
Anna lezhneva: ఒకరి బర్త్ డే, మరొకరికి పునర్జన్మ
-పవన్ వైఫ్ అన్నాలెజినోవా పోస్ట్ -నిమిషాల్లోనే వైరల్ -సంఘటనని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్న కుమారుడు మార్క్ శంకర్(Mark shankar)సింగపూర్ లోని తన స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. అసలు ఆ ప్రమాద వార్త విన్నప్పుడు ఫాన్స్ తో పాటు అందరు ఎంతో ఆందోళనకి గురయ్యారు. మరి పవన్, అన్నా లెజినోవాల టెన్షన్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సంఘటన జరిగి నేటికీ ఏడాది. అంటే ఏప్రిల్ 8 2025 న జరిగింది. ఇదే రోజు పవన్ పెద్దకొడుకు అకిరా నందన్(Akira Nandan)పుట్టిన రోజు. ఈ రెండు అంశాలని ముడి చేస్తూ అన్నా లెజినోవా రీసెంట్ గా చేసిన పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తుంది. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం ఏడాది క్రితం ఈ రోజునే మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో చిక్కుకోవడంతో మా కుటుంబం వణికిపోయింది. దేవుడి దయ వల్ల ఆ సంఘటన నుంచి మార్క్ బయట పడటం మా అదృష్టం. ఆ రోజు హాస్పిటల్ లో మార్క్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఒక తల్లిగా ఎంత నరకయాతన అనుభవించానో నాకు తెలుసు. ఏ తల్లికి అలాంటి పరిస్థితి రాకూడదు. ఇదే రోజు మా పెద్దబ్బాయి అఖీరా నందన్ పుట్టిన రోజు. మార్క్ కి పునర్జన్మ. అందుకే మా ఇద్దరి అబ్బాయిల విషయంలో ఈ రోజుని సెలెబ్రేట్ చేసుకుంటామని ఇనిస్టా వేదికగా తెలిపింది. Also read: Janhvi Kapoor: నా బుర్రని వాడేదాన్ని కాదు.. సంబంధం లేని వ్యక్తులు తగిలారు మార్క్ శంకర్ స్కూల్ ప్రమాదం కేసు తాలూకు దర్యాప్తు ఇంకా కొసాగుతూనే ఉంది. ఆ ప్రమాదంలో పదేళ్ల వయసున్న ఒక చిన్నారి చనిపోగా, మార్క్ తో కలిసి పద్దెనిమిది మంది పిల్లలు అస్వస్ధతతో హాస్పిటల్ పాలయ్యారు.
Apr 08, 2026
Allu Arjun: అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.. మిగతా స్టార్ హీరోల పరిస్థితి ఏంటి?
పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ కీలక నిర్ణయం! ఐకాన్ స్టార్ బాటలో మిగతా స్టార్స్ పయనిస్తారా? పాన్ ఇండియా ట్రెండ్ వల్ల హీరోల మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో.. అదే స్థాయిలో హీరోల సినిమాల కౌంట్ కూడా తగ్గిపోయింది. ఏడాదికి ఒక సినిమా సంగతి అటుంచితే.. రెండు మూడేళ్ళకు ఒక సినిమా వస్తుందో లేదో అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇలాంటి సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్(TFJA) సభ్యులు కూడా అల్లు అర్జున్ ని కలిసి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మీడియా మిత్రులతో సరదాగా ముచ్చటించడమే కాకుండా, 'రాకా' సినిమా సంగతులను పంచుకున్నారు. అంతేకాదు, ఇక నుంచి ఏడాదికి లేదా ఏడాదిన్నరకు రెండు సినిమాలు విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు చాలా తగ్గిపోయాయి. కొందరైతే ఒక్కో సినిమా చేయడానికి రెండు మూడేళ్లు కూడా తీసుకుంటున్నారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఏడాదికి కనీసం ఒక సినిమా విదులయ్యేలా చూసుకోవాలని కోరుతున్నారు. మిగతా స్టార్ల సంగతి ఎలా ఉన్నా.. అల్లు అర్జున్ మాత్రం ఇక మీదట ఏడాదికి ఒక సినిమా కాదు, కుదిరితే రెండు సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. అల్లు అర్జున్ బాటలోనే మిగతా స్టార్స్ కూడా పయనిస్తే.. ఏడాది పొడవునా థియేటర్లు కళకళలాడతాయి అనడంలో సందేహం లేదు. కాగా, అల్లు అర్జున్ తన 22వ సినిమా 'రాకా'(Raaka)ను అట్లీ దర్శకత్వంలో చేస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే తన 23వ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అనౌన్స్ చేశారు. సుకుమార్ తో 'పుష్ప-3' చేయాల్సి ఉంది. వీటితో పాటు పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. https://x.com/Theteluguone/status/2041800005774954774
Apr 08, 2026
Janhvi Kapoor: బుర్రని వాడాలి కదా!.. సంబంధం లేని వ్యక్తులు తగిలారు
-జాన్వీ కపూర్ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ -సంబంధం లేని వ్యక్తులు ఎవరు -అమ్మ బతికి ఉన్నపుడు జాలి చూపించలేదు -అసలు ఆ విషయంలో బుర్రనే వాడలేదు అచ్చాయమ్మాగా పెద్ది(Peddi)తో కలిసి సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి శ్రీదేవి(Sridevi)తనయ జాన్వీ కపూర్(Janhvi Kapoor)సిద్దమవుతుంది. దేవరలో విలేజ్ గర్ల్ గా రెబల్ బాడీ లాంగ్వేజ్, హావభావాలతో ఎన్టీఆర్(NTR)ని ఊపిరి సలపని ఉక్కపోతకి గురి చేసిన జాన్వీ మళ్ళీ విలేజ్ గర్ల్ గానే పెద్దిని ఏం చెయ్యబోతుందనే ఆసక్తి అందరిలో ఉంది. అభిమానులైతే ఆ విషయంలో నో కాంప్రమైజ్ అని ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది కదా,అచ్చాయమ్మా కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళందర్నీ జాన్వీ మాటలు షాక్ కి గురి చేస్తున్నాయి. నెటిజన్స్ ది అదే సిట్యువేషన్. మరి జాన్వీ మాటలని చూద్దాం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతు నేను తల్లిపై ఆధారపడిన కూతుర్ని. సొంత నిర్ణయాలు తీసుకునేందుకు నా మెదడులోని సామర్ధ్యాన్ని ఉపయోగించే దానిని కాదు. అందుకే ప్రతి విషయానికి అమ్మపైనే ఆధారపడ్డాను. అలాంటిది అమ్మ మరణంతో నా నిర్ణయాలు నేనే తీసుకోవాలనే పరిస్థితులని