Home

»

Latest News

టాలీవుడ్ బిగ్గెస్ట్ వార్.. ఒకే రోజు థియేటర్లలోకి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు!

Jul 2, 2026 2:35PM

టాలీవుడ్‌లో దసరా పండగ సీజన్ అంటేనే ఒక ఊపు వస్తుంది. పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక బిగ్గెస్ట్ క్లాష్‌కి టాలీవుడ్ వేదిక కాబోతోందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK 111'. 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో, దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. బాలయ్య లుక్, సినిమా గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్ అవుతున్నాయి.

అయితే, ఇప్పుడు ఇదే దసరా రేసులోకి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'విశ్వంభర' (Vishwambhara). ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. గ్రాఫిక్స్ పనుల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, విశ్వంభరను కూడా దసరా పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 16 నే విడుదల చేయడానికి మేకర్స్ కర్చీఫ్ వేసినట్లు ఇండస్ట్రీ టాక్.

ఒకే రోజున చిరంజీవి ఫాంటసీ అడ్వెంచర్ 'విశ్వంభర', బాలకృష్ణ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా 'NBK111' థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవడం ఖాయం. ఒకవైపు త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న 'విశ్వంభర'.. మరోవైపు కాజల్ అగర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న 'NBK111' ల మధ్య ఈ దసరా పోరు టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద క్లాష్‌గా నిలవబోతోంది. 

ఈ ఇద్దరు మాస్ లెజెండ్స్ ఒకే రోజు అక్టోబర్ 16న తలపడితే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం, కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. మరి ఈ అక్టోబర్ 16 రేసులో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com