ప్రభాస్ సరసన ఎన్టీఆర్ చేరతాడా..?
on Aug 12, 2025

ఒకప్పుడు ఏదైనా సినిమా రూ.100 కోట్లు గ్రాస్ రాబడితే గొప్ప అన్నట్టుగా ఉండేది. అలాంటిది ఇప్పుడు కొందరు స్టార్ హీరోల సినిమాలు మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరుతున్నాయి. ఈ విషయంలో అందరి కంటే ముందు ప్రభాస్ ఉన్నాడు. ఇప్పటిదాకా ఆయన నటించిన ఐదు సినిమాలు మొదటిరోజే వంద కోట్లకు పైగా రాబట్టాయి. అంతేకాదు, ప్రభాస్ నటించిన గత మూడు చిత్రాలు 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' వరుసగా ఈ ఫీట్ సాధించి సరికొత్త రికార్డుని నెలకొల్పాయి.
ప్రభాస్ మాదిరిగానే హ్యాట్రిక్ వంద కోట్ల ఓపెనర్స్ కలిగిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కి కూడా రికార్డు సృష్టించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ నటించిన గత రెండు సినిమాలు 'ఆర్ఆర్ఆర్', 'దేవర' మొదటి రోజు వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేశాయి. ఎన్టీఆర్ నటించిన కొత్త చిత్రం 'వార్-2' ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ డేనే వంద కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే.. ఓపెనింగ్ డే కలెక్షన్లతో వరుసగా మూడుసార్లు వంద కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా ప్రభాస సరసన ఎన్టీఆర్ చేరతాడు.
'వార్-2'లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కొల్లగొట్టగలిగే సత్తా ఈ సినిమాకి ఉందనే అంచనాలు ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