సృష్టించింది. దాంతో కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. ముఖ్యంగా నా లైఫ్ లోకి సంబంధం లేని వ్యక్తులని రానిచ్చాను. ఇక నుంచి అలా చెయ్యను. అమ్మ విషయంలో ఇప్పుడు జాలి చూపిస్తున్నంత వాళ్లంతా ఆమె బతికి ఉన్నపుడు జాలి చూపించే వారు కాదు. తన వ్యక్తిగత జీవితం గురించి చాలా మాటలు అనేవారు. అవన్నీ అమ్మని ఎంతగానో బాధపెట్టేవి. ఆ రోజు నేను ఆ బాధని అర్ధం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నేను ఆ బాధని అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది. Also read: Ntr: ఎన్టీఆర్‌తో మాత్రమే నా బాధలని చెప్పుకుంటానంటున్న హీరోయిన్ జాన్వీ రీసెంట్ గా తన పిక్స్ ని అసభ్యకరమైన రీతిలో షూట్ చేసే ఫొటోగ్రాఫర్ల తీరుపై మండి పడుతు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. పెద్ది తర్వాత ఇంకా ఏ చిత్రానికి జాన్వీ కమిట్ కాలేదు. అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ 'రాకా' లో ఒకే అయ్యిందనే న్యూస్ చాలా రోజుల నుంచి స్వతంత్రంగానే చక్కర్లు కొడుతుంది.
Apr 08, 2026
Peddi: మళ్ళీ మారిన పెద్ది రిలీజ్ డేట్.. షాకిచ్చిన అయ్యగారు!
మెగా ఫ్యాన్స్ కి మరో షాక్! పెద్ది రిలీజ్ డేట్ మళ్ళీ మారిందా? లెనిన్ రిలీజ్ డేట్ తో మళ్ళీ మొదటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదట మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. అక్కడి నుంచి మళ్ళీ జూన్ 26కి వాయిదా పడినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ డేట్ కూడా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తోంది. అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదట ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఏప్రిల్ 30న 'పెద్ది' ఉండటంతో తమ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా 'పెద్ది' కొత్త విడుదల తేదీగా ప్రచారం జరుగుతున్న జూన్ 26పై 'లెనిన్' కర్చీఫ్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే జూన్ 26న లెనిన్ ని విడుదల చేయనున్నట్లు తెలిపిన మేకర్స్.. నేడు(ఏప్రిల్ 8) అక్కినేని అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఆ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేశారు. అదే తేదీకి తమ సినిమాని తీసుకొస్తున్నట్లు తెలుపుతూ కొత్త పోస్టర్ ను వదిలారు. గతంలో 'పెద్ది' కోసమే తమ సినిమాని వాయిదా వేసినట్లు 'లెనిన్' టీమ్ ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు పెద్దికి పోటీగా విడుదల చేసే అవకాశంలేదు. జూన్ 26న పెద్ది రావట్లేదనే సమాచారంతోనే ఆ తేదీపై లెనిన్ టీమ్ కర్చీఫ్ వేసి ఉంటుంది. దీంతో 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ పై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది. అయితే 'పెద్ది' మూవీ జూన్ 26 కంటే ముందే వచ్చే అవకాశముందని తెలుస్తోంది. జూన్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. Also Read: ఇతను హీరో ఏంటి అన్నారు.. ఇప్పుడు పాన్ ఇండియాని షేక్ చేస్తున్నాడు! https://x.com/SitharaEnts/status/2041720204477059264
Apr 08, 2026
Ntr: ఎన్టీఆర్‌తో మాత్రమే నా బాధలని చెప్పుకుంటానంటున్న హీరోయిన్
-ఎన్టీఆర్ ఎంతో అభిమానం -ఆయన ఒక శక్తి కూడా -తనతో మాత్రమే అన్ని షేర్ చేసుకుంటాను మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)ప్రస్తుతం 'డ్రాగన్'(Dragon)చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ లుక్ తో పాటు షూటింగ్ షెడ్యూల్స్ కి సంబంధించి కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్న రూమర్స్ ని నమ్మవద్దని మేకర్స్ కాసేపటి క్రితమే ఒక ప్రకటన చేసారు. సదరు న్యూస్ సోషల్ మీడియాలో కొద్దిగా కుదురుకుంటు ట్రెండ్ అవుతున్న టైంలో ఎన్టీఆర్ గురించి ప్రముఖ నటి మమతా మోహన్(Mamta Mohandas)దాస్ చెప్పిన మాటలు నయా ఎన్టీఆర్ ట్రెండ్స్ లోకి వచ్చింది. దీంతో రెండు న్యూస్ మధ్య హెల్ది పోటీ నెలకొని ఉంది. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మమతా మోహన్ దాస్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఎన్టీఆర్ నా అభిమాన వ్యక్తి. నటుడిగానే కాకుండా, ఒక అద్భుతమైన వ్యక్తిగా, శక్తిగా భావిస్తాను. ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎన్టీఆర్ తో మాత్రమే నా బాధలని పంచుకుంటాను. నాలాగానే ఎన్టీఆర్ కి నాకు సంగీతం పట్ల విపరీతమైన ప్రేమ ఉంది. మా ఇద్దరి మధ్య బలమైన బంధానికి కూడా అదే కారణం. మేము ఎప్పుడైనా కలిస్తే యో వాట్స్ అప్ అని పలకరించుకుంటాం. సంవత్సరాలు గడుస్తున్నా ఆ అనుబంధంలో ఎలాంటి మార్పు రాలేదు. నేను ఒకసారి యూఎస్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ నుంచి సడన్ గా ఫోన్ వచ్చింది. రాండమ్‌గా కాల్ చేశాను అని చెప్పాడు. దీన్ని బట్టి మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏ పాటిదో తెలుసుకోవచ్చని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చింది. Also read: Raakaa: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ ఇదే ఎన్టీఆర్, మమతా మోహన్ దాస్ కలిసి యమదొంగ(Yamadonga)లో జంటగా చేసారు. జంటగా చేసారు అనే కంటే తమ చిలిపి అల్లరితో సిల్వర్ స్క్రీన్ తన జన్మ ధన్యమైందని మురిసిపోయేలా చేసారు. మమతా మోహన్ దాస్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ కూడా.సింగర్ గాను పలు చిత్రాల్లో పాటలు పాడి గొంతుకి కూడా స్టార్ డమ్ తెచ్చుకున్న మమతా మోహన్ దాస్ క్యాన్సర్ తో పోరాడి కోలుకుంది. తన స్వస్థలం పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉన్న బహ్రయిన్. పేరెంట్స్ మళయాళీస్.
