Home

»

Latest News

ఆ సినిమాకి మాత్రం నో.. వెంకటేష్ నిర్ణయంలో న్యాయముందా!

Feb 25, 2026

 

-వరుస హిట్స్ తో జోరుమీద ఉన్న వెంకటేష్ 
-త్రివిక్రమ్ మూవీ పై భారీ అంచనాలు 
-కానీ ఆ చిత్రాన్ని ఎందుకు వద్దని అంటున్నాడు
-అందుకు కారణాలేంటి 
-రూమరా, నిజామా!

 
'ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్' అనే రీతిలో విక్టరీ వెంకటేష్(Venkatesh)సృషించుకున్న సినీ సామ్రాజ్యంకి పెద్ద హిస్టరీ నే ఉంది. రీసెంట్ గా చిరంజీవి(Chiranjeevi)తో కలిసి మన శంకర వరప్రసాద్ గారులో చేయడం ద్వారా సదరు సినిమా రేంజ్ ని మరింత పెంచాడు. ఎంతలా అంటే తెలుగు సినిమా రికార్డుల బుక్ లో స్థానాన్ని పొందేలా. దీంతో త్రివిక్రమ్(trivikram)తో చేస్తున్న ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47 పై  అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అభిమానులు, మూవీ లవర్స్ ఈ చిత్రానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటే, వెంకటేష్ సినీ జర్నీకే సంబంధించిన మరో న్యూస్ ఆ అందరి కంట పడింది. కాకపోతే రూమర్ హోదాలో. రూమర్ అయినా విక్టరీ ది కాబట్టి చూసేద్దాం.

వెంకటేష్, మీనా జంటగా  వచ్చినక్రైమ్ థ్రిల్లర్ దృశ్యం రెండు భాగాలుగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వెంకటేష్ తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో  రీమేక్ అనే ఛాయల్ని తెలుగు ప్రేక్షకుల దరిదాపుల్లోకి కూడా తీసుకురాలేదు.దీంతో మూడవ భాగానికి సంబంధించిన అధికార ప్రకటన కోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ మూడవ భాగం షూటింగ్ మలయాళంలో కంప్లీట్ కాబోతుండటమే అందుకు కారణం. ఏప్రిల్ 2 రిలీజ్ డేట్ అనే అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ  దృశ్యం 3(Drishyam 3)రీమేక్ లో నటించకూడదని వెంకటేశ్ నిర్ణయించుకున్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు గల కారణాలు కూడా రూమర్స్ నే వివరిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేశ్ 'ఆదర్శకుటుంబం'లో చేస్తున్నాడు.ఆ తర్వాత అనిల్ రావిపూడి తో ఉందనేది టాక్. అంటే ఆ రెండు చిత్రాలు అయ్యాకే 'దృశ్యం 3 చేయాల్సి వస్తుంది. 

also read:  నటుడు మయాంక్ పవార్ ఆకస్మిక మరణం.. అబద్దమని చెప్పమంటున్న ఫ్యాన్స్ 


మరి అప్పటికే ఒరిజినల్ మళయాళ వెర్షన్  ఓటీటీలో వచ్చి ఉంటుంది. సదరు ఓటిటి సంస్థలు పాన్ ఇండియాలోని అన్ని లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు.వెంకటేష్ రీమేక్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ లోనే కుదురుతుంది. ఒక వేళ ఇప్పటికిప్పుడు చేసినా ఒరిజినల్ వెర్షన్ ఓటిటి మాత్రం ఆగదు. అజయ్ దేవగన్ తో హిందీ రీమేక్ కూడా కంప్లీట్ కావలసి వస్తుంది. దీంతో తను చేసే టైంకి రీమేక్ ని  ఎవరు చూస్తారనే అభిప్రాయంలో  వెంకటేష్ ఉన్నట్టుగా ఫిలిం సర్కిల్స్ రూమర్స్. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com