Home

»

Latest News

ప‌వ‌న్ తో ఏ ద‌ర్శ‌కుడైనా మూడో సినిమా తీస్తే అంతేమ‌రి..!

Mar 06, 2022

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు 27 చిత్రాల్లో సంద‌డి చేశారు. వాటిలో 25 సినిమాల్లో క‌థానాయ‌కుడిగానూ.. 2 చిత్రాల్లో అతిథిగానూ అల‌రించారు. ఇక హీరోగా ప‌వ‌న్ కెరీర్ లో విజ‌యం సాధించిన సినిమాల విష‌యానికి వ‌స్తే.. `గోకులంలో సీత‌`, `సుస్వాగ‌తం`, `తొలిప్రేమ‌`, `త‌మ్ముడు`, `బ‌ద్రి`, `ఖుషి`, `జ‌ల్సా`, `గ‌బ్బ‌ర్ సింగ్`, `అత్తారింటికి దారేది`, `గోపాల గోపాల‌`, `వ‌కీల్ సాబ్`, `భీమ్లా నాయ‌క్`.. ఇలా 12 చిత్రాలు ఆ లిస్ట్ లో ఉంటాయి.

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. విజ‌యం సాధించిన ఈ 12 చిత్రాల్లో 7 సినిమాలు ఆయా ద‌ర్శ‌కుల‌కు కెరీర్ లో మూడో చిత్రాలే. `శుభ‌మ‌స్తు`, `శుభాకాంక్ష‌లు` చిత్రాల‌ త‌రువాత భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు `సుస్వాగతం`ని రూపొందించ‌గా.. `వాలి`, `ఖుషి` (త‌మిళ్) అనంత‌రం `ఖుషి`ని డైరెక్ట్ చేశాడు ఎస్. జె. సూర్య‌. ఇక `నువ్వే నువ్వే`, `అత‌డు` త‌రువాత త్రివిక్ర‌మ్ `జ‌ల్సా`ని తెర‌కెక్కించ‌గా.. `షాక్`, `మిర‌ప‌కాయ్` అనంత‌రం `గ‌బ్బ‌ర్ సింగ్`ని తీర్చిదిద్దాడు హ‌రీశ్ శంక‌ర్. అదేవిధంగా `కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం`, `త‌డాఖా` త‌రువాత కిశోర్ కుమార్ పార్ద‌సాని (డాలీ) `గోపాల గోపాల‌`ని  డైరెక్ట్ చేయ‌గా.. `ఓ మై ఫ్రెండ్`, `ఎం.సి.ఎ` పిద‌ప `వకీల్ సాబ్`ని త‌యారుచేశాడు వేణు శ్రీ‌రామ్. అలాగే `అయ్యారే`, `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` త‌రువాత త‌న మూడో చిత్రంగా `భీమ్లా నాయ‌క్`ని రూపొందించాడు సాగ‌ర్ కె.చంద్ర‌. మొత్త‌మ్మీద‌.. ఏ ద‌ర్శ‌కుడైనా త‌న మూడో సినిమాని ప‌వ‌న్ తో తీస్తే స‌క్సెస్ ఖాయ‌మ‌న్న‌మాట‌.

కొస‌మెరుపు ఏంటంటే.. ప‌వ‌న్ తో త‌మ కెరీర్ లో మూడో సినిమా తీసిన ద‌ర్శ‌కుల్లో ఒక్క త్రివిక్ర‌మ్ మిన‌హాయిస్తే.. మిగిలిన వారంద‌రూ రీమేక్స్ తీసిన‌వాళ్ళే కావ‌డం గ‌మ‌నార్హం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com