Apr 08, 2026
Allu Arjun: ఇతను హీరో ఏంటి అన్నారు.. ఇప్పుడు పాన్ ఇండియాని షేక్ చేసే హీరో అయ్యాడు!
నేడు (ఏప్రిల్ 8) నేషనల్ అవార్డు విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుట్టినరోజు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి అల్లు అర్జున్ పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. నేడు పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్న ఆయన ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. సినీ పరిశ్రమలో ఒక నటుడు వారసత్వంతో అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం మాత్రం చాలా కష్టం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, నేడు దేశవ్యాప్తంగా 'ఐకాన్ స్టార్'గా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. కెరీర్ స్టార్టింగ్ లో 'ఇతను హీరోనా' అని ట్రోల్ చేసిన వాళ్ళే.. ఇప్పుడు 'ఇతనురా హీరో అంటే' అని ప్రశంసిస్తున్నారు. సినీ ప్రయాణం - ఆరంభం 2003లో 'గంగోత్రి' సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించినప్పటికీ.. అర్జున్ లుక్స్, నటన విషయంలో కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. "ఈ అబ్బాయి హీరో ఏంటి?" అని విమర్శించిన వారు కూడా ఉన్నారు. అయితే, తనపై వచ్చిన విమర్శలనే మెట్లుగా మార్చుకుని, తనని తాను గొప్పగా మలుచుకున్నారు బన్నీ. కెరీర్ టర్నింగ్ పాయింట్ దర్శకుడు సుకుమార్‌తో చేసిన 'ఆర్య' (2004) సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పింది. కేవలం ఒక్క ఏడాదిలోనే తన రూపురేఖలను పూర్తిగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. "ఫీల్ మై లవ్" అంటూ వచ్చి యువత మనసు దోచుకున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ను యూత్ ఐకాన్‌గా మార్చేసింది. ఇక్కడి నుంచే ఆయన "స్టైలిష్ స్టార్" అనే బిరుదుకు అర్హత సాధించారు. ఆ తర్వాత 'బన్నీ', 'దేశముదురు' సినిమాలతో మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. 'దేశముదురు' కోసం టాలీవుడ్లో మొట్టమొదటిసారి సిక్స్ ప్యాక్ బాడీని పరిచయం చేసి, అందరి దృష్టిని ఆకర్షించారు. ట్రోల్స్ - పోరాటం వారసత్వంతో వచ్చిన హీరో కావడంతో అల్లు అర్జున్ కెరీర్ ఆరంభంలో తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. ప్రతి చిన్న విషయంలోనూ ఆయనను ఇతరులతో పోల్చేవారు. ముఖ్యంగా లుక్స్, నటనపై అప్పట్లో నెగటివ్ కామెంట్స్ వచ్చేవి. అయితే, ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపించాలనే పట్టుదలతో ఆయన పనిచేశారు. ప్రతి సినిమాకు తన మేకోవర్ మారుస్తూ, అద్భుతమైన నటనతో విమర్శకుల నోళ్లు మూయించారు. ట్రోల్స్ వస్తున్నా వెనకడుగు వేయకుండా, తనని తాను చెక్కుకుంటూ వెళ్లడం బన్నీ ప్రత్యేకత. మలయాళంలో కూడా భారీ క్రేజ్ సంపాదించి "మల్లు అర్జున్"గా పేరు తెచ్చుకోవడం ఆయన కష్టానికి నిదర్శనం. ఉత్తమ ప్రదర్శనలు వేదం: ఒక గ్లామర్ హీరోగా ఉంటూనే, 'కేబుల్ రాజు' వంటి మధ్యతరగతి పాత్రను పోషించి తన నటనలోని లోతును చూపించారు. కేబుల్ రాజు పాత్రలో ఆయన నటన అందరినీ కదిలించింది. రుద్రమదేవి: గోన గన్నారెడ్డిగా తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఫేమస్. రేసుగుర్రం: ఈ సినిమాతో తనలోని కామెడీ టైమింగ్‌ను అద్భుతంగా పండించి భారీ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. అల వైకుంఠపురములో: తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో మెప్పించడమే కాకుండా, ఈ సినిమాతో నాన్-బాహుబలి రికార్డులను తిరగరాశారు. ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. పాటల నుంచి నటన వరకు అంతా ఒక మ్యాజిక్ లాగా జరిగిపోయింది. గ్లోబల్ క్రేజ్ - జాతీయ అవార్డు 'పుష్ప: ద రైజ్' సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లింది. "తగ్గేదే లే" అనే డైలాగ్ దేశ సరిహద్దులు దాటి మారుమోగింది. ఈ సినిమాతో ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సాధించిన మొదటి హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా 'రాకా'(RAAKA) చేస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ను గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్నారు. అలాగే, తన 23వ సినిమాని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. దర్శకుడు సుకుమార్ తో 'పుష్ప 3' లైన్ లో ఉంది. పలువురు స్టార్ డైరెక్టర్స్ సైతం అల్లు అర్జున్ కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ఎన్ని ట్రోల్స్ ఎదురైనా, తన కష్టాన్నే నమ్ముకుని, ప్రతి సినిమాకు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ 'స్టైలిష్ స్టార్' నుంచి 'ఐకాన్ స్టార్'గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణం ఎందరో యువ నటులకు స్ఫూర్తిదాయకం. తన డ్యాన్స్, స్టైల్, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అల్లు అర్జున్ మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే బన్నీ!
