Home

»

Latest News

మంచు మనోజ్ బాటలో మంచు విష్ణు.. దాసరి స్మారక స్థలానికి పూర్వవైభవం!

May 30, 2026 4:10PM

దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) స్మారక స్థలం అత్యంత దారుణమైన స్థితిలోకి మారిపోవడం, చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు మొలిచి ఒక పాడుబడ్డ అడవిలా తయారవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దారుణమైన స్థితిలో ఉన్న ఆ దృశ్యాలను చూసి కోట్లాది మంది సినీ ప్రేమికులు, దాసరి అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా 'నేనున్నానంటూ' ముందు నిలబడిన ఆ పెద్ద మనిషి స్మారక స్థలం ఇలా శిథిలావస్థకు చేరడం అందరినీ కలచివేసింది.

దాసరి స్మారక స్థలం దుస్థితి బయటపడటంతో పరిశ్రమ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ముఖ్యంగా మంచు బ్రదర్స్ చూపిన చొరవ ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే మంచు మనోజ్ (Manchu Manoj) స్వయంగా అక్కడికి వెళ్ళి, ఆ ప్రాంతాన్ని శుభం చేసి, దాసరికి నివాళులు అర్పించారు. ఇక మంచు విష్ణు (Manchu Vishnu) సైతం తన టీంను పంపించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించడం విశేషం.

విష్ణు తన ప్రత్యేక బృందాన్ని దాసరి నారాయణరావు స్మారక స్థలానికి పంపించారు. విష్ణు మంచు ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్న ఆయన బృందం, స్మారక స్థలం పరిసరాలను పూర్తిగా శుభ్రపరచడంతో పాటు పునరుద్ధరణ చర్యలను యుద్ధప్రతిపాదికన చేపట్టారు. పిచ్చి మొక్కలను, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని విష్ణు మంచు టీం తొలగించింది. వారి శ్రమదానంతో ఆ ప్రదేశం అంతా తిరిగి పరిశుభ్రంగా, ఎంతో గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. 

మొత్తానికి దాసరి నారాయణరావు స్మారక స్థలానికి మళ్లీ పూర్వవైభవం తీసుకురావడంలో మంచు బ్రదర్స్ చూపించిన చొరవ నిజంగా అభినందనీయం. మంచు సోదరులు చేసిన ఈ మంచి పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com