక ఆ చిత్రం యల్.పి. రికార్డ్ దొరికితే మీరు ఘంటసాల మాస్టారు పాడిన ఆ పాటను వినవచ్చు. సినిమాకి అవసరం లేదని తీసేశారో, లేక మరే కారణం చేత ఘంటసాల గారు పాడిన ఈ పాటను తీసేశారో తెలియదు కానీ, ఆ చిత్రం నుండి ఘంటసాల గారి పాటను తీసేయటం జరిగింది.
Nov 28, 2011
మన సినిమాల పేర్లు
సహజంగా ఒక సినిమా హిట్టయితే చాలా మంది నిర్మాతలు సెంటిమెంట్ గా అలాంటి పేరే తమ సినిమాకు కూడా ఉండాలని కోరుకుంటారు...అలాంటి పేర్లే తమ చిత్రాలకు పెడుతూంటారు కూడా...! ఉదాహరణకు కాపురం పేరుతో ఎన్ని సినిమాలు వచ్చాయో ఒకసారి చూద్దాం. "కొల్లేటి కాపురం, వింత కాపురం, చెల్లెలి కాపురం, పండంటి కాపురం, పచ్చని కాపురం, కలహాల కాపురం, దొంగ కాపురం, బంగారు కాపురం, కోడలు దిద్దిన కాపురం, పండంటి కాపురానికి 12 సూత్రాలు" వంటి చిత్రాలు వచ్చాయి. ఇక సంసారం పేరుతో "సంసారం, సంసారం-సాగరం, పండంటి సంసారం, నిండు సంసారం,సంసారం ఒక చదరంగం, సంసారం ఓ సంగీతం" వంటి చిత్రాలు వచ్చాయి. మొగుడు పేరుతో "దొంగమొగుడు, మంచి మొగుడు, కొంటె మొగుడు, అల్లరి మొగుడు, చాదస్తపు మొగుడు, కొంటె మొగుడు-పెంకి పెళ్ళాం" వంటి అనేక చిత్రాలు వచ్చాయి. దొంగ పేరుతో "దొంగ, మంచి దొంగ, జేబుదొంగ, దొంగలకు దొంగ, దొంగల్లో దొర, అందరూ దొంగలే, దొరికితే దొంగలు, దొంగ దొంగ, దొంగోడొచ్చాడు' అలా అనేక సినిమాలొచ్చాయి. ఇల్లాలు పేరుతో "ఇల్లాలు, ఇల్లు- ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు, రావుగారిల్లు, ఇల్లాలే దేవత, ఈ తీర్పు ఇల్లాలిది, ఇల్లాలు- ప్రియురాలు, ఇల్లు ఇల్లాలు పిల్లలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు"ఇవన్నీ సాంఘీక చిత్రాలైతే పౌరాణిక చిత్రాలు శ్రీకృష్ణ పేరు మీద, శ్రీరామ పేరు మీద అనేకం వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటికి అంతుండదు.
Nov 28, 2011.jpg)
రాజమౌళి యస్.యస్. అంటే ఏమిటి...!
రాజమౌళి యస్.యస్. అంటే ఏమిటి...! అంతే ఏమిటనేది సామాన్య ప్రేక్షకులకే కాదు... సినీ జనానికి కూడా తెలియని విషయం. అసలు తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ అంటే రాజమౌళి తండ్రి ఇంటి పేరు "వి" అన్నమాట. ఆయన కుమారుడైన రాజమౌళి ఇంటిపేరు "యస్.యస్" ఏమిటి...? లోకంలో ఎక్కడన్నా తండ్రికి ఒక ఇంటి పేరు... కొడుక్కి ఒక ఇంటి పేరూ ఉంటుందా...? ఉండదు కదా..మరి ఈ ఇద్దరి ఇంటి పేర్లలో ఈ తేడా ఏమిటి...? దీని వెనుక ఒక కథ ఉంది. వివరాల్లోకి వెళితే రాజమౌళి తలిదండ్రులు ప్రతి శివరాత్రికీ ఏదో ఒక జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకునేవారట. అలా ఒక శివరాత్రికి శ్రీశైల పుణ్యక్షేత్రానికి వెళ్ళారట.అక్కడ రాజమౌళి తల్లికి ఆ రాత్రి శ్వేతవస్త్రాలు ధరించిన స్వామీజీ కలలో కనిపించి పండంటి మగబిడ్డను ఆమె వొడిలో ఉంచారట. అలా శ్రీశైలం నుండి రాగానే రాజమౌళి కడుపులో పడ్డారట. అందుకనే రాజమౌళి జన్మించిన తర్వాత అతనికి "శ్రీ శైల శ్రీ రాజమౌళి" అని పేరు పెట్టారట. అంతే గాని రాజమౌళీ ఇంటి పేరు అతని తండ్రి ఇంటి పేరూ రెండూ ఒకటే కానీ వేరు వేరు కాదు. "యస్.యస్." అంటే " శ్రీ శైల శ్రీ" అని అర్థం కానీ అది రాజమౌళి ఇంటిపేరు మాత్రం కాదు. నిజానికి రాజమౌళి పూర్తి పేరు "వి.శ్రీ శైల శ్రీ రాజమౌళి" అన్నమాట. ఆ పేరునే సినిమా పరిశ్రమ కోసం యస్.యస్.రాజమౌళిగా మార్చుకున్నారు రాజమౌళి.
