వాళ్ళ కోసం నాగ చైతన్య చేపల పులుసు వండింది నిజం
on Jan 17, 2025
యువసామ్రాట్ నాగచైతన్య,సాయి పల్లవి కాంబోలో తెరకెక్కిన మూవీ తండేల్.పాన్ ఇండియా లెవల్లో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్,బన్నీవాసు నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు ప్రచార చిత్రాలు కూడా తండేల్ పై అందరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తున్నాయి.
ఇక ఈ మూవీ ఉత్తరాంధ్ర కి చెందిన శ్రీకాకుళంలోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కింది.దీంతో రియాల్టీ కోసం ఎక్కువ భాగం ఉత్తరాంధ్ర లోని విశాఖపట్నం,శ్రీకాకుళంలోని పలు లొకేషన్స్ లో తండేల్ ని షూట్ చెయ్యడం జరిగింది.ఆ సమయంలో చైతన్య అక్కడి స్థానిక ప్రజలతోమాట్లాడుతు వాళ్ళ స్టైల్ లోనే చేపల పులుసు చేసి పెడతానని మాట ఇచ్చాడు.ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒక రోజు చైతన్య చేపల పులుసు వండి అక్కడి వారందరకీ వండి పెట్టడం జరిగింది.
అందుకు సంబంధించిన వీడియోని చిత్ర బృందం రీసెంట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చెయ్యగా,ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.ఫిబ్రవరి 7 న విడుదల కానున్న 'తండేల్' కి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం వహించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
