
ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది 'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్' (Cannes Film Festival). కేవలం సినిమాల పరంగానే కాకుండా, అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2026 కాన్స్ వేడుకల్లో భారతీయ తారలు తమ గ్లామర్‌తో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించి రెడ్ కార్పెట్‌పై వెండి బొమ్మలా మెరిసింది.
కాన్స్ 2026 వేడుకల్లో భాగంగా ఊర్వశి రౌతేలా ధరించిన సిల్వర్ కలర్ ఔట్‌ఫిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దుస్తుల్లో ఆమె ఒక దేవకన్యలా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక భారీ వెండి రంగు సీక్విన్డ్ గౌన్ ని ఎంచుకుంది. తన లుక్ కి తగ్గట్టుగా హెవీ డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ ఇయరింగ్స్ ధరించింది. స్మోకీ ఐస్ మరియు గ్లోసీ లిప్స్టిక్‌తో ఆమె మేకప్ హైలైట్.
గత కొన్నేళ్లుగా ఉర్వశి రౌతేలా కాన్స్ రెడ్ కార్పెట్‌పై క్రమం తప్పకుండా కనిపిస్తోంది. ప్రతిసారి ఏదో ఒక వైవిధ్యమైన థీమ్‌తో రావడం ఆమె ప్రత్యేకత. గతంలో 'మొసలి' ఆకారపు నెక్లెస్ ధరించి వార్తల్లో నిలిచిన ఉర్వశి, ఈసారి క్లాసిక్ మరియు లగ్జరీ లుక్ ఎంచుకుంది. భారతీయ సినిమా మరియు ఫ్యాషన్ ని అంతర్జాతీయ వేదికపై ప్రతిబింబించేలా తన ఫ్యాషన్ ఎంపికలు ఉంటాయని ఆమె పలుమార్లు పేర్కొన్నారు.
Also read: Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఫ్యాన్స్ కోరుకునేది ఇదే డార్లింగ్
ప్రస్తుత పిక్స్ ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ డాకు మహారాజ్ లో ఉర్వశి రౌతేలా కనిపించిన విషయం తెలిసిందే. ఇక అసలైన విషయం ఏంటంటే ఉర్వశి డ్రెస్ కానీ, పైన చెప్పుకున్న మేకప్ మెటీరియల్స్, వగైరా మొత్తం 155 .87 మిలియన్ డాలర్స్ అంట. మన ఇండియన్ కరెన్సీ లో 1500 కోట్లు.




.webp)

