Home

»

Latest News

Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి తప్పుకున్న టోవినో థామస్!

Mar 31, 2026

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ టోవినో థామస్(Tovino Thomas) విలన్ గా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ తో కలిసి టోవినో థామస్ షూటింగ్ లో పాల్గొన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా 'డ్రాగన్' ప్రాజెక్ట్ పై టోవినో షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టోవినో థామస్ నటించిన 'పళ్లిచట్టంబి' మూవీ ఏప్రిల్ 10న పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టోవినో థామస్ కు 'డ్రాగన్'కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

"మీరు డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారన్న వార్త నిజమేనా?" అనే ప్రశ్న ఎదురుకాగా.. టోవినో థామస్ ఊహించని సమాధానం ఇచ్చాడు. తాను డ్రాగన్ లో నటించట్లేదని చెప్పాడు. డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమైందని తెలిపాడు. దీంతో డ్రాగన్ లో టొవినో థామస్ నటించట్లేదని క్లారిటీ వచ్చింది. 

కాగా, 'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బిజూ మీనన్, అనిల్ కపూర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com