Home

»

Latest News

శ్రీనిధి శెట్టి కాళ్ళకి ఎందుకు నమస్కరించానంటే: త్రివిక్రమ్ చెప్పిన సమాధానం ఇదే!

Oct 29, 2026 4:32PM

మరికొన్ని గంటల్లో వెంకటేష్,శ్రీనిధి శెట్టి తో కలిసి త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబంతో తిష్ట వేయడానికి వస్తున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు అంటే థియేటర్స్ లలోకి వెళ్లే ముందు త్రివిక్రమ్ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీనిధి శెట్టి కాళ్ళకి ఎందుకు నమస్కారం చేసాడనే ప్రశ్నకి ఆన్సర్ లభిస్తే బాగుంటుందనే మూడ్ లో అభిమానులు ఉన్నారు. ఆ ఆన్సర్ స్వయంగా త్రివిక్రమ్ నే ఇచ్చాడు మరి చూసేయండి.

రీసెంట్ గా ఆదర్శ కుటుంబంకి జరిగిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతు 'నేను నా కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్స్‌తో పనిచేశాను. కానీ శ్రీనిధి శెట్టి వారందరికంటే చాలా డిఫరెంట్. షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే మా యూనిట్‌తో ఒక కుటుంబ సభ్యురాలిలా  కలిసిపోయింది. మనకు అత్యంత సన్నిహితమైన స్నేహితులతో సరదాగా ఆటపట్టించే అలవాటు ఉంటుంది కదా.. వేదికపై ఆమెను అలా ఆటపట్టించడానికే సరదాగా కాళ్లకు దండం పెట్టినట్లు యాక్ట్ చేశాను తప్ప, అందులో ఎలాంటి సీరియస్ ఉద్దేశం లేదు” అంటూ వివరణ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: రావణుడు చెడ్డోడు కాదు: సాయిపల్లవి వ్యాఖ్యలు వైరల్!

 


దీంతో త్రివిక్రమ్ దణ్ణం పెట్టిన వీడియో, ఇప్పుడు మాట్లాడిన వీడియో వైరల్ హోదాలో  మొదటి ప్లేస్ సంపాదించడానికి తీవ్ర పోటీ పడుతున్నాయి.

 

 

[Trivikram About Srinidhi Shetty Viral Video Clarification, Trivikram Srinivas About Srinidhi Shetty, Aadarsha Kutumbam, Trivikram viral video, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com