తండేల్ ట్రైలర్ రిలీజ్ ఇక అప్పుడే
on Jan 25, 2025
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga chaitanya)సాయిపల్లవి(Sai Pallavi)అప్ కమింగ్ మూవీ 'తండేల్'(Thandel).పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది.దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా 'తండేల్ 'కి సరైన ప్రమోషన్స్ రావడంలేదని అక్కినేని అభిమానులు కొన్ని రోజుల నుంచి ఆవేదన చెందుతున్నారు.
ఇప్పుడు అభిమానుల ఆవేదనని తెరదించుతు 'తండేల్' ని నిర్మిస్తున్నగీతా ఆర్ట్స్ లేటెస్ట్ అప్ డేట్ ని ఇచ్చింది.ఈ నెల 28 న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ తో అధికారకంగా వెల్లడి చేసింది.ఆ పోస్టర్ లో రక్తపు మరకలు ఉన్న బకెట్ ని పట్టుకొని చైతు ఫుల్ మాస్ రగ్గడ్ లుక్ లో ఉన్నాడు.దీంతో మూవీపై అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు.అతి త్వరలోనే ప్రమోషన్స్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్ లో జరిగేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తునట్టుగా తెలుస్తుంది.
ఇప్పటికే రిలీజైన టీజర్, ప్రచార చిత్రాలు అభిమానులు,ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి.చైతు,సాయిపల్లవి స్రీన్ మీద ఎలా చేశారనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి(Chandu Mondeti)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్(Devi SriPrasad)సంగీత దర్శకుడు కాగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళంకి చెందిన మత్స్యకారుడి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.అల్లు అరవింద్(Allu Aravind)నిర్మాత.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