Apr 08, 2026
Raaka: అల్లు అర్జున్, అట్లీ మూవీ టైటిల్ ఇదే
-బర్త్ డే సందర్భంగా టైటిల్ రిలీజ్ -టైటిల్ ఇదే -ఇక రికార్డులే తరువాయి అంటున్న ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న మూవీ టైటిల్ వచ్చేసింది. రావడమే కాదు ఎన్నో ప్రశ్నలకి సమాదానాలు వెతుకుతుండంతో పాటు కథ ఏమై ఉంటుందనే ఆలోచన రిలీజ్ టైం వరకు నిత్యం ఉహించుకునేలా ఉంది. మరి టైటిల్ చూద్దాం. రాకా(Raaka).. టైటిల్ ఇదే... అల్లు అర్జున్ లుక్ తో రిలీజ్ చేసారు. పొడవాటి గోళ్ళతో ఉన్న అల్లు అర్జున్ అతీంద్రీయ శక్తుల్ని నింపుకున్న మహాశక్తినిరా అన్నట్టుగా చూస్తున్నాడు. చూపులు చాలా కన్నింగ్ గా ఉన్నాయి. కనురెప్పల డిజైన్, నెత్తిపై జుట్టు లేకుండా ఉండటం చూస్తే అల్లు అర్జున్ 'రాకా' గా పెద్ద గత్తరనే లేపేలా ఉన్నాడు. టైటిల్ తో పాటు లుక్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్పందిస్తు పాన్ ఇండియా లెవల్లో 'రాకా'తో భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త సునామి నమోదవ్వడం ఖాయమని అంటున్నారు. Also read: Allu Arjun: బర్త్ డే విషెస్ చెప్పడానికి భారీగా చేరిన ఫ్యాన్స్.. 11 గంటలకి నో ట్రాఫిక్ సన్ పిక్చర్స్ కానీ వీని ఎరుగని బడ్జెట్ తో నిర్మిస్తుండగా సాయి అభ్యంకర్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. దీపికా పదుకునే ఒక హీరోయిన్ కాగా మరో నలుగురు హీరోయిన్స్ కి చోటు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే అనే విషయం తెలిసిందే. .
Apr 08, 2026
Allu Arjun: బర్త్ డే విషెస్ చెప్పడానికి భారీగా చేరిన ఫ్యాన్స్.. 11 గంటలకి నో ట్రాఫిక్
-ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే -ఇంటి దగ్గరకి భారీగా చేరిన ఫ్యాన్స్ -అట్లీ మూవీ టైటిల్ రిలీజ్ ఏప్రిల్ 8 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటని పాన్ ఇండియా లెవల్లో ఎవర్ని అడిగినా చెప్పే ఒకే ఒక మాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)బర్త్ డే. అంతలా తనకి మాత్రమే సాధ్యమయ్యే నాచురల్ పెర్ఫార్మ్ ద్వారా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పుడు వాళ్లంతా తమ అభిమాన హీరోకి బర్త్ డే విషెస్ చెప్పడానికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ నివాసానికి భారీగా పోటెత్తారు. అల్లుఅర్జున్ వాళ్ళందర్నీ సంతోషపరుస్తు అందరి దగ్గరకి వెళ్లి కరచాలనం చేసాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఉన్న ప్రెజెంట్ లుక్ వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం తెలిసిందే. ఆ లుక్ ఆ చిత్రం లోనిదే అని అర్ధమవుతుంది. ఇక మరికొన్ని నిమిషాల్లో అంటే 11 గంటలకి టైటిల్ రిలీజ్ కాబోతుండటంతో కాసేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఉండకపోయే ఛాన్స్ ఉంది. రేసు గుర్రం రీ రిలీజ్ తో అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కి మూడు పండగలు వచ్చినట్టే. Also read: Mrunal Thakur: తెలుగు సినిమా చేయనని చెప్పిన మృణాల్.. డైరెక్టర్ తో జరిగిన సంభాషణ లీక్
Apr 08, 2026
Mrunal Thakur: తెలుగు సినిమా చేయనని చెప్పిన మృణాల్.. డైరెక్టర్ తో జరిగిన సంభాషణ లీక్
-డెకాయిట్ తో ఎల్లుండి మృణాల్ సందడి -మరి తెలుగు సినిమా చేయనని ఎందుకు చెప్పింది -అలా చెయ్యడానికి కారణం ఏంటి -విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ సిల్వర్ స్క్రీన్, మేకర్స్, హీరో, బాక్స్ ఆఫీస్ కి లక్కీ హీరోయిన్ ఎవరంటే మృణాల్ ఠాకూర్. (Mrunal Thakur)అంతలా తన ఛరిష్మాతో సినీ శాసనాన్నే సృష్టించుకుంది. ఈ క్రమంలో ఈ నెల 10 న వస్తున్న 'డెకాయిట్'(Dacoit)పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అడివిశేష్(Adivi Sesh)హిట్ ట్రాక్ లోనే నడుస్తున్నా మృణాల్ రాకతో హిట్ పై మరింత నమ్మకం ఏర్పడింది. మరి అలాంటి మృణాల్ ఇక నేను తెలుగు సినిమాలు చేయనని చెప్పడం చర్చినీయాంశ మయ్యింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మృణాల్ ప్రీవియస్ మూవీ హాయ్ నాన్న సాధించిన ఘనవిజయం తెలిసిందే. యష్ట అనే క్యారక్టర్ లో రెండు విభిన్న షేడ్స్ లో మృణాల్ కనపర్చిన పెర్ఫార్మ్ కి మెస్మరైజ్ కానీ ప్రేక్షకుడు ఉండడు.