
ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో సీక్వెల్ ఫీవర్ ఒక రేంజ్ లో ఊపేస్తోంది. దర్శకులతో పాటు మెజారిటీ అగ్ర హీరోలంతా భారీ బడ్జెట్ సీక్వెల్స్ ఫ్రాంచైజీలపై కన్నేశారు. సినిమా ఎంత పెద్ద హిట్టయితే, దానికి పార్ట్-2 లేదా పార్ట్-3 ప్లాన్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. బాహుబలి తెచ్చిన ట్రెండ్ తో పుష్ప 2 వరకు ఈ క్రేజ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు తమ తదుపరి చిత్రాల కోసం ఎలాంటి క్రేజీ ప్లాన్స్ సిద్ధం చేసుకున్నారో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎన్టీఆర్ విషయానికి వస్తే, ఆయన లైనప్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దేవర పార్ట్ 1 సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఇప్పుడు అందరి కళ్లు 'దేవర పార్ట్ 2' పైనే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' కూడా రెండు భాగాలుగా రాబోతుందని ఫిలిం నగర్ సమాచారం. 'డ్రాగన్ పార్ట్ 1' మరియు 'డ్రాగన్ పార్ట్ 2' తో పాటు 'గాడ్ ఆఫ్ వార్' (God of War) లాంటి ప్రాజెక్టులతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు 300 నుండి 500 కోట్ల భారీ బడ్జెట్‌లతో ఈ పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కనున్నాయి.
మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా సరికొత్త స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన 'రంగస్థలం' చిత్రానికి సీక్వెల్ ఉండబోతుందనే వార్త మెగా అభిమానుల్లో జోష్ నింపింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే తదుపరి చిత్రం 'RC17' పై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ ఈ కథను ఫ్రాంచైజీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రంగస్థలం 2 లేదా దానికి సంబంధించిన యూనివర్స్ కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయం. చరణ్ తన మార్కెట్‌ని వందల కోట్ల వసూళ్లతో గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ క్రేజీ సీక్వెల్స్ మరియు ఫ్రాంచైజీల ట్రెండ్‌ని పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుంది. 'వారణాసి' టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా కేవలం ఒక భాగంతో ఆగడం లేదు. రాజమౌళి ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో మల్టీ పార్ట్ ఫ్రాంచైజీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్ సిరీస్‌లో కనీసం 2 లేదా 3 భాగాలు ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. దీనికోసం దాదాపు 800 కోట్ల పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం.
Also read: Ntr: ఎన్టీఆర్ పై పెద్ద కుట్ర.. ఆ సంస్థపై పోలీసులకి ఫిర్యాదు
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సరికొత్త ట్రెండ్‌కు దూరంగా లేరు. సోషియో ఫాంటసీ జోనర్‌లో వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ మరియు అది సృష్టించే సరికొత్త ప్రపంచం ప్రేక్షకులను ఆకట్టుకుంటే, దీనికి కూడా సీక్వెల్స్ లేదా స్పిన్-ఆఫ్స్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము. సీక్వెల్స్ చేయడం వల్ల సినిమాపై ముందే 100% బజ్ క్రియేట్ అవుతుందని, బిజినెస్ కూడా రెట్టింపు అవుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఈ విధంగా సరికొత్త సీక్వెల్స్ మరియు సిక్వెల్ సినిమాలతో రాబోయే 3 నుండి 5 ఏళ్ల వరకు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.
mahesh babu, ntr, ramcharan, prabhas, allu arjun






