Home

»

Latest News

నవంబర్ 14 పదకొండు గంటలకి వేణు స్వామికి ఏం జరగబోతుంది

Nov 06, 2024

ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి(venu swamy)కొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య(naga chaitanya)శోభిత లు పెళ్లి అయిన కొన్ని సంవత్సరాలకే విడిపోతారని చెప్పిన విషయం అందరకి తెలిసిందే.దీంతో వేణుస్వామి పై ఎన్నో విమర్శలు రావడంతో పాటు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ ల సంఘం కూడా ఆయన మీద కేసు నమోదు చేయించింది.

దీంతో ఇప్పుడు జర్నలిస్టుల సంఘం లేవనెత్తిన ఆరోపణల దృష్ట్యా  తెలంగాణ మహిళా కమిషన్ వేణుస్వామికి సమన్లు ​​జారీ చేసింది. నవంబర్ 14 ఉదయం పదకండు గంటలకి  కమిషన్ ముందు విచారణకి హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ విషయాన్నీ మహిళా కమిషన్ చైర్మన్ శారదా నేరెళ్ల సోషల్ మీడియా ద్వారా తెలియపరిచారు.

కొన్ని రోజుల క్రితం మహిళా కమిషన్ తనని విచారించడానికి వీలు లేదని వేణుస్వామి హైకోర్ట్ లో వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. మహిళా కమిషన్ కి వేణు స్వామిని విచారించడానికి పూర్తి అధికారాలున్నాయని, వారం రోజుల్లో వేణు స్వామి పై తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ని కోర్టు ఆదేశించింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com