అసలు ఆ క్యారక్టర్ లో తనని తప్ప మరొకర్ని ఊహించే సాహసం చేయం. ఆ చిత్ర దర్శకుడు శౌర్యువ్(Shouryuv)నిన్న జరిగిన డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతు హాయ్ నాన్న షూటింగ్ టైంలో మృణాల్ నాకు ఫోన్ చేసి ఇక నా వల్ల కాదు. తెలుగు సినిమా చేయనని చెప్పేది. బహుశా భాషాపరమైన ఇబ్బందులు, క్యారక్టర్ లో ఒదిగిపోయే క్రమంలో వచ్చే ఒత్తిడేమో తెలియదు గాని, ఇక తెలుగులో చేయనని చెప్పింది. కానీ నేను ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు. తన యాక్టింగ్ కి ఉన్న శక్తి నాకు తెలుసనీ చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. also read: Ntr:దయచేసి రూమర్స్ నమ్మకండి ఇక అభిమానులు స్పందిస్తు మృణాల్ గారు మీరు తెలుగు సినిమాకి చాలా కాలం రోజుల తర్వాత దొరికిన అందమైన హీరోయిన్, అందమైన పెర్ఫార్మ్ ప్రదర్శించే నటి. డెకాయిట్ కి ముందే మాకు ఈ విషయం తెలిసి ఉంటే కనుక, ముంబై మీ ఇంటి ముందు టెంట్ వేసి మరి నిరాహార దీక్ష చేసే వాళ్ళం. మా అభిమానం ఎలా ఉంటుందో గత హీరోయిన్స్ ట్రాక్ రికార్డు చూసుకోండి. సీతారామంతోనే ఈ విషయంలో ఫిక్స్ అయ్యిపోయాం అనే కామెంట్స్ చేస్తున్నారు. మహారాష్ట్రలోని ధూలే ఏరియాకి చెందిన మృణాల్ 2014 లో 'హలో నందన్' అనే మరాఠి చిత్రం ద్వారా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. డెకాయిట్ తెలుగులో నాలుగో చిత్రం.
Apr 08, 2026
Ntr: దయచేసి రూమర్స్ నమ్మకండి
-ఎన్టీఆర్ కట్ అవుట్ కి ఉన్న రేంజ్ తెలిసిందే -మరి ఆ రూమర్స్ సృష్టిస్తుంది ఎవరు -మేకర్స్ ఏం చెప్తున్నారు -ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ మీ కోసమే అభిమానులు, మూవీ లవర్స్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు వింటేనే చాలు సినీ పరవశంతో పులకరించిపోతారు. అసలు స్క్రీన్ పై ఎన్టీఆర్(Ntr)పెర్ఫార్మ్ చూడాలంటే పెట్టి పుట్టాలనే సామెత కూడా చాలా బలంగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ కారణం వల్లనే బాక్స్ ఆఫీస్ సైతం సలాం కొట్టి నీ ఇష్టం ఎంత ఫిగర్ నమోదు చేస్తావో చేసుకో అని గత రికార్డ్స్ అన్నిటిని పక్కకి జరుపుతుంది. అంతటి ఛరిష్మాని పదహేరేళ్ళ వయసు నుంచే సంపాదించుకున్నది బహుశా వరల్డ్ సినీ హిస్టరీ లోనే ఎన్టీఆర్ నే అవ్వచ్చు. మరి అలాంటి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన రూమర్ ఒకటి స్ప్రెడ్ అయితే ఊరుకుంటారా! ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడేసారు.. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ డ్రాగన్.. ఈ టైటిల్ ని అధికారకంగా కన్ఫార్మ్ చేయకపోయినా ప్రశాంత్ నీల్(Prashanth Neel), మైత్రి వాళ్ల మైండ్ సెట్ ని గమనిస్తే అదే నిజమని అనిపిస్తుంది. రెగ్యులర్ షూటింగ్ లోనే ఉంది. కానీ రూమర్స్ మేధావులు రంగంలోకి దిగి ఇటీవలే షూట్ కి సంబంధించి ఒక షెడ్యూల్ ని రద్దు చేసారని స్ప్రెడ్ చేస్తున్నారు. పైగా ఎన్టీఆర్ లుక్ ఇదేనంటూ మేకర్స్ సైతం నిజామా అని ఆశ్చర్యపోయేలా లుక్ ని డిజైన్ చేస్తున్నారు. మరి లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే కోట్ల రూపాయల ఖర్చుతో డ్రాగన్ ని తయారు చేస్తున్న మేకర్స్, ఫ్యాన్స్ ఎంతగానో బాధపడతారు కదా. ఒక్కోసారి నిజమైన లుక్, షూటింగ్ అప్ డేట్స్ ని మేకర్స్ ప్రకటించినా, ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు మేకర్స్ స్వయంగా డ్రాగన్ పై అధికారంగా స్పందిస్తు ఎన్టీఆర్ లుక్ గురించి గానీ, షెడ్యూల్ రద్దు గురించి గానీ ప్రచారంలో ఉన్న వదంతులలో ఏమాత్రం నిజం లేదు. జనరల్ గా వచ్చే గ్యాప్ తప్ప ప్రణాళిక ప్రకారమే మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. మేము ధృవీకరించని సమాచారాన్ని ఎవరు నమ్మద్దు, వ్యాప్తి కూడా చేయవద్దని అందరినీ కోరుతున్నాము.