
సూర్య అంటే పవర్ఫుల్ పోలీస్ పాత్రలు గుర్తొస్తాయి. కానీ ఈసారి ఆయన స్టైల్ పూర్తిగా డిఫరెంట్‌గా ఉంది. మలయాళ దర్శకుడు జీతు మాధవన్ తెరకెక్కిస్తున్న ‘సీన్’ సినిమాలో సూర్య డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సూర్య లుక్, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ చూస్తుంటే ఈసారి ప్రేక్షకులకు కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్లు కనిపిస్తోంది.
సాధారణంగా పోలీస్ పాత్రలు అంటే సీరియస్‌గా ఉండటం, నేరస్థులను వెంటాడటం, యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టడం చూస్తుంటాం. కానీ ‘సీన్’లో సూర్య పాత్ర మాత్రం కాస్త వింతగా, సరదాగా కనిపిస్తోంది. క్రైమ్ సీన్ దగ్గరకు వచ్చిన ఆయన.. అక్కడి పరిస్థితులను చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తుంటారు. పైగా పోలీసులు కేసు విచారిస్తున్న సమయంలో రీల్స్ తీసుకోవడం, వాటిని ఎలా షూట్ చేయాలో చెప్పడం వంటి సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఈ గ్లింప్స్‌లో వచ్చే ‘సిగరెట్లు తాగితే మగతనం తగ్గిపోతుందిరోయ్’ అనే డైలాగ్ కూడా నవ్వులు పూయిస్తోంది. చివర్లో కేసు ఇంకా సాల్వ్ కాలేదని చెప్పడంతో కథలో అసలు ట్విస్ట్ ఏంటనే ఆసక్తి పెరుగుతోంది. దీనికి తోడు ‘రెస్పెక్టా’ పాట బీట్లు సూర్య స్వాగ్‌కు సరిగ్గా సరిపోయాయి.
ఈ సినిమాలో మలయాళ నటుడు నస్లెన్ ఈశ్వరన్ అనే నెగెటివ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అతడి పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అందులో అతడి ప్రవర్తన చాలా భయంకరంగా చూపించారు.
అమెరికాలో ‘క్యాండీ మ్యాన్’గా పేరొందిన సీరియల్ కిల్లర్ డీన్ కోర్ల్ను పోలిన పాత్రగా ఈశ్వరన్‌ను తీర్చిదిద్దారనే ప్రచారం జరుగుతోంది. ఈశ్వరన్‌ను పట్టుకోవడానికి డీఎస్పీ ప్రేమ్‌రాజ్ ఎలాంటి ప్లాన్ చేస్తారు? ఈ ఇద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతోంది? అనేది సినిమాలో చూడాలి.
‘ఆవేశం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న జీతు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, జ్యోతిక తమ 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుండగా, నస్లెన్‌తో పాటు లాల్, ఆనంద్ రాజ్, రాజ్ ప్రియాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా వచ్చిన డీఎస్పీ ప్రేమ్‌రాజ్ గ్లింప్స్ మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ‘సీన్’ నవంబర్ 6, 2026న దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: ‘కింగ్’ న్యూ లుక్.. 60 ఏళ్ల వయసులోనూ లవర్ బాయ్‌గా షారుఖ్.!
[Suriya Scene Glimpse Telugu, Glimpse of DSP Premraj, Suriya, Scene Movie, Naslen, Nazriya Nazim, Jithu Madhavan, Telugu Film News]





