Home

»

Latest News

సూర్య కోసం పాట పాడిన నిత్యామీనన్..!

Apr 10, 2016 5:08PM

అవడానికి మళయాళీ అయినా, తెలుగమ్మాయే అనిపించేంతగా టాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించింది నిత్యామీనన్. తెలుగు పెర్ఫెక్ట్ గా నేర్చుకోవడంతో పాటు, పాటలు కూడా పాడేస్తోందీ కేరళకుట్టి. అలా మొదలైంది, ఇష్క్ సినిమాల్లో పాటలు పాడిన నిత్య, లేటెస్ట్ గా సూర్య 24 సినిమాలో పాట పాడింది. రెండు ఆస్కార్లు గెలిచిన ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఆయన సంగీత సారథ్యంలో తాను పాట పాడినందుకు క్లౌడ్ నైన్ లో ఉంది నిత్య. చంద్రబోస్ రాసిన లాలీజో అంటూ సాగే ఈ సాంగ్ ను నిత్యా మీనన్ ఆలపించింది. ఈ సోమవారం నాడు ఆడియో ఫంక్షన్ చేసి ' 24 ' పాటలు గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే, నిత్యా పాడిన పాట కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కావడం విశేషం. తమిళంలో శక్తి శ్రీ గోపాలన్ ఈ పాటను ఆలపించారు. సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com