ఇక మా నుంచి అధికారిక అప్డేట్లు కంటిన్యూ గా వస్తాయని తెలిపింది. Also Read: నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేశా దీంతో రూమర్స్ మేధావులకి మైండ్ బ్లాంక్ అయ్యి దిమ్మ తిరిగినంత పని అయ్యింది. ఫ్యాన్స్ మాత్రం మేకర్స్ కి కంగ్రాట్స్ చెప్తు ఇక నుంచైనా రూమర్స్ కి అలా సృష్టించే అవకాశం ఇవ్వకుండా మీరే ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇవ్వాలని కోరుతున్నారు. డ్రాగన్ ఎన్టీఆర్ ఎంటైర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుంది. ప్రశాంత్ నీల్ కూడా తన గత చిత్రాలు కేజీఎఫ్ సిరీస్, సలార్ ని మించి హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ జత కడుతుంది. There is absolutely no truth to the rumours circulating about the look or any schedule cancellation. The film is progressing as planned, with only a routine preparation gap. We request everyone not to believe or spread unverified information. Official updates will always come from us. #NTRNeel
Apr 07, 2026వారణాసి.. రిలీజ్ కౌంట్‌డౌన్ షురూ.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'వారణాసి'పై అంచనాలు ఆకాశాన్నం టుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక గ్లోబ్‌ట్రోటర్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విడుదల కోసం యావత్ సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీమ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన కౌంట్‌డౌన్ ప్రారంభించడంతో సోషల్ మీడియాలో వారణాసి మానియా మొదలైంది. సరిగ్గా మరో ఏడాదిలో, అంటే ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెండితెరపై సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మధ్య జరిగిన సంభాషణలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి "365" అని పోస్ట్ చేయడం ద్వారా రిలీజ్ కౌంట్‌డౌన్‌ను గుర్తు చేయగా, నిర్మాత కార్తికేయ మొదటి సాంగ్ అప్డేట్ గురించి ఆరా తీయడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సందడి చూస్తుంటే రాజమౌళి మార్క్ భారీ ప్రమోషన్లకు రంగం సిద్ధమైందని స్పష్టమవుతోంది. దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన ఎద్దుపై స్వారీ చేస్తూ, చేతిలో త్రిశూలం పట్టుకున్న విజువల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ కథ అంటార్కిటికా మంచు ఖండాల నుంచి ఆఫ్రికా దట్టమైన అడవుల వరకు, చివరకు పవిత్ర కాశీ నగరం వరకు సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐమ్యాక్స్ ఫార్మాట్లో రాజమౌళి ఈ విజువల్ వండర్‌ను తీర్చిదిద్దుతున్నారు. హీరోయిన్గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. చాలా కాలం తర్వాత ఆమె భారతీయ సినిమాలో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్, విజయేంద్ర ప్రసాద్ కథ వెరసి ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో శరవేగంగా జరుగుతోంది. వారణాసి నగరాన్ని తలపించేలా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంతర్జాతీయ మీడియా సైతం ఈ ప్రాజెక్ట్ వైపు ఆసక్తిగా చూస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది, శ్రీరామనవమి పండుగల కానుకగా 'వారణాసి' థియేటర్లలోకి రానుంది. అప్పటివరకు వరుస అప్డేట్లతో అభిమానులను అలరించడానికి చిత్ర బృందం పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. మహేష్-రాజమౌళి మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే!
Apr 07, 2026
బాలయ్య బాటలో షారుఖ్ ఖాన్.. సూపర్‌స్టార్‌కి బిగ్ షాక్!
