Home

»

Latest News

సుకుమార్ సెంటిమెంట్.. రామ్ చరణ్ సినిమాతో ఆ రికార్డు బ్రేక్ అవుతుందా.?

Jul 20, 2026 11:46AM

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శకుడు సుకుమార్ కెరీర్ లో కూడా ఒక సెంటిమెంట్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. అదేమిటంటే ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకు ఏ ఒక్క హీరోయిన్ ను కూడా తన తదుపరి సినిమాల్లో రిపీట్ చేయలేదు. 

'ఆర్య' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన సుకుమార్, నిన్నమొన్నటి 'పుష్ప' సిరీస్ వరకు ప్రతి సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ను ఎంచుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్ 'RC17'తో ఈ హీరోయిన్ సెంటిమెంట్ బ్రేక్ కాబోతుందా అనే ఆసక్తికరమైన చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో సుకుమార్ ఎప్పుడూ ఒక హీరోయిన్ తో రెండోసారి పని చేయలేదు. కానీ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో మాత్రం ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. 

'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

రామ్ చరణ్ కోసం సుకుమార్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

'పుష్ప' సిరీస్ లో రష్మిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఒకవేళ 'RC17'లో ఆమె ఫైనల్ అయితే.. సుకుమార్ తన కెరీర్ లోనే మొదటిసారి హీరోయిన్ ను రిపీట్ చేసినట్లు అవుతుంది. 

మరి సుకుమార్ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రష్మికకే జై కొడతారా, లేక ఎప్పటిలాగే సరికొత్త ముద్దుగుమ్మను రంగంలోకి దించుతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

 

Ram Charan, Sukumar, RC17 Update, Rashmika Mandanna

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com