'VD12' కొత్త విడుదల తేదీ ఇదే..!
on Jan 20, 2025
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'VD12'. కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్న విజయ్, ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఫ్యాన్స్ కూడా 'VD12'పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కి మంచి స్పందన లభించింది. దీంతో 'VD12' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం రెండు నెలలు ఆలస్యంగా రాబోతుంది.
'VD12'ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ తేదీకి సినిమా రాకపోవచ్చనే అభిప్రాయాలు ముందు నుంచి ఉన్నాయి. ఇక ఇటీవల 'VD12' వాయిదాపై క్లారిటీ వచ్చేసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ తాము నిర్మిస్తున్న మరో మూవీ 'మ్యాడ్ స్క్వేర్'ను మార్చి 29న రిలీజ్ చేయనున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేసింది. దీంతో 'VD12' పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అయింది. ఇక ఇప్పుడు కొత్త విడుదల తేదీ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాని మే 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
