మండే ఎండల్ని మర్చిపోడానికి తెలుగు సినిమా ఉంది..ఈ వేసవికి రిలీజ్ చిత్రాలు ఇవే
on Mar 19, 2025
తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ ఎలాగో,వేసవి సీజన్ కూడా అంతే.ఇంకా గట్టిగా చెప్పాలంటే అంతకు మించి అని కూడా చెప్పుకోవచ్చు.తెలుగు సినీ ప్రేక్షకులు మండే వేసవిని మర్చిపోయేంతలా తెలుగు సినిమా సినీ చల్లదనాన్ని ఇస్తు ఉంది.తెలుగు సినిమా పుట్టిన దగ్గర్నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతు వస్తుంది.గత వేసవికి ఈ విషయంలో కొంచం తగ్గినా కూడా,ఈ వేసవికి మాత్రం తగ్గేదేలే అంటుంది.
ఈ నెల వచ్చే వారం షణ్ముఖ మూవీతో ఆది సాయికుమార్,పెళ్లి కానీ ప్రసాద్ ని అంటు సప్తగిరి, టుక్ టుక్ అనే విభిన్నమైన సినిమా థియేటర్స్ లో అడుగుపెడుతున్నాయి.ఈ నెల 28 న 'రాబిన్ హుడ్' తో నితిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి నితిన్ లాస్ట్ హిట్ భీష్మ ఫేమ్ వెంకీ కుడుమల దర్శకుడు కావడం,పుష్ప 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ 60 కోట్ల వ్యయంతో నిర్మిచడంతో సినీ ప్రేమికులకి హండ్రెడ్ పర్సంట్ వినోదం ఖాయం.ఇదే రోజు లక్కీ భాస్కర్ తో భారీ విజయాన్ని అందుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్ 'మాడ్ స్క్వేర్' తో థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.మాడ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సాలిడ్ ఎంటర్ టైనర్ ఈ సారి కూడా అదే స్థాయిలో ఎంటర్ టైన్ మెంట్ ని ప్రేక్షకులకి అందించనుంది.
నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 10 న బొమ్మరిల్లుభాస్కర్,సిద్దు జొన్నలగడ్డల 'జాక్' సందడి చేయనుంది.టిల్లు స్క్వేర్ తర్వాత వస్తన్న మూవీ కావడంతో మేకర్స్ క్వాలిటీ విషయంలో రాజీపడకుండా నిర్మిస్తున్నారు.ఇదే రోజు తమిళ అగ్ర హీరో అజిత్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' వీరసింహారెడ్డి ఫేమ్ గోపిచంద్ మలినేని హిందీలో తొలిసారి డైరెక్షన్ చేసిన 'జాట్' కూడా వినోదాన్ని అందివ్వడానికి వస్తున్నాయి.ఇక ఏప్రిల్ 11 న నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna)గత విశ్వరూపానికి ప్రతీకగా నిలిచిన 'ఆదిత్య 369 ' మరో మారుప్రేక్షకుల ముందుకు రానుంది.ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిన మొట్టమొదటి టైం ట్రావెల్ చిత్రం కాగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణ దేవరాయలుతో పాటు బాలయ్య పోషించిన సాంఘిక పాత్ర ప్రేక్షకులని మెస్మరైజ్ చేయనుంది.18 న మోహన్ కృష ఇంద్రగంటి,ప్రియదర్శి ల 'సారంగపాణి' తో పాటు 'చౌర్య పాఠం' అనే మరో భిన్నమైన మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఏప్రిల్ 25 న మంచు విష్ణు,మోహన్ బాబు కలల ప్రాజెక్టు 'కన్నప్ప 'వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.'పరమేశ్వరుడి' పరమ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ,మోహన్ లాల్,అక్షయ్ కుమార్ వంటి పాన్ ఇండియా నటులు భాగస్వామ్యం కావడం సినీ ప్రేమికుల అదృష్టమని చెప్పవచ్చు.
మే నెలలో ఏప్రిల్ నెలని మించిన సినీ వినోదం లభించనుంది వరుస హిట్లతో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ 'నాని' వన్ మాన్ షో 'హిట్ 3 ' మే 1 న రిలీజ్ కానుంది.ప్రచార చిత్రాలు చూస్తే నాని ఏ రేంజ్ లో పెర్ ఫార్మ్ చేసాడో అర్ధమవుతుంది.అదే రోజు కార్తీక్ సుబ్బరాజ్,సూర్య(Suriya)ల 'రెట్రో' సందడి చెయ్యడానికి సిద్దమవుతుంది.ఇక మే 9 న పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan kalyan)వన్ మాన్ షో 'హరిహర వీరమల్లు' కాలు మోపనున్నాడు.పవన్ ఫస్ట్ టైం చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడం,ప్రచార చిత్రాలు,సాంగ్స్ బాగుండటంతో ప్రేక్షకులకి సినీ వినోదం గ్యారంటీ అని చెప్పవచ్చు.వరుస పరాజయాలతో ఉన్న విజయ్ దేవర కొండ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో చేసిన కింగ్ డమ్ 30 న అడుగుపెట్టనుంది.ఇవే కాకుండా మెగాస్టార్ విశ్వంభర, ప్రభాస్ 'రాజా సాబ్',మాస్ మహారాజ రవితేజ మాస్ జాతర,అనుష్క, క్రిష్ జాగర్లమూడి ఘాటీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా విడుదలకి ముస్తాబవుతున్నాయి.అధికారకంగా డేట్స్ రిలీజ్ కావాల్సి ఉంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
