Home

»

Latest News

సినిమా ఆశ చూపి హత్యలు: రియల్ స్టోరీతో తెరకెక్కిన మూవీ..ఏ ఓటిటిలో చూడొచ్చంటే!

Oct 31, 2026 4:10PM

 

ఇప్పుడు ఓటిటి ప్రియుల్ని చూసి కుళ్ళుకునే పరిస్థితి. మరి ఒకటా రెండా ఎన్ని రకాల జోనర్స్ ఉంటే అన్ని రకాల జోనర్స్ కి చెందిన సినిమాలు ఓటిటి సినీ ప్రియులు అంత అదృష్ట వంతులు లేరని అనుకునేలా కూడా చేస్తుంది. 

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5, 2025న విడుదలైన తమిళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ 'స్టీఫెన్' . ప్రస్తుతం డిజిటల్ వేదికగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. గోమతి శంకర్ ప్రధాన క్యారక్టర్ లో కనిపించగా  2021లో కేరళలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం. కేవలం 2 గంటల 3 నిమిషాల నిడివి గల ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.. 


కథ విషయానికి వస్తే.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామనే నమ్మకం కలిగించి తొమ్మిది మంది అమ్మాయిలని అత్యంత క్రూరంగా హత్య చేస్తాడు స్టీఫెన్ జెభరాజ్ అనే నిందితుడు. తీరా పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసే సమయానికి, తనే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. కోర్టులోనూ నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడిని 15 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తుంది. ఈ విచారణ సమయంలో వెలుగు చూసే షాకింగ్ నిజాలు, స్టీఫెన్ గత జీవితం, అతడు ఈ హత్యలు చేయడానికి దారితీసిన మానసిక పరిస్థితులు ఏమిటనే కోణంలో కథ ముందుకు సాగుతుంది.


ఇది కూడా చదవండి: మద్యానికి బానిసై: ఎంతో మందిని నవ్వించి 30 ఏళ్ళు అజ్ఞాతవాసం చేసి కన్నుమూసిన నటి!

 

 

మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్, వడివేల్, విజయశ్రీ వంటి నటులు తమ క్యారెక్టర్స్ తో   సినిమాకి మరింత బలాన్ని చేకూర్చారు. మొదటి గంటలో కథనం కొంచెం నెమ్మదిగా సాగినప్పటికీ, సెకండాఫ్‌లో ఒక్కొక్కటిగా బయటపడే ట్విస్టులు ప్రేక్షకుడి మెదడుకు పదును పెట్టేలా ఉంటాయి. ముఖ్యంగా సినిమా చివరి 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ థ్రిల్‌  పంచుతూ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ఊహించని మలుపులు, భయానక వాతావరణం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని వీకెండ్‌లో చూసేందుకు చక్కటి ఆప్షన్‌గా చెప్పవచ్చు.

 

[Stephen Movie In Netflix, Stephen ott Movie Review, Stephen movie, Netflix OTT, psychological thriller, serial killer film, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com