Apr 21, 2011.jpg)
రాజమౌళి ఈగ ఎందుకు తీస్తున్నాడు
రాజమౌళి ఈగ ఎందుకు తీశాడంటే తన దమ్మెంతో అందరికీ తెలియచెప్పటానికీ, ఒక దర్శకుడిగా తన ప్రతిభను సినీ పరిశ్రమలో ఒక పెద్ద మనిషికి ప్రాక్టికల్ గా చెప్పటానికి రాజమౌళి "ఈగ" చిత్రాన్ని తీస్తున్నాడట. విషయానికొస్తే "మగధీర" సినిమా షుటింగ్ సమయంలో, షాట్ గ్యాప్ లో, షూటింగ్ చూట్టానికి వచ్చిన ఒక సినీ ప్రముఖుడు ఎవరో రాజమౌళిని తెగపొగుడుతున్నాడట. అది గమనించిన ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ "ఇదిగో చూడూ...యన్ టి ఆర్, ప్రభాస్, రవితేజ వంటి పవర్ ఫుల్ మాస్ హీరోలతో రాజమౌళి ఏంటయ్యా నువ్వు కూడా హిట్టివ్వచ్చు. అదేమంత పెద్ద గొప్పవిషయం కాదులే." అని అన్నారట. ఆ సంఘటన జరిగిన అరగంటకు అటుగా వెళ్తున్న కమెడియన్ సునీల్ డైరెక్టర్ రాజమౌళిని పలకరించి పోదామని వచ్చాడట. లోపల తనను అల్లు అరవింద్ అన్న మాటలకు మండిపోతున్న రాజమౌళి వెంటనే సునీల్ ని హీరోగా పెట్టి సినిమా తీయటానికి నిర్ణయించుకున్నాడట. అలా "మర్యాదరామన్న" సినిమా తీశాక...కూడా "సునీల్ ఏ హీరోకన్నా తక్కువయ్యా" అన్నారట అల్లు అరవింద్. ఇలా కాదనీ అసలు ఒక అల్ప జీవిని హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ చేసి చూపిస్తే ఇక తన మీద కామెంట్ చేయటానికి ఎవరూ సాహసించరని ఈ "ఈగ" చిత్రాన్ని ప్రారంభించాడట రాజమౌళి. ఆ విధంగా "ఈగ" చిత్రానికి అంకురార్పణ జరిగింది.
Mar 26, 2011.jpg)
ఆ హీరోలు టామ్ అండ్ జేర్రీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉండి,ఆ తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోయి,ఇటీవల మళ్ళీ కలసిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.వీళ్ళిద్దరూ గొడవపడుతుంటే బద్ధ శతృవుల్లా కనిపిస్తూంటారు.కానీ వీళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు.ఈ విషయాన్ని ఒక సందర్భంలో చిరంజీవి స్పష్టం చేశారు.ఈ మధ్య ఒక ఇంటర్వ్యులో మాట్లడుతూ"మీ స్నేహితుడెవరు...?ఏ.బాలక్రిష్ణ,బి.మోహన్ బాబు"అని అడగ్గా, దానికి చిరంజీవి "నేను,మోహన్ బాబు టామ్ అండ్ జేర్రీ లాంటి వాళ్ళం.మా స్నేహం అలాంటిది.కానీ నా స్నేహితుడు మాత్రం మోహన్ బాబే.బాలకృష్ణ నా సహనటుడు మాత్రమే"అని అన్నారు.
Jan 27, 2011(1).jpg)
"విజేత"మిస్సయి"విక్రమ్"
యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తొలి చిత్రం"విక్రమ్"లో హీరోగా నటించటానికి ముందు,హిందీలో అనిల్ కపూర్ హీరోగా,అమృతా సింగ్ హీరోయిన్ గా నటించగా,సూపర్ హిట్టయిన "సాహెబ్"అన్న చిత్రాన్ని తెలుగులో నాగార్జున హీరోగా రీమెక్ చేసేందుకు ప్రయత్నించారట. కానీ ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను గీతా ఆర్ట్స్ సోంతం చేసుకుని,ఆ చిత్రాన్ని"విజేత"పేరుతో పునర్నిర్మించారు.లేకుంటే నాగార్జున తొలి చిత్రం"విజేత"కావలసింది.ఆ సినిమా మెగాస్టార్ సొంతం కావటం వలన నాగార్జున"హీరో"అనే హిందీ చిత్రం రీమేక్ "విక్రమ్"చిత్రంలో నటించాల్సి వచ్చింది.అలా "విజేత"చిత్రం మిస్సయి"విక్రమ్"లో నటించారు నాగార్జున.
