Home

»

Latest News

ముచ్చ‌ట‌గా ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌తో మురిపిస్తారా!

Jun 22, 2022 4:20PM

ఈ జూలై నెల‌లో వారం వ్య‌వ‌ధిలో రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నాయి. క‌థానాయ‌కుడి జీవితంలో వివిధ ద‌శ‌ల్లో సాగే ప్రేమ‌క‌థ‌ల‌తో ఈ చిత్ర ద్వ‌యాలు తెర‌కెక్క‌డం విశేషం. అంతేకాదు.. ఈ రెండు సినిమాల్లోనూ ముచ్చ‌ట‌గా ముగ్గురు ముద్దుగుమ్మ‌లు సంద‌డి చేయ‌నున్నారు.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. వెర్స‌టైల్ కెప్టెన్ విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టించిన చిత్రం `థాంక్ యూ`. జూలై 8న విడుద‌ల కానున్న ఈ రొమాంటిక్ డ్రామాలో చైతూకి జంట‌గా రాశీ ఖ‌న్నా, అవికా గోర్, మాళ‌వికా నాయ‌ర్ క‌నువిందు చేయ‌నున్నారు. క‌థానాయ‌కుడి జీవితంలో ఈ ముగ్గురు నాయిక‌ల పాత్రేంటి అన్న‌ది సినిమా విడుద‌ల‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక జూలై 15న రిలీజ్ కానున్న `గుర్తుందా శీతాకాలం` కూడా హీరో లైఫ్ లో డిఫ‌రెంట్ స్టేజెస్ లో సాగే ప్రేమ‌క‌థ‌ల స‌మాహారమే. క‌న్న‌డ చిత్రం `ల‌వ్ మాక్ టైల్` (2020)కి రీమేక్ గా నాగ‌శేఖ‌ర్ తీర్చిదిద్దిన‌ ఈ సినిమాలో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా.. అత‌ని స‌ర‌స‌న త‌మ‌న్నా, మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. మ‌రి.. ముచ్చ‌ట‌గా ముగ్గురు ముద్దుగుమ్మ‌ల‌తో వారం వ్య‌వ‌ధిలో రాబోతున్న ఈ చిత్రాల‌తో చైతూ, స‌త్య‌దేవ్ ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com