Home

»

Latest News

Venkatesh: మెట్రో స్టేషన్‌లో వెంకీ మామ రచ్చ రచ్చ!

Apr 22, 2026

విక్టరీ వెంకటేష్ (Venkatesh), డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. (Aadarsha Kutumbam House No: 47)

హైదరాబాద్‌లోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్ర బృందం చిత్రీకరించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే మెట్రో స్టేషన్‌లో వెంకటేష్ తన మార్క్ యాక్షన్‌తో విలన్లను ఊచకోత కోసే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో యాక్షన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది, దానికి వెంకీ మామ మేనరిజమ్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం.

గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. అయితే ఆ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. మొదటిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ సినిమా చేస్తున్నారు. 

ఈ సినిమాలో కూడా కడుపుబ్బ నవ్వించే కామెడీతో పాటు హృదయాన్ని హత్తుకునే కుటుంబ భావోద్వేగాలు ఉండబోతున్నాయి. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com