Home

»

Latest News

పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు శుభం కార్డు పడినట్లేనా?

May 26, 2026 6:04PM

టాలీవుడ్(Tollywood)లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల వద్దకు చేరింది. ఇండస్ట్రీలో నెలకున్న ఈ సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను కలుసుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను స్థానిక షెల్టన్ హోటల్‌లో నిర్మాతల బృందం కలిసింది. ఈ కీలక సమావేశం ఇండస్ట్రీ వర్గాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.

సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఈ తాజా సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ కు చెందిన పలువురు అగ్ర నిర్మాతలు రాజమండ్రికి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన వారిలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్, ప్రముఖ నిర్మాత కిలారి సతీష్‌తో పాటు మరికొందరు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లు – నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో వివాదం నడుస్తోంది. దీనివల్ల ఇరు వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

ఈ ఇష్యూ కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను, థియేటర్ల రన్‌పై పడుతున్న ప్రభావాన్ని నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వివరించారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే, అటు నిర్మాతలకు కూడా నష్టం రాకుండా ఈ పర్సంటేజ్ గొడవకు ఒక శాశ్వత మరియు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలంటూ నిర్మాతలు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా ఈ వివాదంలో జోక్యం చేసుకుని, ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చూడాలని వారు డిప్యూటీ సీఎంను కోరారు.

సినీ ఇండస్ట్రీ నుండే వచ్చిన వ్యక్తి కావడం, ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉండటంతో నిర్మాతలు పవన్ కళ్యాణ్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నిర్మాతలు తెలిపిన సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సినిమా రంగానికి ప్రభుత్వం వైపు నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ సింగిల్ థియేటర్ల వివాదంపై డిప్యూటీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ పర్సంటేజ్ గొడవకు ఎలాంటి ముగింపు లభిస్తుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com