జైలర్ 2 నుంచి షారుఖ్ ఖాన్ అవుట్? బాలీవుడ్ ‘బాద్ షా’ నో చెప్పడానికి అసలు కారణం ఇదే! సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’(Jailer 2)పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఒక పవర్ఫుల్ కేమియో రోల్ చేయబోతున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేసింది. అయితే, తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రజనీ-షారుఖ్ కాంబో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పెద్ద షాక్ అని చెప్పాలి. నిజానికి షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో నటించడానికి మొదట చాలా ఆసక్తి చూపించారట. నెల్సన్ రాసుకున్న పాత్ర ఆయనకు కూడా బాగా నచ్చిందని సమాచారం. కానీ, తన అప్‌కమింగ్ మూవీ ‘కింగ్’ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. తన కూతురు సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రం చేస్తున్న ‘కింగ్’ సినిమా షారుఖ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆ సినిమాలో తన లుక్ ఎంతో డిఫరెంట్‌గా ఉంటుందని, అది బయటకు రాకముందే వేరే సినిమాలో కనిపించడం ఇష్టం లేకనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ‘జైలర్ 2’ ఆగస్టు 2026లో విడుదలయ్యే అవకాశం ఉండగా, షారుఖ్ ‘కింగ్’ డిసెంబర్లో రాబోతుంది. ఒకవేళ ‘జైలర్ 2’లో కామియో చేస్తే, ‘కింగ్’ కంటే ముందే తన లుక్ రివీల్ అవుతుంది. అందుకే షారుఖ్ రజనీకాంత్ తో పాటు ‘జైలర్ 2’ మేకర్స్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఇద్దరు లెజెండరీ స్టార్లను ఒకే స్క్రీన్ మీద చూడాలనుకున్న సినీ ప్రేమికులకు నిరాశ తప్పడం లేదు. నిజానికి ‘జైలర్ 2’లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కూడా ఒక పవర్ఫుల్ కేమియో రోల్ చేయబోతున్నారనే వార్త తెగ చక్కర్లు కొట్టింది. అయితే బాలయ్య హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉండటం, కేమియో రోల్స్ చేయడానికి ఆసక్తి లేకపోవడం వంటి కారణాలతో ఆయన ‘జైలర్ 2’కి ఓకే చెప్పలేదు. ఇక ఇప్పుడు షారుఖ్ కూడా బాలయ్య బాటలోనే పయనిస్తూ ‘జైలర్ 2’కి షాకిచ్చారు. బాలయ్య, షారుఖ్ వంటి స్టార్స్ లేకపోయినా.. మొదటి భాగంలో ఉన్న మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఈ సీక్వెల్ లో కూడా మెరవబోతున్నారు. ‘జైలర్ 2’ గురించి రజనీకాంత్ రీసెంట్గా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
Apr 07, 2026డ్రాగన్ కోసం భారీ రిస్క్.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ అంత సాహసం చేస్తున్నారా?
- ఎన్టీఆర్ ప్రాణాలకు తెగిస్తున్నారా? - డ్రాగన్ కోసం 15 కిలోల బరువు తగ్గిన యంగ్ టైగర్! - యుద్ధ విద్యలతో ఎన్టీఆర్ విశ్వరూపం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం గోల్డెన్ ఫేజ్‌లో ఉంది. గ్లోబల్ హిట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత వచ్చిన 'దేవర' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి తారక్ స్టామినాను మరోసారి నిరూపించింది. అయితే, బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్-2' విషయంలో వస్తున్న కొన్ని మిశ్రమ వార్తల నేపథ్యంలో, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తారక్ చేస్తున్న సాహసాలు ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్ కావడమే కాకుండా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చేస్తున్న మొట్టమొదటి భారీ రిస్క్ ఆయన భౌతిక రూపం. ప్రశాంత్ నీల్ కోరిక మేరకు తారక్ దాదాపు 15 కిలోలకు పైగా బరువు తగ్గి అల్ట్రా స్లిమ్ లుక్‌లోకి మారిపోయారు. రీసెంట్గా బయటకొచ్చిన ఆయన ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం సినిమా కోసం ఇంతలా కష్టపడటం ఎన్టీఆర్ డెడికేషన్‌కు నిదర్శనం. అయితే ఈ స్లిమ్ లుక్ వెనుక ఒక భారీ యాక్షన్ మిస్టరీ దాగి ఉందని తెలుస్తోంది. కేవలం లుక్ మార్చడమే కాదు, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం తారక్ కత్తి మీద సాము చేస్తున్నారు. భారతీయ పురాతన యుద్ధ విద్య అయిన 'కలరిపయట్టు'లో ఎన్టీఆర్ శిక్షణ తీసుకుంటున్నారట. కేరళకు చెందిన నిపుణుల సమక్షంలో అత్యంత కఠినమైన ఈ విద్యను నేర్చుకుంటూ, షూటింగ్ సమయంలో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రశాంత్ నీల్ మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్లలో ఈ యుద్ధ విద్య హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ గోవిందా ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తారక్ క్యారెక్టర్‌కు మెంటర్‌గా ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది. ఇక ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ పాన్ వరల్డ్ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేగంగా జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా, ఈస్టర్న్ ఇండియా డ్రగ్ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్. వరుస షెడ్యూల్స్ మరియు కఠినమైన యాక్షన్ సీన్స్ వల్ల తారక్ కాస్త అలసటకు గురైనప్పటికీ, ఎక్కడా తగ్గకుండా పని చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్లకు, తారక్ నటవిశ్వరూపం తోడైతే బాక్సాఫీస్ వద్ద సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం హిట్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా 'డ్రాగన్' టీమ్ పని చేస్తోంది. తారక్ చేస్తున్న ఈ సాహసాలు వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయో చూడాలి!
Apr 07, 2026
Trisha: ఆ రూమర్ నిజమేనా? పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చిన త్రిష!
