
రెండు రోజుల క్రితం చెన్నైలోని ఓ హోటల్ రూమ్‌లో ఉరివేసుకొని బలన్మరణానికి పాల్పడిన పాపులర్ తమిళ సీనియర్ నటి, యాంకర్ వీజే చిత్రం పోస్టుమార్టం అనంతరం గురువారం సాయంత్రం అభిమానుల కన్నీటిసంద్రం నడుమ బుల్లి తెర నటి చిత్ర భౌతికకాయానికి బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. మొదట్లో ఆమెకు హేమంత్ కుమార్‌తో నిశ్చితార్ధం మాత్రమే జరిగినట్లు ప్రచారం జరగగా, తర్వాత అక్టోబర్‌లో వారు వివాహం చేసుకున్నట్లు వెల్లడైంది.
డిసెంబర్ 8న షూటింగ్ నుంచి అర్ధరాత్రి చిత్ర హోటల్‌కు వచ్చిందనీ, స్నానానికి బాత్‌రూమ్‌కు వెళ్లి చాలాసేపటి వరకూ బయటకు రాలేదనీ, ఆ తర్వాత ఆమె ఉరివేసుకొని కనిపించిందనీ హేమంత్ కుమార్ తెలిపాడు. అయితే చిత్ర ముఖంపై గోళ్లతో గీరినట్లు గాయాలున్నాయనీ, ఆమె మృతికి సంబంధించి అనుమానాలున్నాయనీ ఆమె స్నేహితులు, సహ నటులు ఆరోపించడంతో కాంట్రవర్సీ తలెత్తింది. తన కుమార్తెను హేమంత్ కుమారే హత్య చేశాడని, ఆమెకు న్యాయం జరగడానికి అందరూ సాయం చేయాలనీ చిత్ర తల్లి ఆరోపించారు.
.jpg)
చెన్నైలోని కిల్‌పాక్ హాస్పిటల్‌లో చిత్ర భౌతిక కాయానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యులు, అనంతరం ఆమె దేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు. కొత్తుపురమ్‌లోని చిత్ర నివాసం దగ్గర గురువారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. పోస్ట్‌మార్టమ్‌లో ఆమెది ఆత్మహత్యగా వైద్యులు నిర్ధారించారు. ఆమె శరీరంపై కనిపించిన గోళ్ల గుర్తులు ఆమెవేనని వారు పేర్కొన్నారు. దాంతో ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఎందుకు ఆమె అంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనే విషయంపైనా, దాని వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే కోణంపై దర్యాప్తు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు.






