
మహేష్(Mahesh Babu)రాజమౌళి(ss Rajamouli)కలల ప్రాజెక్ట్ వారణాసి(Varanasi). భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు భారతీయ సినీ ప్రేక్షకుల కలల ప్రాజెక్ట్ కూడా. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల ఆధారంగా, ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి కథగా రూపొందుతుందనే టాక్ ఉంది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందని, వారణాసి నుంచి మొదలై కెన్యా, అంటార్కిటికా వంటి వివిధ ప్రాంతాలకి కథ విస్తరిస్తుందనే మరో టాక్ కూడా వినిపిస్తూ ఉంది
వేసవి కాలం కావడంతో మండుతున్న ఎండల దృష్ట్యా వారణాసికి చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం స్మాల్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పడు తిరిగి కొత్త షెడ్యూల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ కొత్త షెడ్యూల్‌లో మహేష్, ప్రియాంక చోప్రా(Priyanka Chopra)ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలని తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే భారీ సెట్లని రూపొందించినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం అంతర్జాతీయ లొకేషన్లకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.
Also read: వీరభద్రుడు ట్రైలర్ అదుర్స్.. తెల్ల వాళ్ళ దేవుడైతే క్షమాపణ అడగవచ్చు
ఇటీవల మెక్సికోలో జరిగిన ఓ అంతర్జాతీయ ఈవెంట్‌లో ‘వారణాసి’ని చిత్ర బృందం పరిచయం చేసింది. ప్రెజెంట్ షెడ్యూల్ పూర్తవ్వగానే ఫ్రాన్స్‌లో కూడా భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో తెరకెక్కుతున్న వారణాసిని హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా కె ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ సుమారు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.