అతనితో పెళ్ళి, నలుగురు పిల్లలు వైరల్ గా మారిన త్రిష ఇన్స్టాగ్రామ్ స్టోరీ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రముఖ హీరోయిన్ త్రిష(Trisha) వ్యక్తిగత జీవితంపై రకరకాల రూమర్స్ షికారు చేస్తున్నాయి. ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పబోతోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై త్రిష తనదైన శైలిలో స్పందించింది. తనపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ తాజాగా త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ పెట్టింది. "నేను సినిమాలకు గుడ్‌బై చెప్పేశానట, ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్నానట.. అంతేకాదు, నిన్నటితో రెండేళ్లు నిండిన నలుగురు పిల్లలను కూడా పెంచుతున్నానట. ఇంకేమైనా జోడించాలా? లేక ఈ రోజుకి మన ‘ఫిక్షన్ కోటా’ పూర్తయిందా?" అంటూ సెటైరికల్ గా స్పందించింది. త్రిష చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై వార్తలు రావడం సహజం, కానీ త్రిష విషయంలో అవి కాస్త శ్రుతి మించాయని ఆమె స్పందన చూస్తే అర్థమవుతోంది. ఈ ఒక్క పోస్ట్‌తో తన రిటైర్మెంట్, పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రిష క్లారిటీ ఇచ్చేసింది. కాగా, ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ను త్రిష ప్రేమ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైందని, పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చే అవకాశముందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పనుందని న్యూస్ చక్కర్లు కొట్టింది. ప్రముఖ నటుడు చిత్రా లక్ష్మణన్ సైతం ఒక ఇంటర్వ్యూలో.. ఇక త్రిష సినిమాల్లో నటించదని చెప్పాడు. దీంతో త్రిష పెళ్ళి వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ వార్తల నేపథ్యంలోనే తనదైన శైలిలో సెటైరికల్ పోస్ట్ పెట్టి.. రూమర్స్ కి చెక్ పెట్టింది త్రిష. ప్రస్తుతం త్రిష కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో నటిస్తోంది. అలాగే తమిళ్ లో 'కరుప్పు', మలయాళంలో 'రామ్' సినిమాలు చేస్తోంది.
Apr 07, 2026కియారా అద్వానీ సెన్సేషనల్ కామెంట్స్.. యష్ ‘టాక్సిక్’ మూవీపై క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, అభినయంతో మెప్పిస్తున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలతో తెలుగువారికి చేరువైన ఈ భామ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'గేమ్ చేంజర్'లోనూ సందడి చేయనుంది. అయితే తాజాగా కన్నడ రాకింగ్ స్టార్ యష్ సరసన ఆమె నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'టాక్సిక్' (Toxic) గురించి కియారా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తన కెరీర్ ప్లానింగ్ మరియు సినిమాల ఎంపికపై ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కియారా అద్వానీ 'టాక్సిక్' చిత్రం గురించి మాట్లాడుతూ.. ఇది తన కెరీర్లో అత్యంత విభిన్నమైన మరియు పవర్ఫుల్ పాత్ర కాబోతోందని హింట్ ఇచ్చారు. ప్రతిభావంతుడైన నటుడు యష్, విభిన్న కథా చిత్రాల దర్శకురాలు గీతూ మోహన్ దాస్ విజన్‌లో భాగం కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సినిమాలో తన పాత్ర చాలా బలంగా ఉంటుందని, అయితే అంతకు మించి ఇప్పుడు ఏమీ వెల్లడించలేనని ఆమె సస్పెన్స్ మెయింటైన్ చేశారు. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా నటిగా తనను తాను నిరూపించుకునే అవకాశం ఈ సినిమా ద్వారా లభిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన బాధ్యతల గురించి కియారా చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. "నేను ఇప్పుడు నా సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తున్నాను. ఇంటి దగ్గర చిన్నారిని వదిలి షూటింగ్‌కు వస్తున్నానంటే, నేను చేసే సినిమా ఆ త్యాగానికి తగ్గట్టుగా చాలా గొప్పగా ఉండాలి" అని ఆమె స్పష్టం చేశారు. క్వాలిటీ లేని కథలను తాను అంగీకరించబోనని, అందుకే ఇప్పుడు సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని కియారా వెల్లడించారు. ఇటీవలి కాలంలో డేట్స్ సర్దుబాటు కాక కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై కూడా ఆమె స్పందించారు. ప్రాధాన్యతలు మారడం వల్లే కొన్ని సినిమాలకు నో చెప్పాల్సి వచ్చిందని, అయితే దీని వల్ల తన కెరీర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని ఆమె ధీమాగా చెప్పారు. ఒకవైపు సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు పక్కా ప్రణాళికతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేసుకుంటున్న కియారా పరిణితిని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. యష్ హీరోగా వస్తున్న 'టాక్సిక్' సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. 'కేజీఎఫ్' సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించడమే కాకుండా, ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉండబోతోందని తెలియడంతో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.
Apr 07, 2026సంతోష్ శోభన్ సరికొత్త ప్రయాణం.. సత్తిబాబు పరలోక యాత్ర షురూ!
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ తన కెరీర్లో మరో ఆసక్తికరమైన అడుగు వేశారు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ యూత్ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, తాజాగా తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు 'సత్తిబాబు పరలోక యాత్ర' అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. టైటిల్ వినడానికే చాలా ఫన్నీగా, ఆసక్తికరంగా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ మొదలైంది. ఇటీవలే 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో సంతోష్ శోభన్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా ఈ సినిమా సుమారు 50 రోజులు ప్రదర్శితమై రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక యంగ్ తెలుగు హీరో సినిమాకు కోలీవుడ్ మార్కెట్లో ఈ స్థాయి ఆదరణ లభించడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో సంతోష్ ఇప్పుడు 'సత్తిబాబు పరలోక యాత్ర' చేయడానికి రెడీ అయిపోయారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'స్వాతిముత్యం' వంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. యువి క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో 'ఏక్ మినీ కథ', 'పేపర్ బాయ్', 'మంచి రోజులు వచ్చాయి' వంటి సినిమాలతో సంతోష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. నటనలో ఈజీనెస్, కామెడీ టైమింగ్‌లో తనదైన ముద్ర వేయడం సంతోష్ ప్రత్యేకత. ఇప్పుడు లక్ష్మణ్ కె కృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో జతకట్టడం ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. 'కపుల్ ఫ్రెండ్లీ' మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ విషయానికి వస్తే.. జూన్ మొదటి వారం నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్న ఈ 'సత్తిబాబు' ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి!
Apr 07, 2026
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com



