Home

»

Latest News

బ్రేకింగ్‌: నేరుగా ఓటీటీలో రిలీజ‌వుతున్న సూర్య 'ఆకాశం నీ హ‌ద్దురా'

Aug 23, 2020 5:09PM

 

ఇది బిగ్గెస్ట్ న్యూస్‌. ద‌క్షిణాదికి చెందిన ఒక టాప్ స్టార్ సినిమా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అది సూర్య హీరోగా న‌టించిన బ‌హు భాషా చిత్రం 'సూరారై పొట్రు'. అమెజాన్ ప్రైమ్ వీడియాలో ఆ సినిమా నేరుగా రిలీజ్ కానున్న‌ది. వినాయ‌క చ‌తుర్థి సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలుగులో ఈ సినిమా 'ఆకాశం నీ హ‌ద్దురా' పేరుతో అనువాద‌మ‌య్యింది. వాస్త‌వానికి 2020 సమ్మ‌ర్‌కే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది. సుధ కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు అక్టోబ‌ర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ఆర్మీ కెప్టెన్‌గా రిటైర‌య్యి, త‌క్కువ ఖ‌రీదు ఎయిర్‌లైన్ అయిన ఎయిర్ ద‌క్క‌న్‌ను స్థాపించిన జి.ఆర్‌. గోపీనాథ్ జీవితం ఆధారంగా 'సూరారై పొట్రు' రూపొందింది. అప‌ర్ణా బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టించ‌గా, మోహ‌న్‌బాబు, ప‌రేష్ రావ‌ల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. హీరోగా న‌టించ‌డంతో పాటు గునీత్ మోంగాతో క‌లిసి ఈ మూవీని సూర్య స్వ‌యంగా నిర్మించాడు.

ఈ సినిమా డిజిట‌ల్ రిలీజ్ గురించి సూర్య మాట్లాడుతూ, "అమెజాన్ ప్రైమ్‌లో త‌మ ఇళ్ల‌ల్లో నుంచే త‌మ‌కు వీలైన స‌మ‌యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కులు 'సూరారై పొట్రు' (ఆకాశం నీ హ‌ద్దురా) మూవీని చూడ‌వ‌చ్చ‌ని చెప్ప‌డానికి నేను సంతోషిస్తున్నాను. ఈ సినిమా మేం ప్రేమ‌తో శ్ర‌మించిన దాని ఫ‌లితం. గ్లోబ‌ల్ ఆడియెన్స్‌ను ఇది ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతున్నందుకు ఆనందంగా ఉంది" అని చెప్పాడు.

తెలుగు వెర్ష‌న్ 'ఆకాశం నీ హ‌ద్దురా'తో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం వెర్ష‌న్లు కూడా అక్టోబ‌ర్ 30న స్ట్రీమింగ్ అవ‌నున్నాయి. నేరుగా ఓటీటీ రిలీజ్ అవుతున్న దాన్ని బ‌ట్టి ఈ రేటుకు ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌కు అమ్మార‌నే చ‌ర్చ ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com