
రామాయణ సినీ దివ్య పరిమళ కాంతులని వీక్షించడానికి ముహూర్తం దగ్గరపడింది. దీంతో రామాయణ కి సంబంధించిన కొత్త న్యూస్ నిమిష నిమిషానికి బయటకి వస్తుంటే సినీ సర్కిల్స్ , సినీ ప్రియులు, రామభక్తులు చాలా భక్తి శ్రద్దలతో సదరు క్రేజీ న్యూస్ అన్నింటిని ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే రాకింగ్ స్టార్ యష్ తన సొంత రాష్ట్రమైన కర్ణాటకలో రామాయణని స్వయంగా పంపిణీ (Distribution) చేసే బాధ్యతని తీసుకున్నారు. దీంతో యష్‌కి సంబంధించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్' (Monster Mind Creations) బేనర్ ద్వారా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా రామాయణ విడుదల కానుంది. ఈ మేరకు కర్ణాటక టెరిటరీ పోస్టర్‌ని కూడా విడుదల చేయడంతో కన్నడ చిత్రసీమలో ఒక్కసారిగా అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇది కూడా చదవండి: జైలర్ 2 ఓటిటి డేట్ ఫిక్స్: కూతవేటుదూరంలోనే.. డేట్ ఇదే!

రామాయణలో రావణుడిగా, సహ నిర్మాతగానే కాకుండా, తన హోమ్‌స్టేట్‌లో డిస్ట్రిబ్యూటర్‌గా కూడా బాధ్యతలు చేపట్టడం ద్వారా యష్ రామాయణపై తనకున్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నవంబర్ 5 న రిలీజ్ అవుతున్న రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆ ఏరియా, ఈ ఏరియా అని లేకుండా చాలా హై స్పీడ్ వేగంతో జరుగుతున్నాయి.
[Yash Distributes Ramayana In Karnataka,yash ramayana karnataka distribution, nitesh tiwari ramayana, ranbir kapoor rama,Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]





.webp)
