కళ్యాణ్‌రామ్ జోలికి వస్తే తాట తీస్తా.. వారికి చెంచాగిరి చేయండి!
on Apr 19, 2025
వారం వారం రిలీజ్ అవుతున్న సినిమాలకు సంబంధించి కొందరు కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని, సినిమాను కిల్ చేస్తున్నారని సీనియర్ హీరోయిన్ విజయశాంతి మండిపడ్డారు. ఏప్రిల్ 18న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో విజయశాంతి, కళ్యాణ్‌రామ్ తల్లీకొడుకులుగా నటించారు. సెంటిమెంట్‌తోపాటు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై డివైడ్ టాక్ వినిపిస్తోంది. కొందరు సినిమా బాగుంది అంటుంటే, మరికొంతమంది బాగా లేదంటున్నారు. ప్రతి వారం విడుదలయ్యే సినిమాలకు సంబంధించి ఇలాంటి టాక్ రావడం సర్వసాధారణం. దీనిపై చిత్ర యూనిట్ స్పందించి రకరకాల కామెంట్స్ చేయడం కూడా మామూలే. ఇప్పుడు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది.
ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. ఈ ఈవెంట్‌లో యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌పై వారి వారి అభిప్రాయాలు చెప్పారు. అయితే విజయశాంతి మాత్రం ఒక అడుగు ముందుకేసి సినిమాని నెగెటివ్ చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. ‘మా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మహిళా ప్రేక్షకులు కూడా సినిమా చూసి నాకు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో సినిమా సక్సెస్ గ్రాఫ్ పెరుగుతూ వెళ్తోంది. అయితే కొందరు మాత్రం సినిమాను డిస్టర్బ్ చేస్తున్నారు. దాన్ని శాడిజం అంటారో, మరేం అంటారో నాకు తెలీదు. వాంటెడ్‌గానే కొందరు ఇదంతా చేస్తున్నారు. వాటి గురించి నేను వింటున్నాను, చూస్తున్నాను. ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. వారు తమ మైండ్ సెట్ మార్చుకోవాలి. మా సినిమాని ఖూనీ చేయాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. థియేటర్ దగ్గర అందరూ సినిమా బాగుందని చెప్తున్నారు. దాన్ని మీరు నెగెటివ్ చేసి పైశాచిక ఆనందం పొందొద్దు. మీ వెనక ఎవరైనా ఉండి మీ మైండ్ వాష్ చేస్తుంటే.. వారికి చెంచాగిరి చేయండి. అంతేకానీ, మంచి సినిమాని నాశనం చెయ్యాలని చూడకండి. ఇలాంటి చీప్ పనులు మానుకొని కంట్రోల్‌లో ఉండండి. ఇండస్ట్రీని బ్రతకనివ్వండి’ అన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