Jan 27, 2011.jpg)
"పెళ్ళి సందడి"హీరో నటకిరిటి
మన సినీ పరిశ్రమలో ఎప్పుడు,ఎవర్ని,ఏ అదృష్టం,ఏలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు.అందుకు ఉదాహరణలు కోకొల్లలు.దర్శకేంద్రుడు,కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో,యువహీరో శ్రీకాంత్,హీరోగా,రవళి హీరోయిన్ గా నటించగా నిర్మించబడిన చిత్రం "పెళ్ళి సందడి".ఈ చిత్రంలో నిజానికి నటకిరీటి, డాక్టర్ రాజేంద్రప్రసాద్ నటించాల్సింది.కానీ రాజేంద్రప్రసాద్ అప్పట్లో చాలా బిజీగా ఉండటం వల్ల,డేట్లు అడ్జెస్ట్ కాకపోవటంతో ఆ అవకాశం శ్రీకాంత్ కి దక్కింది. ఆ చిత్రం హిట్టవటం వల్లే నేడు శ్రీకాంత్ శతాధిక చిత్రాలను హీరోగా పూర్తిచేయగలిగాడు. అందుకనే దశ ఉంటే దిశ దానంతటదే తిరిగొస్తుందంటారు పెద్దలు.ఇంతకీ మనకి దశ ఉండాలి.
Jan 27, 2011.jpg)
"ఖైదీ"అసలు హీరో కృష్ణ...?
మెగాస్టార్,పద్మభూషణ్,డాక్టర్ చిరంజీవి హీరోగా,మాధవి,సుమలత హీరోయిన్లుగా,ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన "ఖైదీ" చిత్రం ఆ రోజుల్లో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి,తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చేసింది.స్పీడు పెంచేసింది.నిజానికి ఈ చిత్ర నిర్మాతలు ముందుగా ఈ చిత్రంలో నటించమని సూపర్ స్టార్ కృష్ణ ని అడిగారట.కానీ అప్పట్లో ఆయనకు చేతినిండా సినిమాలుండటం వల్ల ఆయనకు డెట్లు ఖాళీ లేకపోవటంతో ఆ అవకాశం చిరంజీవిని వరించింది.ఆ చిత్రం ఆయన సినీ జీవితాన్నే మార్చేసింది.నేడు చిరంజీవి స్థితిలో ఉండటానికి ఈ చిత్రం కూడా ఒక కారణమంటే అతిశయోక్తి కాదు కదూ.
Jan 27, 2011.jpg)
దర్శకేంద్రుణ్ణి తిట్టిన చిరు
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మెగాస్టార్ చిరంజీవికి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా.మరి చిరంజీవి ఆయన్ని ఎందుకు తిట్టారు...?అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకొచ్చింది.దీనికి కారణం ఏమిటంటే తన సినిమాలో నటించే వారందరికీ రాచమర్యాదలు చేయటం రాఘవేంద్రరావుకి అలవాటు.అలా మర్యాదలు చేయటంలో హీరోయిన్లకు ఇంకా కాస్త ఎక్కువగా మర్యాదలు చేయించేవారటాయన.అది అలుసుగా తీసుకుని హీరోయిన్లు షూటింగ్ కి సమయానికి రాకపోవటం,వచ్చినా మనసుపెట్టి నటించకపోవటం చేసే వారట.అది గమనించిన చిరంజీవి ఒక్కో సందర్భంలో "మీ అలుసు చూసుకునే వాళ్ళిట్లా ప్రవర్తిస్తున్నారు.మీరు మీ లెవల్ ని మెయిన్ టైన్ చెయ్యటం లేదు.మీరెందుకు వాళ్ళకింత అలుసిస్తారు...?"అని ఆయన మీద కేకలేసేవారట.దానికి "చూడు బాస్ వాళ్ళ బొడ్డు మీద పళ్ళు పెట్టి కొట్టినా,పాలు,తేనే పోసినా వాళ్ళేం అనకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ భరించక తప్పదు"అని నవ్వుతూ అనే వారట.ఈ విషయాన్ని మెగాస్టార్ ఒక టి.వి.ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Jan 27, 2011
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com


