ఎన్టీఆర్ మూవీలో మాలీవుడ్ స్టార్
on Feb 6, 2025
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)తన గత చిత్రం 'దేవర'(Devara)తో మరోసారి తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.ఇక 'దేవర'తర్వాత ఎన్టీఆర్ స్క్రీన్ పై కనపడే మూవీ 'వార్ 2 ' 2019 లో హిందీ ప్రేక్షకులని అలరించిన వార్ 1 కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కనుండగా,'హృతిక్ రోషన్'(Hrithik ROshan)తో కలిసి ఎన్టీఆర్(Ntr)స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.ఇండియన్ చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న అతిపెద్ద మల్టి స్టారర్ గా కూడా క్రేజ్ ని సంపాదించిన 'వార్ 2'(War 2)పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు.కొన్ని రోజుల క్రితం అధికారకంగా ప్రారంభమైన ఈ మూవీ ప్రస్తుతం షూట్ లో ఉందనే ప్రచారం జరుగుతుంది.ఎన్టీఆర్ పోర్షన్ తప్ప మిగతా నటీనటులతో సీన్స్ ని చిత్రీకరిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్.ఇక ఈ మూవీలో మలయాళ స్టార్ యాక్టర్ 'టోవినో థామస్'(Tovino Thomas) నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇందుకు బలాన్ని చేకూర్చేలా రీసెంట్ గా ప్రశాంత్ నీల్,టోవినో థామస్ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మలయాళ చిత్ర సీమలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నటోవినో థామస్ కి సౌత్ సినీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ చిత్రానికి అదనపు ఆకర్షణ వచ్చినట్లయ్యింది.కేజీఎఫ్ స్టార్ 'యష్'కొత్త మూవీ 'టాక్సిక్'(Toxic)లో కూడా టోవినో థామస్ ఒక కీలక పాత్రలో చేస్తున్నాడు.ఇక ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మూవీని మైత్రి మూవీ మేకర్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా కన్నడ భామ 'రుక్మిణి వసంత్'(Rukimi Vasanth)హీరోయిన్ గా చేస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
