Home

»

Latest News

Prabhas‌: 'స్పిరిట్' సెట్స్‌లో ప్రభాస్ ప్రవర్తన ఇదే.. వివేక్ ఒబెరాయ్ వైరల్ కామెంట్స్!

May 22, 2026

ఇండస్ట్రీలో చిన్న నటుడి నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ఎవరిని కదిలించినా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas‌) వ్యక్తిత్వం గురించి, ఆయన చూపించే ఆతిథ్యం గురించి గంటల తరబడి మాట్లాడుతుంటారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ వర్కింగ్ స్టైల్, డెడికేషన్, సెట్స్‌లో ఆయన ప్రవర్తించే తీరుపై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్' (Spirit). ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్‌తో కలిసి పని చేస్తున్న అనుభవాలను వివేక్ ఒబెరాయ్ పంచుకుంటూ.. సెట్స్‌లో డార్లింగ్ చూపించే అంకితభావానికి తాను ఫిదా అయిపోయానని చెప్పుకొచ్చారు. విపరీతమైన ఎండ, తీవ్రమైన వేడి వాతావరణం ఉన్నప్పటికీ ప్రభాస్ ఎక్కడా వెనకడుగు వేయరని, ఏమాత్రం అసహనం చూపించకుండా తన పనిని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇస్తారని ప్రశంసించారు. అంతటి ఎండలో కూడా అద్భుతమైన డెడికేషన్‌తో సీన్స్ కంప్లీట్ చేయడం ప్రభాస్‌కే సాధ్యమైందని వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు.

ప్రభాస్ లాంటి ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అంత నిశ్శబ్దంగా, ఏకాగ్రతతో తన నటనపై మాత్రమే శ్రద్ధ పెట్టడం చూసి తాను ఆశ్చర్యపోయానని వివేక్ అన్నారు. పరిశ్రమలో అంతటి అగ్ర స్థానంలో ఉండి, భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నప్పటికీ, ఆయనలో రవ్వంత కూడా గర్వం కనిపించదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరినీ ప్రభాస్ ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా పలకరిస్తారని, ఆయన చూపించే ఆత్మీయత అందరి హృదయాలను గెలుచుకుంటుందని కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం ప్రభాస్ సొంతమని, అందుకే ఆయన నిజమైన ఇన్‌స్పిరేషన్ అని వివేక్ ఒబెరాయ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇక ప్రభాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన పెట్టే రుచికరమైన భోజనం. దీనిపై కూడా వివేక్ ఒబెరాయ్ స్పందిస్తూ, ప్రభాస్ షూటింగ్ సెట్స్‌కు తీసుకువచ్చే వెరైటీ వంటకాలు, నోరూరించే బిర్యానీలు ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. వివేక్ ఒబెరాయ్ చేసిన ఈ కామెంట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ రేంజ్ ఇదీ అంటూ ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ షేర్ చేస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com