
అంచనాలని తలకిందులు చేస్తూ 'టాక్సిక్' డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఫ్యాన్స్ అయితే టాక్సిక్ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పట్లో తేరుకోవడం కష్టం. యష్ మాత్రం 'రామాయణ' తో బిజీగా ఉన్నాడు. ఇలా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్టే సోషల్ మీడియాలో యష్ చేయబోయే ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ కూడా వైరల్ హోదాలో బిజీగా ఉంది.
తనని ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ చైర్ పై కూర్చోబెట్టిన కేజిఎఫ్ మ్యాజిక్‌ని రిపీట్ చేయాలని చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. నిజానికి కేజిఎఫ్-3 కి సంబంధించి యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మధ్య డిస్కషన్ జరిగాయనే వార్తలు చాలాసార్లు వినిపించాయి.వరుసగా కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చేసిన యష్..మధ్యలో టాక్సిక్‌తో ప్రయోగం చేశాడు. అది కాస్త మిస్ ఫైర్ కావడంతో.. తన నెక్స్ట్ ప్రాజెక్టులపై యష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడని టాక్. అందులో భాగంగానే వేరే ఎలాంటి ప్రాజెక్ట్స్ జోలికి వెళ్లకుండా కేజిఎఫ్-3ని మళ్లీ లైన్‌లోకి తీసుకురావాలని అనుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమా బిజీలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో సలార్-2ను ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో నీల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ షెడ్యూల్స్‌లో వచ్చే మార్పులను బట్టి, డార్లింగ్ కమిట్‌మెంట్స్‌ను బట్టి.. నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ట్రాక్ ఎక్కించే అవకాశం ఉందని టాక్.

Also Read: ట్రైలర్ లోనే వాళ్ళు చెప్పార్రా: మా సినిమాకి రావద్దని..బలైపోయింది ఎవరు!
ఒకవేళ డ్రాగన్ తర్వాత సలార్-2 స్టార్ట్ చేసే పరిస్థితి లేకపోతే..యష్‌తో కేజిఎఫ్ 3ని పట్టాలెక్కించే ఆలోచన ఉందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా కేజిఎఫ్ 3 జరిగి యష్, ఇండస్ట్రీ, అభిమానుల కళ్ళల్లో ఆనందం పొంగిపొర్లాలని కోరుకుందాం.
[Yash, Toxic, Kgf3, Prashanth Neel, Telugu Cinema News, TeluguNews, Tollywood, Tollywood News, TeluguCinema]





