స్టార్ దర్శకులతో సినిమాలు క్యాన్సిల్ చేసుకుంటున్న సూర్య.. ఏమైంది అసలు
on Jun 16, 2025
'సూర్య',(Suriya)'వెట్రిమారన్(Vetrimaaran) కాంబోలో 'వాడివాసన్' అనే టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కబోతున్నట్టుగా, మూడు సంవత్సరాల క్రితమే అధికార ప్రకటన వచ్చింది. ప్రజల మధ్య నిత్యం తిరుగుతుండే పలు సమస్యలకి సంబంధించిన కథల్ని తెరకెక్కించడంలో వెట్రి మారన్ ముందు వరుసలో ఉంటాడు. సూర్య ఇప్పటికే 'జై భీం' వంటి సామాజిక ప్రయోజనంతో కూడుకున్న చిత్రం చేసాడు. దీంతో ఆ ఇద్దరి కాంబోలో ఎలాంటి కథ తెరపైకి వస్తుందా అనే ఆసక్తితో పాటు, మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఎదురుచూస్తు ఉన్నారు.
కానీ తమిళ సర్కిల్స్ లో రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం వెట్రిమారన్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చెయ్యలేదని, సూర్య కి కూడా వేరే ప్రాజెక్ట్స్ ఉండటంతో, ఈ మూవీని ఆపేయయాలని అనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వెట్రిమారన్ ఇప్పుడు మరో సబ్జెట్ తో శింబుతో తన తదుపరి చిత్రాన్ని చెయ్యబోతునట్టుగా తెలుస్తుంది. సూర్య గతంలో గౌతమ్ మీనన్ తో చెయ్యాల్సిన ధ్రువనక్షత్రం నుంచి చివర నిమిషంలో తప్పుకున్నాడు. దీంతో ఆ మూవీ విక్రమ్ వద్దకు వెళ్ళింది. సూర్యకి పితా మగన్, నంద వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బాలా. అరుణ్ విజయ్ హీరోగా బాలా దర్శకత్వంలో వచ్చిన'వసంగాన్' లో మొదట సూర్య నే హీరో. అయితే సూర్య చివరి నిమిషంలో తప్పుకున్నాడు. ఇక సూర్య కి 'సురారై పోట్రు'తో జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన 'సుధాకొంగర' దర్శకత్వంలో అనుకున్న 'పురాణానూర్' కూడా సూర్య వదులుకున్నాడు. ఇప్పుడు ఆ మూవీని శివ కార్తికేయన్ తో సుధా కొంగర తెరకెక్కిస్తోంది. ఇలా రకరకాల కారణాలతో సూర్య బడా డైరెక్టర్ ల సినిమాలు వదులుకోవడంపై తమిళ సినీ సర్కిల్స్ లో ఆసక్తి కర చర్చ జరుగుతుంది.
జనవరి లో వచ్చిన 'కంగువ' ప్లాప్ తర్వాత గత నెల మేలో' రెట్రో'(Retro)తో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీ సూర్య కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఆర్ జె బాలాజీ దర్శకత్వంలోను, తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తోను సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ చిత్రాల ద్వారా అయినా సూర్య సక్సెస్ బాటలోకి వస్తాడేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
