Home

»

Latest News

ప‌విత్ర‌తో రెండో పెళ్లికి సుమంత్ రెడీ అయ్యాడు!

Jul 28, 2021

 

హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తోంది. ఇప్పుడ‌ది నిజం కాబోతోంది. ప‌విత్ర అనే యువ‌తిని సుమంత్ పెళ్లాడుతున్నాడు. వ‌ధూవ‌రులు సంయుక్తంగా స‌న్నిహితులు, స్నేహితుల‌కు ఇన్విటేష‌న్ కార్డుల‌ను పంపారు. ఆ వెడ్డింగ్ కార్డుపై సుమంత్‌, ప‌విత్ర పేర్ల‌ను సూచించే ‘SP’ అనే అక్ష‌రాల‌ను ముద్రించారు. ఆడంబరాల‌కు పోకుండా సింపుల్‌గా ఈ వివాహాన్ని జ‌రుపుతున్నారు.

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు, నిర్మాత యార్ల‌గ‌డ్డ సురేంద్ర‌-అక్కినేని స‌త్య‌వ‌తి దంప‌తుల కుమారుడైన సుమంత్ 2004లో తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని వివాహం చేసుకున్నాడు. అయితే స్వ‌ల్ప కాలంలేనే ఇరువురి మ‌ధ్య అభిప్రాయ భేదాలు త‌లెత్తి, తీవ్ర‌త‌రం కావ‌డంతో రెండేళ్ల‌కే విడాకులు తీసుకున్నారు. అప్ప‌ట్నుంచీ ఒంట‌రిగానే జీవిస్తూ వ‌స్తున్నాడు సుమంత్‌. అయితే చాలా కాలం క్రిత‌మే ఆయ‌న ప‌విత్ర‌తో ప్రేమ‌లో ఉన్నాడ‌ని స‌మాచారం. ఇన్నాళ్ల‌కు ఆ ఇద్ద‌రూ జీవిత భాగ‌స్వాములు కాబోతున్నారు. పెళ్లి ఎక్క‌డ‌, ఎప్పుడ‌నేది వెల్ల‌డి కాలేదు.

ఇటీవ‌లి కాలంలో రానా, నితిన్‌, నిఖిల్‌, ప్ర‌ణీత‌, సంజ‌న‌, విష్ణు విశాల్, యామీ గౌత‌మ్‌ లాంటి తార‌లు పెళ్లి పీట‌లు ఎక్కారు. ఇప్పుడు సుమంత్ వంతు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com