.webp)
ఇండస్ట్రీలో ఒక మూవీ అనుకున్న టైం కంటే లేటుగా రిలీజైన సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ విశ్వంభర(vishwambhara)విషయంలో అభిమానులు ఆ సూత్రాన్నే నమ్ముతూ వస్తున్నారు. కానీ ఆ లేట్ మరి టూ మచ్ లేట్ అవుతూ వస్తుంది. దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో మెగా అభిమానుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
తాజా ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, జూలై 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్రాథమికంగా భావిస్తోంది. జూన్ చివరలో అనుకున్న కొన్ని భారీ సినిమాలు వాయిదా పడటంతో, జూలై రెండో వారంలో సింగిల్ రిలీజ్ లేదా సోలో రిలీజ్ దక్కించుకుంటే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టవచ్చని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు ఇప్పటి వరకు వచ్చాయి. కానీ తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘విశ్వంభర’ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. దసరా సీజన్‌కు భారీ చిత్రాలకి మంచి మార్కెట్ ఉండటంతో ఆ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.దీనికి ప్రధాన కారణం రాబోయే నెలల్లో టాలీవుడ్‌లో భారీ చిత్రాలు క్యూ కడుతుండడం. డిసెంబర్ నుంచి వరుస స్టార్ హీరోల సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. పైగా 2027 సంక్రాంతి లక్ష్యంగా చేసుకొని చిరంజీవి,బాబీ మూవీ రెడీ అవుతుంది. దీంతో ‘విశ్వంభర’ దసరాకి రావచ్చని అంటున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ టైంకైనా రావాలని కోరుకుంటున్నారు.
Also read: kajal Aggarwal: ఇక దానికి గుడ్ బై.. హీరోలకి పోటీ ఇస్తుందా!
చిరంజీవి సరసన త్రిష(Trisha)జోడి కట్టగా ఆషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి, కునాల్ కపూర్ రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన కొన్ని చిన్నపాటి గ్లింప్స్ మరియు సాంగ్స్ అంచనాలను పెంచేశాయి. చిరంజీవి కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ నమ్ముతుంది. బింబి సార ఫేమ్ వశిష్ట మల్లిడి(Vasishta Mallidi)దర్శకుడు కాగా తనకి విశ్వంభర సెకండ్ మూవీ.







