Home

»

Latest News

ఇక నుంచి విజయ్ చికెన్ బిర్యానీ.. ఇళయ దళపతినా, మజాకానా!

Jul 29, 2026 4:41PM

 


ఇళయ దళపతి విజయ్(Vijay)సినిమా ఇచ్చిన పేరు ప్రతిష్టలతో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాద్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 23 న జన నాయగన్(జన నాయకుడు) గా వచ్చి థియేటర్స్ లో సందడి చేస్తున్న విజయ రీసెంట్ గా ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారింది.
  

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఒకసారి చికెన్ బిర్యానీని అందించే ప్రతిపాదనని  పరిశీలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని గణనీయంగా పెంచడంతో పాటు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించి వారికి బలమైన ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని అందించడమే ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.  తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్‌మోహన్ నిర్వహించిన కీలక సమావేశంలో దాదాపు 100కు పైగా ఉపాధ్యాయ సంఘాలు, బోధనేతర సిబ్బంది యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు విద్యార్థుల కోసం వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల సంక్షేమం మరియు వారి ఆహారంలో పోషక విలువలు పెంచేందుకు ఈ డిమాండ్‌ను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సోషల్ వెల్ఫేర్ అండ్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌తో చర్చించి, త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు.


Also read: Sonali Bendre: సొనాలీ బింద్రే ఫిట్ నెస్ సీక్రెట్.. ఆటోఫాగీ వెనుక అసలు నిజాలివే

 దేశంలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తమిళనాడుకి  ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు నిత్యం రుచికరమైన మధ్యాహ్న భోజనం అందుతోంది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న "ముఖ్యమంత్రి ప్రాతఃకాల అల్పాహార పథకం" (Chief Minister's Breakfast Scheme) ద్వారా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు సుమారు 32 లక్షల మంది ప్రతిరోజూ ఉదయం పోషకాహారాన్ని పొందుతున్నారు.  ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

Vijay, Jana Nayagan

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com