
1. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఎన్టీఆర్ ఊచకోత!
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ మంగళవారం అర్ధరాత్రి విడుదలైంది. అంతర్జాతీయ నల్లమందు మాఫియా, 'గోల్డెన్ ట్రయాంగిల్' బ్యాక్‌డ్రాప్‌లో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పాత్రలో భీభత్సం సృష్టించబోతున్నట్లు ఈ విజువల్స్ స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ.. ట్రెండింగ్ లో ఉంది.
2. మెగాస్టార్ సినిమాకు థమన్ మ్యూజిక్!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'Mega158' మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గతంలో ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అనుకున్నప్పటికీ, ఫైనల్‌గా థమన్‌ను ఫిక్స్ చేయడంతో మెగా మాస్‌కి సరికొత్త మ్యూజికల్ బ్లాస్ట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
3. బాలయ్యను ఢీ కొడుతున్న మంచు మనోజ్!
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మాలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'NBK111'లో మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఆయన బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ చిత్రంలో నటించగా, మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
4. నార్త్ ఇండియాలో పెద్ది సౌండ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) మ్యూజికల్ సెలబ్రేషన్స్‌కు వేదిక ఖరారైంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ‘పెద్ది కి ఆవాజ్’ (Peddi Ki Awaaz) పేరుతో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక భారీ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. మే 23 సాయంత్రం 5 గంటల నుండి భోపాల్‌లోని 'భెల్ దసరా' మైదానంలో గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్‌తో నార్త్ ఇండియాలో ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లనున్నాయి.
5. ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ వచ్చేసింది!
ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ‘డ్రాగన్’ గ్లింప్స్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఈ జోష్‌లో ఉండగానే, తారక్ తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’పై నిర్మాత నాగవంశీ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ.. ‘డ్రాగన్ గ్లింప్స్ అరాచకంగా ఉంది, అతి త్వరలోనే మన మూవీ సెట్స్‌లో కలుద్దాం అన్నా’ అంటూ ట్వీట్ చేశారు. డ్రాగన్ తర్వాత తారక్ ‘గాడ్ ఆఫ్ వార్’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు క్లారిటీ రావడంతో.. నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
6. తెలంగాణ టాపర్ కి మెగా బ్లెస్సింగ్స్!
తెలంగాణ EAPCET 2026 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మల్లాది రుషి కలను మెగాస్టార్ చిరంజీవి నిజం చేశారు. ఈ పరీక్షలో గనుక టాప్ ర్యాంక్ సాధిస్తే మెగాస్టార్‌ను పర్సనల్‌గా కలపిస్తానని రుషి తండ్రి గతంలో ఆమెకు ఒక ప్రామిస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం, ర్యాంకర్ రుషిని చిరంజీవి ఈరోజు తన నివాసంలో ప్రత్యేకంగా కలుసుకుని, అభినందనలు తెలియజేశారు. ఆమె భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని చిరు ఆకాంక్షించారు.
7. సునీల్ నారంగ్ సంచలన నిర్ణయం!
తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఛాంబర్ ప్రతినిధులకు తన రాజీనామా లేఖను పంపారు. మనస్సాక్షికి విరుద్ధంగా పనిచేయలేక, ఆరోగ్యం సహకరించని కారణంగానే తప్పుకుంటున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. థియేటర్ల పర్సెంటేజ్ వివాదం నడుస్తున్న తరుణంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారింది.
8. ఐదు రోజుల్లోనే ‘కరుప్పు’ బ్రేక్-ఈవెన్!
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ (Karuppu) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చినప్పటికీ.. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 161 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఐదు రోజుల్లోనే వరల్డ్‌వైడ్ బ్రేక్-ఈవెన్ మార్కును పూర్తి చేసుకుని.. అధికారికంగా లాభాల జోన్ లోకి దూసుకెళ్లిపోయింది.
9. తెలుగులో ‘దృశ్యం 3’ హైప్ నిల్!
‘దృశ్యం 3’ మే 21న విడుదలవుతున్న నేపథ్యంలో సరికొత్త చర్చ మొదలైంది. ఈసారి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయకుండా.. మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ వెర్షన్‌నే తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయితే వెంకటేష్ రీమేక్ చేయకపోవడం, పైగా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు కనీస ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో.. ఇక్కడ సినిమాపై పూర్తిగా ‘డెడ్ హైప్’ కనిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డబ్ చేయకుండా.. వెంకీ మామకే రీమేక్ కోసం వదిలేస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
10. ‘ధురంధర్ 2’ వల్ల దేశ భద్రతకు ముప్పా?
‘ధురంధర్ 2’ చిత్రానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలోని రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని సీన్లు.. ఆర్మీ ఆపరేషన్ల రహస్యాలను బహిర్గతం చేస్తూ, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని.. SSB హెడ్ కానిస్టేబుల్ దీపక్ కుమార్ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. తగిన సమీక్ష జరిపి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు సెన్సార్ బోర్డును ఆదేశించింది.






