Home

»

Latest News

అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'టాక్సిక్' రికార్డు.. 24 గంట‌ల్లో ఎన్ని ల‌క్ష‌ల టికెట్స్ అంటే..?

Aug 22, 2026 1:08PM

కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్, చాలా గ్యాప్ తర్వాత తన కొత్త ప్రాజెక్ట్ 'టాక్సిక్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో బాక్సాఫీస్ వద్ద అప్పుడే విధ్వంసం సృష్టిస్తోంది.

టిక్కెట్ సేల్స్ ప్రారంభమైన కేవలం 24 గంటల్లోనే 3 ల‌క్ష‌ల 35 వేల టిక్కెట్లు అమ్ముడై ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా యష్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలోనూ, నార్త్ ఇండియా బెల్ట్‌లోనూ 'టాక్సిక్' క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మల్టీప్లెక్స్‌లు, బుకింగ్ యాప్‌లలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.

సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన మొదటి రోజు నుంచే కనబరుస్తున్న ఈ అపారమైన స్పీడ్ చూస్తుంటే, మొదటి రోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక ప్రధాన నగరాల్లో షోలు క్షణాల్లో ఫుల్ అయిపోతుండగా, థియేటర్ల యజమానులు సైతం డిమాండ్‌కు తగినట్లుగా షోల సంఖ్యను పెంచే పనిలో పడ్డారు.

ఈ చిత్రంలో యష్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి భారీ తారాగణం నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని యష్ వస్తున్న చిత్రం కావడంతో ఆయన అభిమానులు ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా 'టాక్సిక్' అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ నడుస్తోంది. విడుదల రోజు భారీ ఓపెనింగ్స్ సాధించడం మాత్రమే కాకుండా, సౌత్ తో పాటు నార్త్ మార్కెట్‌లోనూ భారీ ఓపెనింగ్ రికార్డులను యష్ తిరగరాయబోతున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా, అడ్వాన్స్ సేల్స్ ఇచ్చే ఈ పాజిటివ్ వైబ్స్‌తో రాబోయే రోజుల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్ మరియు వసూళ్ల గణాంకాలు ఏ స్థాయికి చేరుకుంటాయో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com