చిరంజీవి అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చుక్కలు చూపించబోతుందా!
on Nov 11, 2024
వ్యూహం(vyuham)అనే సినిమాని తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ramgopal varma)ఆ మూవీ రిలీజ్ కి ముందు అప్పటి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు,లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలని కించపరిచేలా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు చెయ్యడం జరిగింది. దీంతో ఇప్పుడు వర్మపై ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదు అయ్యింది.దర్యాప్తు స్వీకరించిన పోలీసులు కేసుపై దర్యాప్తు వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో వర్మ అరెస్ట్ అవుతాడనే ప్రచారం కూడా జరుగుతుంది.
ఇదిలా ఉండగా వ్యూహం సినిమాని రామదూత క్రియేషన్స్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించాడు.నిర్మించడమే కాకుండా ఈ సినిమా రిలీజ్ టైం లో ఆటంకాలు ఎదురైతే వర్మ మాట్లాడిన ప్రతి మాటకి తన మద్దతు తెలియచేసాడు. ఈ నేపథ్యంలో కిరణ్ పై కూడా పోలీసు కేసు నమోదు అవుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది.అవాస్తవాలని చూపించడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ మూవీ జగన్ కి మద్దతుగా చంద్ర బాబు, లోకేష్, పవన్ లకి యాంటీగా తెరకెక్కింది.
ఇక కిరణ్ గతంలో చిరంజీవి(chiranjeevi)యువత అధ్యక్షుడుగా పని చేసాడు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ప్రస్తుతం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నాడు.
Also Read