Home

»

Latest News

మ‌రోసారి జ‌క్క‌న్న పున‌ర్జ‌న్మ‌ల క‌థ‌

Jul 22, 2021 3:57PM

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి పున‌ర్జ‌న్మ‌ల క‌థ‌లు భ‌లేగా అచ్చొచ్చాయి.  పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థా చిత్రం `మ‌గ‌ధీర‌` (2009)తో ఏకంగా ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన జ‌క్క‌న్న‌.. అనంత‌రం ప్ర‌తీకారం నేప‌థ్యంలో రూపొందించిన `ఈగ‌` (2012)తోనూ అఖండ విజ‌యాన్ని అందుకున్నాడు. క‌ట్ చేస్తే.. ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ఫీట్ ని రిపీట్ చేయ‌నున్నాడ‌ట రాజ‌మౌళి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. వాస్త‌వ పాత్ర‌లు, క‌ల్పిత ఘ‌ట్టాల‌తో జ‌క్క‌న్న రూపొందిస్తున్న పిరియ‌డ్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`. ఇందులో చ‌రిత్ర పురుషులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీమ్ గా రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వేర్వేరు ప్రాంతాలు, నేప‌థ్యాలు ఉన్న ఈ ఇద్ద‌రు క‌లిస్తే ఎలా ఉంటుంది?  వారిద్ద‌రి మ‌ధ్య చిగురించే స్నేహం వాళ్ళ‌లో ఎలాంటి స్ఫూర్తి క‌లిగించింది? అనే క‌థాంశంతో ఈ పాన్ - ఇండియా మూవీని రూపొందిస్తున్నాడు జ‌క్క‌న్న. అయితే, ఈ సినిమాలో ఓ ట్విస్ట్ ఉంద‌ట‌. అదేమిటంటే.. ప‌తాక స‌న్నివేశాల ముందు అల్లూరి, కొమురం పాత్ర‌లు చ‌నిపోతాయి. ఈ నేప‌థ్యంలో.. మ‌ళ్ళీ వాళ్ళిద్ద‌రు మ‌రో జ‌న్మ ఎత్తి క‌లుసుకునే స‌న్నివేశాల‌తో సినిమా ముగుస్తుంద‌ట‌. మ‌రి.. ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.

కాగా, విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 13న‌ `ఆర్ ఆర్ ఆర్` థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com